NITW: వరంగల్ నిట్‌లో బీఎస్సీ- బీఈడీ ఇంటిగ్రేటెడ్ కోర్సు, అర్హతలివే
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2023-24 విద్యాసంవత్సరానికిగాను నాలుగేళ్ల బీఎస్సీ-బీఈడీ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) 2023-24 విద్యాసంవత్సరానికిగాను నాలుగేళ్ల బీఎస్సీ-బీఈడీ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బీఎస్సీ, బీఈడీ మిళితం చేసే ఇంటిగ్రేటెడ్ పాఠ్యాంశాలు కోర్సులో ఉంటాయి. అక్టోబర్‌లో కోర్సు ప్రారంభం కానుంది.
వివరాలు..
* నాలుగేళ్ల బీఎస్సీ-బీఈడీ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (సెకండరీ స్టేజ్)
సీట్ల సంఖ్య: 50.
విభాగాలు: మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ.
అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 ఉత్తీర్ణత ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఎన్‌సీఈటీ-2023 స్కోరు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1600. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.800 చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.09.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 27.09.2023.
➥ మొదటి రౌండ్ ఎంపిక జాబితా వెల్లడి: 29.09.2023.
➥ మొదటి రౌండ్‌లో సీట్లు పొందినవారు ఫీజు చెల్లింపు తేదీలు: 29.09.2023 - 03.10.2023.
➥ రెండో దశ ఎంపిక జాబితా వెల్లడి: 05.10.2023.
➥ రెండో రౌండ్‌లో సీట్లు పొందినవారు ఫీజు చెల్లింపు తేదీలు: 05.10.2023 - 07.10.2023
➥ స్పాట్ రౌండ్: 09.10.2023.
➥ రిపోర్టింగ్ & రిజిస్ట్రేషన్: 10.10.2023.
➥ తరగతుల ప్రారంభం: 11.10.2023.
ALSO READ:
సెప్టెంబరు 25 నుంచి ఈసెట్ ఫార్మసీ కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
ఏపీలోని ఫార్మసీ కళాశాలల్లో డిప్లొమా అర్హత ఉన్నవారికి బీఫార్మసీ ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీఈసెట్ (ఫార్మసీ) కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబరు 25 నుంచి ప్రారంభంకానుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 25, 26 తేదీల్లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబరు 25 నుంచి 27 వరకు ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి సెప్టెంబరు 27న వెబ్‌ఆప్షన్లలో మార్పునకు అవకాశం కల్పించనున్నారు. అభ్యర్థులకు సెప్టెంబరు 28న సీట్లు కేటాయిస్తారు.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
నీట్ ఎండీఎస్ కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్
నీట్ ఎండీఎస్ కటాఫ్ స్కోర్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తగ్గించిన నేపథ్యంలో కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటాలో సీట్ల భర్తీకి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ సెప్టెంబరు 23న వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబరు 24 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబరు 27న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాలని సూచించారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితా విడుదల చేస్తామన్నారు. అర్హత, ఇతర వివరాలు వెబ్‌సైట్ చూడాలని విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
NEET PG: నీట్ పీజీ విద్యార్థులకు గుడ్ న్యూస్, 'సున్నా' మార్కులకు తగ్గిన కటాఫ్!
నీట్ పీజీ విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. పీజీ మెడికల్/డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ ఏడాది నీట్ పీజీ మూడో రౌండ్ కౌన్సెలింగ్‌లో కటాఫ్ మార్కులను 'సున్నా'కు తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కేటగిరీలకు ఈ 'జీరో' కటాఫ్ వర్తించనుంది. సున్నా మార్కులు వచ్చినా కౌన్సెలింగ్‌కు అర్హత ఉన్నట్లే అని ప్రభుత్వం తెలిపింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..