అన్వేషించండి

APEAPCET: ఏపీ ఎప్‌సెట్-2024 పరీక్ష తేదీల్లో మార్పు, పీజీసెట్ తేదీ మారే అవకాశం!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే (AP EAPCET)-2024 పరీక్ష షెడ్యూల్ మారనుంది. మే 15 నుంచి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

AP EAPCET 2024: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎప్‌సెట్(AP EAPCET)-2024 పరీక్ష షెడ్యూల్ మారనుంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 13 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. అదే రోజున పోలింగ్ ఉండటంతో పరీక్ష వాయిదా వేయాలని నిర్ణయించారు. అయితే మే 15 నుంచి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏపీ ఎప్‌సెట్-2024 పరీక్ష తేదీ మార్పుతో ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లోనూ స్వల్ప మార్పులు చేసుకునే అవకాశం ఉంది. పీజీ సెట్ జూన్ 3 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉండటంతో ఈ పరీక్ష తేదీని మార్పు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది.

ఈ ఏడాది జేఎన్‌టీయూ కాకినాడ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. జేఎన్‌టీయూకే ప్రొఫెసర్ కె.వెంటక రెడ్డి ఏపీఈఏపీసెట్ 2024 కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.  ఎప్‌సెట్ ద్వారా 2024 విద్యాసంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రిక‌ల్చర్/ హార్టికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ/ ఫిషరీస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 

ఏప్రిల్ 15 వరకు ఎప్‌సెట్ దరఖాస్తులు.. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఈఏపీసెట్-2024 నోటిఫికేషన్ మార్చి 11న వెలువడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 12న ప్రారంభమైంది. విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ విభాగాలకు దరఖాస్తు చేసుకునే ఓసీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఇక బీసీ అభ్యర్థులు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థుల నుంచి రూ.500 ఆలస్యరుసుముతో  ఏప్రిల్ 30 వరకు, రూ.1000 ఆలస్యరుసుముతో  మే 5 వరకు, రూ.5000 ఆలస్యరుసుముతో  మే 10 వరకు, రూ.10,000 ఆలస్యరుసుముతో  మే 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

వివరాలు..

* ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ &‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీసెట్) - 2024 

ప్రవేశాలు కల్పించే కోర్సులు:

➥ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, బీటెక్‌(డెయిరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ)

➥ బీఎస్సీ(అగ్రికల్చర్), బీఎస్సీ(హార్టికల్చర్), బీవీఎస్సీ &‌ హెచ్, బీఎఫ్‌ఎస్సీ

➥ బీఫార్మసీ, ఫార్మా-డి.

➥ బీఎస్సీ (నర్సింగ్).

అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (ఎంపీసీ/ బైపీసీ) లేదా ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం ఇంటర్‌ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా డిప్లొమా(ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్‌లో 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి..

➥ ఇంజినీరింగ్, ఫార్మసీ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 31.12.2024 నాటికి 16 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.

➥ అగ్రికల్చర్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 31.12.2024 నాటికి 17- 22 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. అగ్రికల్చర్ విభాగాలకు ఎస్సీ, ఎస్టీలకు 3 సంవత్సరాల వరకు (25 సంవత్సరాలు) వయోసడలింపు వర్తిస్తుంది. 

➥  బీఎస్సీ నర్సింగ్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 31.12.2024 నాటికి 17- 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. అగ్రికల్చర్ విభాగాలకు ఎస్సీ, ఎస్టీలకు 3 సంవత్సరాల వరకు, దివ్యాంగులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 

రిజిస్ట్రేషన్ ఫీజు..

➥ ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ విభాగాలకు దరఖాస్తు చేసుకునే ఓసీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఇక బీసీ అభ్యర్థులు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

➥ రెండు విభాగాలకూ దరఖాస్తు చేసుకునే ఓసీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1200 చెల్లించాలి. ఇక బీసీ అభ్యర్థులు రూ.1100, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ర్యాంకు ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు...

➥  నోటిఫికేషన్ వెల్లడి: 11.03.2024.nn 

➥  ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.04.2024.

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 04.05.2024 to 06.05.2024

➥  రూ.500 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.04.2024.

➥  రూ.1000 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.05.2024.

➥  రూ.5000 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.05.2024.

➥  రూ.10000 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.05.2024.

➥  హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 07.05.2024.

➥ ఏపీ ఈఏపీసెట్ పరీక్ష తేదీలు..

ఇంజినీరింగ్ విభాగాలకు: 13.05.2024 - 16.05.2024. (పరీక్షలు 15.05.2024 నుంచి ప్రారంభమ్యే అవకాశం ఉంది)

అగ్రికల్చర్ & ఫార్మా కోర్సులకు: 17.05.2024 - 19.05.2024

Notification

Online Application

Fee Payment for AP EAPCET - 2024

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget