X

Osmania University: ఓయూలో ఫ్యాకల్టీ స్టూడెంట్స్‌కు కొత్తగా రీసెర్చ్ అవార్డులు.. వీసీ వెల్లడి, పూర్తి వివరాలివీ..

ఈ అవార్డులను మూడు కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3లో ఈ శాఖలు ఉండనున్నాయి.

FOLLOW US: 

ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ మెంబర్స్‌కు వైస్ ఛాన్స్‌లర్ రీసెర్చ్ అవార్డులను ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది. మొదటి విడత అవార్డుల ప్రదాన కార్యక్రమం జనవరి 3న ఓయూ క్యాంపస్‌లోనే ఈ అవార్డుల కార్యక్రమం ఉంటున్నట్లుగా బుధవారం ఓయూ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డులను మూడు కేటగిరీలుగా విభజించారు. ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్, కామర్స్, మేనేజ్‌మెంట్, లా ఎడ్యుకేషన్, ఓరియంటల్ కేటగిరీ 1లో చేర్చారు. ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఇన్ఫర్మేటిక్స్, ఫార్మసీ వంటి వాటిని రెండో కేటగిరీలో చేర్చారు. మిగిలిన అన్ని శాఖలు మూడో కేటగిరీలో ఉంటాయి.

ఈ అవార్డులను వర్సిటీలో తొలిసారిగా ఏర్పాటు చేసి ఇస్తున్నారు. ప్రతి విభాగంలో ఒక అధ్యాపకుడికి ప్రశంసా పత్రం, సర్టిఫికేట్, నగదు బహుమతిని ఇస్తారు. సంబంధిత అధ్యాపకుల డీన్‌ల నేతృత్వంలోని నిపుణుల కమిటీ ద్వారా ఎవరికి అవార్డులు ఇవ్వాలనే వారి ఎంపిక జరుగుతుంది. 2020 డిసెంబర్ నుంచి 2021 నవంబర్ నెలాఖరు వరకూ డీన్లుగా వ్యవహరించిన వారు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అవార్డుల కోసం దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 20.

ఇలా అవార్డులు ఇచ్చే కార్యక్రమ ఉద్దేశం గురించి ఓయూ వీసీ డాక్టర్ డి.రవీందర్ యాదవ్ వివరించారు. వర్సిటీ అధ్యాపకులు జాతీయ, అంతర్జాతీయంగా పీర్-రివ్యూడ్ జర్నల్స్‌లో ఉత్తమ పరిశోధనల పబ్లిషింగ్‌లో వెనుకబడి ఉన్నారని చెప్పారు. ‘‘రీసెర్చ్, టీచింగ్, ట్రైనింగ్ మా ప్రాధాన్యత. ఈ అవార్డులతో, మేము యువ పరిశోధకులను వారి పనిలో రాణించేలా ప్రోత్సహించాలనుకుంటున్నాం. ప్రఖ్యాత జర్నల్స్‌లో అధిక-ప్రభావ రీసెర్చ్ రిజల్ట్స్, పరిశోధన ప్రాజెక్ట్‌లను ప్రచురించాలని అనుకుంటున్నాం. నేను వీసీగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అధ్యాపకులు అదే పనిలో ఉన్నారు’’ అని డాక్టర్ రవీందర్ యాదవ్ అన్నారు. జనవరి 3న కార్యక్రమంలో ఒక ఉపన్యాసం ఇవ్వడానికి, అవార్డులను అందించడానికి తాము ఒక ప్రముఖ శాస్త్రవేత్తను ఆహ్వానిస్తున్నట్లు ఆయన చెప్పారు.

Also Read: Visa Interview: అబ్బా.. చీ.. వీసా ఇంటర్వ్యూ మళ్లీ పోయింది.. ఎలా ప్రయత్నిస్తే బెటర్ అంటారు?

Also Read: ప్రపంచానికి చదువు చెప్పిన భారతదేశం.. ఈ యూనివర్శిటీలో ఫీజులు కట్టక్కర్లేదు, పరీక్షలు ఉండవు..

Also Read: CBSE Question: గుజరాత్ అల్లర్లకు ఎవరు కారణం.. ఆప్షన్స్.. కాంగ్రెస్, బీజేపీ, డెమోక్రటిక్, రిపబ్లికన్.. పరీక్షలో సీబీఎస్ఈ ప్రశ్న

Also Read: ట్విట్టర్ నుంచి గుగూల్ సీఈవో వరకు అగ్రస్థానంలో ఉన్న.. ఐఐటీ, ఐఐఎమ్ గ్రాడ్యుయేట్లు వీళ్లే.. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Osmania University OU VC ravindra Yadav Research Awards in OU Osmania University News

సంబంధిత కథనాలు

Fact Check CBSE :  సీబీఎస్‌ఈ ఫలితాలపై ఆ పోస్ట్ ఫేక్ .. ఇదిగో నిజం !

Fact Check CBSE : సీబీఎస్‌ఈ ఫలితాలపై ఆ పోస్ట్ ఫేక్ .. ఇదిగో నిజం !

TS Schools: ఈ నెల 31 నుంచి విద్యాసంస్థలు తెరిచే అవకాశం... ప్రత్యక్ష తరగతుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు...!

TS Schools: ఈ నెల 31 నుంచి విద్యాసంస్థలు తెరిచే అవకాశం... ప్రత్యక్ష తరగతుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు...!

PG Medical Web Options: నేటి నుంచి పీజీ మెడికల్ వెబ్ ఆఫ్షన్లు... కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు నోటిఫికేషన్

PG Medical Web Options: నేటి నుంచి పీజీ మెడికల్ వెబ్ ఆఫ్షన్లు... కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు నోటిఫికేషన్

Vizag IIPE: పెట్రోలియం వర్సిటీకి సొంత క్యాంపస్, 157.36 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

Vizag IIPE: పెట్రోలియం వర్సిటీకి సొంత క్యాంపస్, 157.36 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

మొబైల్‌, యాప్స్‌ అప్‌డేట్‌ చేస్తున్నారు సరే... మరి మీరు అప్‌డేట్‌ అవ్వరా?... అలా కాకుంటే ఎంత ప్రమాదమో ఎప్పుడైనా ఆలోచించారా?

మొబైల్‌, యాప్స్‌ అప్‌డేట్‌ చేస్తున్నారు సరే... మరి మీరు అప్‌డేట్‌ అవ్వరా?... అలా కాకుంటే ఎంత ప్రమాదమో ఎప్పుడైనా ఆలోచించారా?

టాప్ స్టోరీస్

Samantha: సమంత సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోయింది!

Samantha: సమంత సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోయింది!

Student Suicide: ఇంజినీరింగ్ మ్యాథ్స్‌ పరీక్ష లెక్క తప్పింది.. నిండు ప్రాణం పోయింది

Student Suicide: ఇంజినీరింగ్ మ్యాథ్స్‌ పరీక్ష లెక్క తప్పింది.. నిండు ప్రాణం పోయింది

Naga Chaitanya Web Series Title: అక్కినేని నాగచైతన్య వెబ్ సిరీస్.. ఆసక్తి కలిగిస్తున్న టైటిల్

Naga Chaitanya Web Series Title: అక్కినేని నాగచైతన్య వెబ్ సిరీస్.. ఆసక్తి కలిగిస్తున్న టైటిల్

Tirumala Sarva Darshan Tickets: నిన్న ప్రత్యేక దర్శనం టికెట్లు మిస్సయ్యారా.. నేడు సర్వ దర్శనం టికెట్లు విడుదల

Tirumala Sarva Darshan Tickets: నిన్న ప్రత్యేక దర్శనం టికెట్లు మిస్సయ్యారా.. నేడు సర్వ దర్శనం టికెట్లు విడుదల