News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

NEET-MDS: నీట్ ఎండీఎస్‌ కన్వీనర్‌, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్

నీట్ ఎండీఎస్‌ కటాఫ్‌ స్కోర్‌ను కేంద్రం తగ్గించిన నేపథ్యంలో కన్వీనర్‌, మేనేజ్‌మెంట్ కోటాలో సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ సెప్టెంబ‌రు 23న వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

నీట్ ఎండీఎస్‌ కటాఫ్‌ స్కోర్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తగ్గించిన నేపథ్యంలో కన్వీనర్‌, మేనేజ్‌మెంట్ కోటాలో సీట్ల భర్తీకి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ సెప్టెంబ‌రు 23న వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబ‌రు 24 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబరు 27న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితా విడుదల చేస్తామన్నారు. అర్హత, ఇతర వివరాలు వెబ్‌సైట్ చూడాలని విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు.

Competent Authority Quota Notification

Management Quota Notification

సందేహాల పరిష్కారానికి హెల్ప్‌లైన్ సేవలు..

➥ వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులకు ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే 9392685856, 7842542216, 9059672216 ఫోన్ నెంబర్లలో, లేదా ఈమెయిల్: tspgmed2023@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. 

➥ నిబంధనలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 9490585796, 7901098840 ఫోన్ నెంబర్లలో, లేదా ఈమెయిల్: knrpgadmission2023@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. 

➥ ఫీజు చెల్లింపు సమయంలో సమస్యలు ఎదురైతే 9959101577 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు. 

➥ నిర్దేశిత తేదీల్లో ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు మాత్రమే హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.

ALSO READ:

ఎంబీబీఎస్‌ మేనేజ్‌మెంట్ కోటా సీట్లు, సెప్టెంబరు 24 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం
తెలంగాణలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ యాజమాన్య కోటా ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ సెప్టెంబరు 23న మాప్‌ఆప్‌ రౌండ్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెండో విడత కౌన్సెలింగ్‌ తర్వాత ఖాళీ అయిన సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇప్పటికే యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడ‌త వెబ్ కౌన్సెలింగ్‌కు అర్హులు. రాష్ట్రంలోని ప్రైవేట్‌ వైద్యకళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి సెప్టెంబరు 23న సాయంత్రం 5 గంటల నుంచి సెప్టెంబరు 24న సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు హెల్త్‌ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెండో విడత కౌన్సెలింగ్‌ తర్వాత ఖాళీ అయిన సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

NEET PG: నీట్ పీజీ విద్యార్థులకు గుడ్ న్యూస్, 'సున్నా' మార్కులకు తగ్గిన కటాఫ్!
నీట్ పీజీ విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. పీజీ మెడికల్/డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ ఏడాది నీట్ పీజీ మూడో రౌండ్  కౌన్సెలింగ్‌లో కటాఫ్ మార్కులను 'సున్నా'కు తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కేటగిరీలకు ఈ 'జీరో' కటాఫ్ వర్తించనుంది. సున్నా మార్కులు వచ్చినా కౌన్సెలింగ్‌కు అర్హత ఉన్నట్లే అని ప్రభుత్వం తెలిపింది. మూడో రౌండ్‌లో మొత్తం 13 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో నీట్‌ పీజీ 2023 పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ కౌన్సెలింగ్‌కు అర్హత సాధించినట్లయింది. ఇందుకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) సెప్టెంబరు 20న ఒక ప్రకటన విడుదల చేసింది.  
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 24 Sep 2023 01:10 PM (IST) Tags: Education News in Telugu KNRUHS MDS Admissions KNRUHS Admissions KNRUHS MDS Management Quota Admissions KNRUHS MDS Competent Authority Quota

ఇవి కూడా చూడండి

JEE Fee: జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ఫీజు పెంపు, కేటగిరీల వారీగా ఫీజు వివరాలు ఇలా

JEE Fee: జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ఫీజు పెంపు, కేటగిరీల వారీగా ఫీజు వివరాలు ఇలా

SRM Admissions: ఎస్‌ఆర్‌ఎం జాయింట్ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌-2024 నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే

SRM Admissions: ఎస్‌ఆర్‌ఎం జాయింట్ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌-2024 నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే

IIT Kanpur Placements 2023: ఐఐటీల్లో ప్లేస్‌మెంట్ల జోరు, అంతర్జాతీయ సంస్థల్లో అందిపుచ్చుకుంటున్న అవకాశాలు

IIT Kanpur Placements 2023: ఐఐటీల్లో ప్లేస్‌మెంట్ల జోరు, అంతర్జాతీయ సంస్థల్లో అందిపుచ్చుకుంటున్న అవకాశాలు

JEE Main 2024: జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్‌కు నేటితో ఆఖరు, పరీక్ష వివరాలు ఇలా

JEE Main 2024: జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్‌కు నేటితో ఆఖరు, పరీక్ష వివరాలు ఇలా

AIBE: వెబ్‌సైట్‌లో ఏఐబీఈ-18 పరీక్ష అడ్మిట్ కార్డులు, ఎగ్జామ్ ఎప్పుడంటే?

AIBE: వెబ్‌సైట్‌లో ఏఐబీఈ-18 పరీక్ష అడ్మిట్ కార్డులు, ఎగ్జామ్ ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ

BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
×