అన్వేషించండి

SHRESTA NETS 2024: ‘శ్రేష్ఠ’ ప్రవేశ పరీక్ష తేదీలో మార్పు, కొత్త తేదీ ఇదే

దేశంలో ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులకు సీబీఎస్‌ఈ (CBSE) అనుబంధ గురుకులాల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ (SHRESHTA- NETS 2024) పరీక్ష తేదీ మారింది.

SHRESHTA NETS 2024: దేశంలో ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులకు సీబీఎస్‌ఈ (CBSE) అనుబంధ గురుకులాల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ (SHRESHTA- NETS 2024) పరీక్ష తేదీ మారింది. దేశంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పరీక్ష తేదీల్లో మార్పు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ పరీక్షను షెడ్యూల్ కన్నా ముందే నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. కేంద్ర సామాజిక న్యాయం-సాధికార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షను తొలుత మే 24న జరపాలని నిర్ణయించగా.. ఎన్నికల నేపథ్యంలో మే 11కు మార్చినట్లు ఎన్‌టీఏ (NTA) మార్చి 20న ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త షెడ్యూలు ప్రకారం మే 11న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష జరిగిన నాలుగు నుంచి ఆరు వారాల్లో ఫలితాలు ప్రకటించనున్నారు. 

ఏప్రిల్‌ 4 వరకు దరఖాస్తులు..
పరీక్ష కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 12న ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్‌ 4 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మే 24న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 'శ్రేష్ఠ' పథకం ద్వారా దేశవ్యాప్తంగా 3 వేల సీట్లను భర్తీ చేస్తారు. ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన ఎస్సీ విద్యార్థులు సీబీఎస్‌ఈ అనుబంధ ప్రైవేటు విద్యాసంస్థల్లో 9, 11వ తరగతుల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది.

వివరాలు..

➥ నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ శ్రేష్ఠ- నెట్స్‌ 2024

అర్హత: విద్యార్థులు ప్రస్తుత విద్యాసంవత్సరం(2023-24)లో 8, 10వ తరగతులు చదువుతుండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం 2.5 లక్షలకు మించకూడదు.

వయోపరిమితి: 9వ తరగతిలో ప్రవేశాలు కోరువారు 31.03.2024 నాటికి 12-16 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.04.2008 - 31.03.2012 మధ్య జన్మించి ఉండాలి. ఇక 11వ తరగతిలో ప్రవేశాలు కోరువారు 31.03.2024 నాటికి 14-18 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.04.2006 - 31.03.2010 మధ్య జన్మించి ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ర్యాంకు ఆధారంగా.

పరీక్ష విధానం..
* మొత్తం 400 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కేటాయించారు. ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు. ఇందులో మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు, సైన్స్-20 ప్రశ్నలు, సోషల్ సైన్స్-25 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్/నాలెడ్జ్-25 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 3 గంటలు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 04.04.2024 (05:00 P.M.)

➥ దరఖాస్తుల సవరణ: 06.04.2024 - 08.04.2024 (05:00 P.M.)

➥ అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్: 12.05.2024 నుంచి. 

➥ పరీక్ష తేదీ: 24.05.2024.

పరీక్ష సమయం: 02.00 PM to 05.00 PM (3 గంటలు)

➥ ఫలితాల వెల్లడి: పరీక్ష తర్వాత 4 - 6 వారాల్లో.

Notification

Online Application

Website

Related  Articles:

పాలీసెట్‌ అభ్యర్థులకు అలర్ట్‌, పరీక్ష షెడ్యూలులో మార్పు, కొత్త తేదీ ఇదే!
ఐసీఏఐ సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షల కొత్త షెడ్యూలు విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే!
 
ఐసీఎస్‌ఐ సీఎస్ పరీక్షల తేదీల్లో మార్పులు, కొత్త షెడ్యూలు ఇదే
 
ఏపీ ఎప్‌సెట్-2024 పరీక్ష తేదీల్లో మార్పు, పీజీసెట్ తేదీ మారే అవకాశం!
 
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్-2024 పరీక్ష వాయిదా - కొత్త తేదీ ఇదే
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
Embed widget