అన్వేషించండి

KNRUHS: ఏకకాలంలో మెడికల్ కౌన్సెలింగ్‌కు కాళోజీ యూనివర్సిటీ అంగీకారం, ఆగస్టులో కౌన్సెలింగ్!

తెలంగాణలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఏకకాలంలో నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు ఎన్ఎంసీకి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ తెలియజేసింది.

తెలంగాణలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఏకకాలంలో నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)కి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ తెలియజేసింది. ఆలిండియా కోటా సీట్లకు ఎన్‌ఎంసీ జాతీయ కౌన్సెలింగ్ నిర్వహించే తేదీల్లోనే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. కౌన్సెలింగ్ నిర్వహణకు కనీసం నెల రోజుల సమయం అవసరమని తెలిపింది. ఆగస్టులో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేసినట్లు సమాచారం.

కామన్ కౌన్సెలింగ్‌పై వ్యతిరేకత..
రాష్ట్రాల్లోని కన్వీనర్ కోటా సీట్లను కూడా జాతీయ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తామని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయాలు తెలపాలని ఇప్పటికే ఎన్‌ఎంసీ కోరింది. కొన్ని రాష్ట్రాలు ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌ను ఆలస్యంగా నిర్వహించడంతో పాటు సీట్ల భర్తీ పారదర్శకంగా ఉండటం లేదని పేర్కొంటూ.. కామన్ కౌన్సెలింగ్‌కు మూడేళ్ల క్రితం ప్రతిపాదించింది. ఏటా కౌన్సెలింగ్ సమయంలో రాష్ట్రాలకు లేఖలు రాస్తోంది. ఇటీవల రాష్ట్ర డీఎంఈకి ఎన్‌ఎంసీ లేఖ పంపింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతోంది. కామన్ కౌన్సెలింగ్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనున్నట్లు సమాచారం.

కళాశాలలు, సీట్ల వివరాలు ఇలా..

⏩ మొత్తం వైద్య కళాశాలలు: 56 

⏩ ప్రభుత్వ వైద్య కళాశాలలు: 26 

⏩ ఈఎస్‌ఐ కాలేజీ: 1, 

⏩ ప్రైవేటు కాలేజీలు: 29 

⏩ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తం సీట్లు: 3,540 (546 ఆలిండియా కోటా) 

⏩ ఈఎస్‌ఐ కాలేజీలో సీట్లు: 100 (15 సీట్లు ఆలిండియా కోటా) 

⏩ ప్రైవేటు కాలేజీల్లో మొత్తం సీట్లు: 4,800 (2,400 కన్వీనర్ కోటా) 

⏩ కన్వీనర్ కోటాలో మొత్తం సీట్లు: 5,494 

⏩ నీట్-యూజీలో రాష్ట్రం నుంచి అర్హత సాధించినవారు: 42,654 మంది 

⏩ ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లు(50 శాతం) కాగా, మిగిలిన వాటిలో 35 శాతం బీ కేటగిరీ, 15 శాతం సీ కేటగిరీ సీట్లు. 

అభ్యంతరాలివీ..

➥ రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్లు పూర్తి పారదర్శకంగా భర్తీ అవుతున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం సీట్లు అఖిల భారత కోటా కింద మినహాయించుకుంటే.. మిగిలిన 85 శాతం సీట్లను పూర్తి పారదర్శకంగా మెరిట్ ఆధారంగా ఆన్‌లైన్‌లో భర్తీ చేస్తున్నాం. 

➥ ప్రైవేటు కళాశాలల్లోని ఎంబీబీఎస్ సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటా సీట్లను కౌన్సెలింగ్‌లోనే భర్తీ చేస్తున్నాం. 

➥ జాతీయ కౌన్సెలింగ్ ద్వారా రిజర్వేషన్ల అమలులో సమస్యలు ఎదురవుతాయి. ప్రధానంగా ఓబీసీ/బీసీ కోటా సీట్ల భర్తీలో సమస్యలు ఎదురై.. న్యాయపరమైన వివాదాలకు దారితీస్తుంది. 

➥ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య 15 శాతం సీట్ల పంపిణీ అమలులో ఉంది. కామన్ కౌన్సెలింగ్ వల్ల దీన్ని అమలు చేయడం సమస్యగా మారుతుంది. 

ALSO READ:

ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఏపీలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ ఉన్నత విద్యామండలి జూన్ 18న ఆన్‌లైన్ అడ్మిషన్స్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (OAMDC) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ/ఎయిడెడ్/ప్రైవేటు అన్ఎయిడెడ్/అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బి.వొకేషనల్, బీఎఫ్‌ఏ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరేందుకు జూన్ 19 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. 
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

'జోసా' రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం, కౌన్సెలింగ్ పూర్తి వివరాలు ఇలా!
జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల ప్రక్రియ పూర్తవడంతో.. సంబంధిత కళాశాలల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియను జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) జూన్ 19న ప్రారంభమైంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఆప్షన్ల ఎంపిక కోసం ప్రత్యేక లింక్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు జేఈఈ మెయిన్ అప్లికేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదుచేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రాంభించాల్సి ఉంటుంది. 
కౌన్సెలింగ్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Embed widget