అన్వేషించండి

No Discrimination In The Vedas: వేదాలలో ఎలాంటి వివక్ష లేదు, భారత్‌లో గొప్ప సంస్కృతి.. పతంజలి గురుకుల ఉత్సవంలో స్వామి రాందేవ్

వేదాలలో వివక్షత లేదని, పురాతన సంప్రదాయాలు భవిష్యత్ నాయకులను తయారు చేస్తాయని పతంజలి విశ్వవిద్యాలయంలో స్వామి రాందేవ్ అన్నారు.

Patanjali University | పతంజలి విశ్వవిద్యాలయంలో పతంజలి గురుకులం వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా స్వామి రామ్‌దేవ్ పురాతన గురుశిష్యుల (గురువు-శిష్యుడు) సంప్రదాయాన్ని ప్రశంసించారు. పతంజలి గురుకులం ప్రపంచానికి నాయకులుగా విద్యార్థులను సిద్ధం చేస్తుందన్నారు.

భారతీయ విద్యా మండలి (Indian Education Board) ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులం ప్రముఖ సాధువుల సమక్షంలో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా పతంజలి యోగపీఠ్ అధ్యక్షుడు స్వామి రామ్‌దేవ్ మాట్లాడుతూ.. ప్రాచీన గురుకులాల్లో విద్యార్థులకు కేవలం జ్ఞానాన్ని మాత్రమే కాకుండా నైతికత, స్వచ్ఛత, మాట, ప్రవర్తనలో వినయం, క్రమశిక్షణతో కూడిన విధానాలను బోధించేవారని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వామి రామ్‌దేవ్ మాట్లాడుతూ.. “ప్రాచీన కాలంలో గురుకులాల్లో విద్యనభ్యసించిన విద్యార్థులు ప్రపంచానికి మార్గదర్శకులుగా ఉండేవారు. అదే పురాతన ఋషి సంప్రదాయాన్ని అనుసరిస్తూ, పతంజలి గురుకులంలో చదివే తన విద్యార్థులను ప్రపంచ నాయకత్వానికి సిద్ధం చేస్తోందని”  అన్నారు. పతంజలి గురుకులంలో దాదాపు అన్ని రాష్ట్రాల నుండి 3 నుండి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లల నుండి 12వ తరగతి వరకు చదువుతున్నారు. మహర్షి దయానంద్, లార్డ్ బసవన్న, సెయింట్ జ్ఞానేశ్వర్, సెయింట్ మణిబదేవ్శ్వర్, సెయింట్ రవిదాస్, సెయింట్ కబీర్‌దాస్ వంటి గొప్ప సాధువులు ఎన్నో  మూఢనమ్మకాలు, సామాజిక అవరోధాలు, వివక్ష గోడల్ని బద్దలు కొట్టారు. సమాజానికి ఐక్యత, సహజీవనం, సామరస్యం గురించి సందేశం ఇచ్చారని” పేర్కొన్నారు.

వేదాలలో ఏ వివక్ష లేదు

స్వామి రామ్‌దేవ్ ఇంకా మాట్లాడుతూ.. మొత్తం సృష్టిలో ఒక బ్రహ్మ, పరమ శక్తి ప్రతిచోటా ఉంది. సనాతన ధర్మం ఈ దైవిక సత్యాలు, శాశ్వత సందేశాలు మానవాళికి పూర్తిగా అందాయి. వేదాలలో ఎవరి మీద ఎలాంటి వివక్ష లేదన్నారు. పతంజలి గురుకులంలోని ఆచార్యులు విద్యార్థులను తీర్చిదిద్దడంలో, అత్యుత్తమ ఫలితాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

భారతీయ సంస్కృతికి గురుకులం ఒక ఉదాహరణ

ఈ కార్యక్రమంలో జునా పీఠ్ అధిపతి ఆచార్య మహా మండలేశ్వర్ స్వామి అవధేశానంద్ గిరి జీ మహారాజ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. “పతంజలి గురుకులం భారత ప్రాచీన సంస్కృతి, వేదాలు, వాటి విలువలు, పురాతన సంప్రదాయాలను సంరక్షించడానికి, పెంపొందించడానికి ప్రయోగశాలగా పనిచేస్తుంది. ఈ గురుకులలా విద్యార్థులలో ఉన్నతమైన మానవ చైతన్యం ఉంటుంది. స్వామి రామ్‌దేవ్ వెలిగించిన పతంజలి గురుకులం అనే దీపం ప్రపంచమంతా కాంతిని అందిస్తుందన్నారు. 

‘పిల్లలకు మన సంస్కృతిని నేర్పిస్తున్నారు’

పతంజలి గురుకులం భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలు, నమ్మకాలను బలోపేతం చేసిందన్నారు ఆచార్య బాలకృష్ణ. ఆయన మాట్లాడుతూ.. పతంజలిలో పిల్లలు జ్ఞానంతో పాటు విలువలను నేర్చుకుంటున్నారు. ఈ కారణంగా తమ పిల్లలను ఇక్కడకి పంపిన తల్లిదండ్రులు ఎంతో గర్వపడుతున్నారు, ఎందుకంటే వారి కలలు పతంజలి ద్వారా నెరవేరుతున్నాయని పేర్కొన్నారు.

పర్మార్ధ్ నికేతన్ రిషికేష్ అధ్యక్షుడు స్వామి చిదానంద్ ముని మాట్లాడుతూ.. “పతంజలి గురుకులంలోని పిల్లలను చూసి, భవిష్యత్ తరాలకు ఈ శాశ్వత సత్యాలను వెల్లడించాల్సిన ప్రాముఖ్యతను గుర్తించాను. దురదృష్టవశాత్తు మన దేశంలో ప్రచురించాల్సిన దాచారు. అవసరం లేనిది ప్రచారం చేస్తున్నారు. భారతదేశ చరిత్రకు నిజమైన పునాది సనాతన ధర్మంలోనే ఉంది. భారత్ తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతోంది. పతంజలి గురుకులం ఆ విషయంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో పతంజలి గురుకులం అకాడమిక్, క్రీడలు, స్క్రిప్చర్ పోటీలలో విజేతలుగా నిలిచిన వారిని సత్కరించారు. పతంజలి గురుకుల్ జ్వాలాపూర్, పతంజలి కన్య గురుకులం దేవప్రయాగ్, పతంజలి గురుకులం హరిద్వార్‌లకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శన చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pilot Shortage In India: భారత్ విమానయాన రంగంలో పైలట్ల కొరత- శిక్షణ పొందే వాళ్లకు ఉద్యోగాలు గ్యారంటీ!
భారత్ విమానయాన రంగంలో పైలట్ల కొరత- శిక్షణ పొందే వాళ్లకు ఉద్యోగాలు గ్యారంటీ!
IndiGo financial losses: ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
​​Telangana Rising Global Summit 2025 : ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
Japan Tsunami warning: జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ
జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ
Advertisement

వీడియోలు

MP Sudha Murty Rajya Sabha Speech on Social Media | రాజ్యసభలో సోషల్ మీడియాపై సుధామూర్తి | ABP Desam
Gambhir Warning to DC Owner | ఐపీఎల్ ఓనర్ కు గంభీర్ వార్నింగ్
DK Shivakumar Chinnaswamy Stadium IPL 2026 | ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ పై శివకుమార్ ట్వీట్
Ravi Shastri Comments on Team India | టీమిండియాపై రవిశాస్త్రి ఫైర్
Coach Gautam Gambhir About Ro - Ko | రో - కో జోడీపై గంభీర్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pilot Shortage In India: భారత్ విమానయాన రంగంలో పైలట్ల కొరత- శిక్షణ పొందే వాళ్లకు ఉద్యోగాలు గ్యారంటీ!
భారత్ విమానయాన రంగంలో పైలట్ల కొరత- శిక్షణ పొందే వాళ్లకు ఉద్యోగాలు గ్యారంటీ!
IndiGo financial losses: ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
​​Telangana Rising Global Summit 2025 : ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
Japan Tsunami warning: జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ
జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ
Actor Rajasekhar Injured: నటుడు రాజశేఖర్‌ కాలి సర్జరీ విజయవంతం! గత నెలలో షూటింగ్‌లో గాయపడ్డ యాంగ్రీస్టార్‌!
నటుడు రాజశేఖర్‌ కాలి సర్జరీ విజయవంతం! గత నెలలో షూటింగ్‌లో గాయపడ్డ యాంగ్రీస్టార్‌!
AP CM Chandrababu: కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
IAS Kata Amrapali: తెలంగాణకు వచ్చేందుకు ఐఏఎస్ అమ్రపాలి ప్రయత్నాలు మళ్లీ విఫలం - క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
తెలంగాణకు వచ్చేందుకు ఐఏఎస్ అమ్రపాలి ప్రయత్నాలు మళ్లీ విఫలం - క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
IndiGo crisis: ఇండిగోనే తప్పు చేసింది - సమస్యను మేం పర్యవేక్షించడం లేదు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఇండిగోనే తప్పు చేసింది - సమస్యను మేం పర్యవేక్షించడం లేదు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget