By: ABP Desam | Updated at : 24 Sep 2023 02:49 PM (IST)
Edited By: omeprakash
ఏపీ ఈసెట్ 2023 ఫార్మసీ కౌన్సెలింగ్
ఏపీలోని ఫార్మసీ కళాశాలల్లో డిప్లొమా అర్హత ఉన్నవారికి బీఫార్మసీ ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీఈసెట్ (ఫార్మసీ) కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబరు 25 నుంచి ప్రారంభంకానుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 25, 26 తేదీల్లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబరు 25 నుంచి 27 వరకు ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది.
వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి సెప్టెంబరు 27న వెబ్‌ఆప్షన్లలో మార్పునకు అవకాశం కల్పించనున్నారు. అభ్యర్థులకు సెప్టెంబరు 28న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన వారికి సెప్టెంబరు 29 నుంచి 30 వరకు సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఈఏడాది ఈసెట్ ప్రవేశ పరీక్షకు 34,503 మంది విద్యార్థులు హాజరు కాగా.. 31,933 మంది అర్హత సాధించిన సంగతి తెలిసిందే.
ఏపీ ఈసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
Pharmacy Counselling Notification
కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: 25.09.2023 - 26.09.2023
➥ ఆన్‌లైన్ సర్టిఫికేట్స్ అప్‌లోడింగ్, వెరిఫికేషన్: 25.09.2023 - 27.09.2023
➥ వెబ్‌ఆప్షన్ల నమోదు: 25.09.2023 - 27.09.2023
➥ ఆప్షన్ల మార్పులకు అవకాశం: 27.09.2023
➥ సీట్ల కేటాయింపు: 28.09.2023
➥ సంబంధిత కళాశాలలో సెల్ఫ్-రిపోర్టింగ్: 29.09.2023 - 30.09.2023.
ALSO READ:
నీట్ ఎండీఎస్ కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్
నీట్ ఎండీఎస్ కటాఫ్ స్కోర్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తగ్గించిన నేపథ్యంలో కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటాలో సీట్ల భర్తీకి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ సెప్టెంబరు 23న వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబరు 24 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబరు 27న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాలని సూచించారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితా విడుదల చేస్తామన్నారు. అర్హత, ఇతర వివరాలు వెబ్‌సైట్ చూడాలని విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
NEET PG: నీట్ పీజీ విద్యార్థులకు గుడ్ న్యూస్, 'సున్నా' మార్కులకు తగ్గిన కటాఫ్!
నీట్ పీజీ విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. పీజీ మెడికల్/డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ ఏడాది నీట్ పీజీ మూడో రౌండ్ కౌన్సెలింగ్‌లో కటాఫ్ మార్కులను 'సున్నా'కు తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కేటగిరీలకు ఈ 'జీరో' కటాఫ్ వర్తించనుంది. సున్నా మార్కులు వచ్చినా కౌన్సెలింగ్‌కు అర్హత ఉన్నట్లే అని ప్రభుత్వం తెలిపింది. మూడో రౌండ్‌లో మొత్తం 13 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో నీట్ పీజీ 2023 పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ కౌన్సెలింగ్‌కు అర్హత సాధించినట్లయింది. ఇందుకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) సెప్టెంబరు 20న ఒక ప్రకటన విడుదల చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
CBSE: సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కులపై బోర్డు కీలక నిర్ణయం, ఇకపై అవి ఉండవు
LAWCET: లాసెట్ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు
CSIR UGC NET 2023: సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 దరఖాస్తు గడువు పొడిగింపు - ఎప్పటివరకంటే?
JEE Main 2024: జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో నేడు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు
Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం
/body>