NEET Answer Key 2022: నేడు 'నీట్' ఆన్సర్ కీ, వెల్లడి సమయమిదే!
మధ్యాహ్నం 12.15 గంటలకు ఆన్సర్ కీ అందుబాటులో ఉంచనున్నారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన చేసింది. ఆన్సర్ కీతో పాటు అభ్యర్థుల ఆన్సర్ షీట్లను కూడా NTA విడుదల చేయనుంది.
జాతీయ స్థాయి మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ యూజీ - 2022 పరీక్ష ఆన్సర్ కీని ఆగస్టు 31న విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు ఆన్సర్ కీ అందుబాటులో ఉంచనున్నారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన చేసింది. ఆన్సర్ కీతో పాటు అభ్యర్థుల ఆన్సర్ షీట్లను కూడా NTA విడుదల చేయనుంది. వాస్తవానికి ఆగస్టు 30న ఆన్సర్ కీ ప్రకటించనున్నట్లు ఆగస్టు 25న ఎన్టీఏ తెలిపింది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదాపడింది. ఆగస్టు 31న ఆన్సర్ కీ విడుదల చేయడానికి సమయం ఖరారు చేసింది.
"Uploading of data of 18 lakh candidates will take some more time. Hence, display of OMR Answer Sheet, Recorded Responses, and Provisional Answer Key will become available only by 12.15 P.M. today." - by NTA
అభ్యర్థుల ఓఎంఆర్ ఆన్సర్ కీ స్కాన్ కాపీలను అభ్యర్థుల ఈమెయిల్ ఐడీలకు పంపుతారు. ప్రిలిమినరీ ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆన్సర్ కీలో అభ్యంతరాలు తెలిపే అభ్యర్థులు ప్రతి ప్రశ్నకు రూ.200గా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తెలిపిన అభ్యంతరాలను సబ్జెక్ట్ నిపుణుల ప్యానెల్ పరిశీలిస్తుంది. ఒకవేళ అభ్యర్థుల వాదన సరైనది అనిపిస్తే.. ఆన్సర్ కీలో మార్పులు చేస్తుంది. రెస్పాన్స్ చాలెంజ్ కోసం కూడా అభ్యర్థులు రూ200 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిపుణులు ఖరారు చేసిన ఫైనల్ కీని విడుదల చేస్తుంది. ఫైనల్ కీ ఆధారంగానే నీట్ ఫలితాలను ప్రకటిస్తారు.
సెప్టెంబరు 7న ఫలితాలు..
జులై 17న దేశవ్యాప్తంగా దాదాపు 3,570 పరీక్షా కేంద్రాల్లో NEET UG - 2022 పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి నీట్ పరీక్షకు 18.72 లక్షల మంది అభ్యర్థులు రిజిష్టర్ చేసుకోగా.. 17.78 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రికార్డు స్థాయిలో 95 శాతం హాజరు నమోదైంది. ఆగస్టు 30న ఆన్సర్ విడుదల చేయనుంది. అభ్యర్థుల నుంచి ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ తర్వాత NEET UG - 2022 ఫలితాలను సెప్టెంబరు 7న విడుదల చేయనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించనుంది.
నీట్ ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను ఇలా నమోదు చేయాలి!
1. https://neet.nta.nic.in/ వెబ్‌సైట్‌ని సందర్శించండి.
2. ‘అప్లై ఫర్ ఆన్సర్ కీ ఛాలెంజ్’ (Apply For Answer Key Challenge) పై క్లిక్ చేయండి.
3. టెస్ట్ బుక్‌లెట్ కోడ్‌ను ఎంచుకోండి. మీ డీటెయిల్స్ (Details) ఉపయోగించి లాగిన్ అవ్వండి.
4: మీరు ఛాలెంజ్ చేయదల్చుకున్న ప్రశ్నకు ప్రక్కన ఉండే బాక్స్‌పై క్లిక్ చేయండి.
5. మీరు అభ్యంతరం లేవనెత్తిన ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం కోసం సపోర్టింగ్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
6. మీ రిక్వెస్ట్ (Request)ను సేవ్ చేయండి. చెల్లింపు పూర్తి చేయండి.
కటాఫ్ మార్కులు ఇలా..?
నీట్ పరీక్షలో జనరల్ కేటగిరి అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సెంట్‌గా.. ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా, దివ్యాంగులకు 45 పర్సంటైల్‌గా నిర్ణయించారు. గతేడాది కటాఫ్ మార్కులు జనరల్-138, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 108గా నిర్ణయించారు. ఈసారి అర్హత మార్కులు 5-10 మార్కులు తగ్గే అవకాశం ఉంది. కటాఫ్ మార్కు 125-130 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఫలితాల వెల్లడి తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కౌన్సెలింగ్ షెడ్యూలును ప్రకటించనుంది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ వెబ్‌సైట్‌లో కౌన్సెలింగ్ షెడ్యూలును అప్‌లోడ్ చేయనుంది.
నీట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. నీట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్ జాబితాను 'మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్' ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌తో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందిస్తాయి. నీట్ మెడికల్ మెరిట్ లిస్ట్ ఆధారంగానే ప్రవేశ ప్రక్రియ జరుగుతుంది.
Also Read: NTR Health University: పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు, చివరితేది ఇదే!
టై బ్రేకింగ్ ప్రకారమే ర్యాంకులు..
ఈ సారి ర్యాంకింగ్ విధానంలో టై బ్రేకింగ్ విధానాన్ని అమలుచేయనున్నారు. దీనిప్రకారం..
▶ బయాలజీ (బోటనీ & జువాలజీ), కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో ఎక్కువ మార్కులు/పర్సెంటైల్ స్కోర్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటంది.
▶ అన్ని సబ్జెక్టులలో మార్కులు ఒకేలా ఉంటే, తక్కువ ప్రశ్నలకు ప్రయత్నించిన విద్యార్థులకు ఎక్కువ ర్యాంక్ ఇవ్వబడుతుంది, తరువాత బయాలజీ, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్‌లలో తక్కువ తప్పులు చేసినవారికి ప్రాధాన్యమిస్తారు.
▶ ఈ మార్కులన్నీ కూడా సరిపోలితే, వయసులో ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులకు ఎక్కువ ర్యాంక్ ఇవ్వబడుతుంది.
▶ ఒకవేళ అభ్యర్థులు తమ పుట్టినరోజును పరిగణనలోకి తీసుకుంటే, ముందుగా నీట్ పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థికి ఎక్కువ ర్యాంకు లభిస్తుంది.