By: ABP Desam | Updated at : 22 Jun 2023 04:44 PM (IST)
Edited By: omeprakash
తెలంగాణలో కొత్త మెడికల్ కాలేజీలు
తెలంగాణలో మరో 8 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్ర వైద్య విద్య కమిషనర్ కె.రమేష్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. 2024-25 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చేలా వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 26 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా వీటిలో గాంధీ, ఉస్మానియా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. మిగిలినవి 24 జిల్లాల్లో ఉన్నాయి. నారాయణపేట, మెదక్, గద్వాల, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొత్తవి ఏర్పాటు కానున్నాయి. వీటికి స్థల సేకరణ కొలిక్కి వస్తోంది.
మెదక్, నారాయణపేటలలో స్థలాల ఎంపిక పూర్తికాగా మిగిలిన వాటికి వారం రోజుల్లో పూర్తి చేసేలా కలెక్టర్లు దృష్టిసారించారు. మరోవైపు బోధనాసుపత్రుల్లో కొత్తగా నియమితులైన 806 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు విధుల్లో చేరారు. వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఈ విషయం తెలిపాయి.
ALSO READ:
నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఏడాది రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఏడాది నవంబరు 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభంకాగా, ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ప్రవేశ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఏకకాలంలో మెడికల్ కౌన్సెలింగ్‌కు కాళోజీ యూనివర్సిటీ అంగీకారం, ఆగస్టులో కౌన్సెలింగ్!
తెలంగాణలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఏకకాలంలో నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)కి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ తెలియజేసింది. ఆలిండియా కోటా సీట్లకు ఎన్‌ఎంసీ జాతీయ కౌన్సెలింగ్ నిర్వహించే తేదీల్లోనే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. కౌన్సెలింగ్ నిర్వహణకు కనీసం నెల రోజుల సమయం అవసరమని తెలిపింది. ఆగస్టులో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేసినట్లు సమాచారం.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సింగరేణి కాలరీస్‌లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ, అర్హత వివరాలు ఇలా!
తెలంగాణలోని కొత్తగూడెంలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఐ మార్కులు, సీనియారిటీ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
'జోసా' రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం, కౌన్సెలింగ్ పూర్తి వివరాలు ఇలా!
జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల ప్రక్రియ పూర్తవడంతో.. సంబంధిత కళాశాలల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియను జోసా(జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ) జూన్ 19న ప్రారంభమైంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఆప్షన్ల ఎంపిక కోసం ప్రత్యేక లింక్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు జేఈఈ మెయిన్ అప్లికేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదుచేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రాంభించాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
LAWCET: లాసెట్ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు
CSIR UGC NET 2023: సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 దరఖాస్తు గడువు పొడిగింపు - ఎప్పటివరకంటే?
JEE Main 2024: జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
జేఈఈ మెయిన్ దరఖాస్తుకు ముగుస్తోన్న గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి
Counting Centers in Telangana: ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం - ఓట్ల లెక్కింపునకు జిల్లాల వారీగా కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూంల వద్ద భారీ భద్రత
YSRCP Leader Arrest in US : బానిసత్వం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు - అమెరికాలో వైసీపీ నేత సత్తారు వెంకటేష్ రెడ్డి అరెస్ట్ !
Animal Movie Review - యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?
భారత్, ఆస్ట్రేలియా T20 మ్యాచ్ జరిగే స్టేడియంలో పవర్ కట్, రూ.3 కోట్ల బిల్ పెండింగ్
/body>