అన్వేషించండి

NEET UG Results 2025 : నీట్‌ ఫలితాలు విడుదల - టాపర్స్ జాబితా, రిజల్ట్ లింక్ పూర్తి వివరాలు

NEET UG Results 2025 : ఉత్కంఠకు తెరపడింది. నీట్ అభ్యర్థుల టెన్షన్‌కు ఎండ్ కార్డు పడింది. నీట్‌ ఫలితాలను 2025 ఇవాళ విడుదల చేశారు.

NEET UG Results 2025 : దేశవ్యాప్తంగా ఉన్న వైద్య విద్యా కాలేజీల్లో ప్రవేశం కోసం  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన NEET UG 2025 ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాల మాట రావడంతో అభ్యర్థుల్లో ఒకట ఉత్కంఠకు తెరపడింది.  

NEET UG 2025 ఫలితాలను ఆదివారం విడుదల చేయబోతున్నట్టు అనుకున్నప్పటికీ ఇవాళే వెబ్‌సైట్‌లో పెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న MBBS, BDS, AYUSH, ఇతర మెడికల్ కోర్సుల్లో చేరి ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏటా నిర్వహిస్తుంది. ఈసారి చేపట్టిన పరీక్షల్లో దాదాపు 24 లక్షల మంది రాశారు. ఈ రిజల్ట్స్‌ను neet.nta.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.  

నీట్‌ వెబ్‌సైట్‌లో ఈ ఫలితాలను జూన్ 14 , 2025న మధ్యాహ్నం  రెండు గంటల టైంలో విడుదల చేశారు. ఈ ఫలితాలను neet.nta.nic.in, nta.ac.in, ntaresults.nic.in వెబ్‌సైట్‌లలో ఉంచారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత అందులో టాపర్స్ లిస్ట్ పెట్టారు. ఆల్‌ ఇండియా రాంక్‌లు, మార్క్‌షీట్‌లు అందుబాటులో ఉన్నాయి. 

నీట్‌ 2024 ఫలితాలను కూడా జూన్ 14నే విడుదల చేశారు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తరని అనుకున్నారు కానీ ముందుగానే విడుదల చేశారు. మే 4న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో నీట్ నిర్వహించారు.ఈ కేంద్రాల్లో 23.85 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వీరిలో 13.5 లక్షల మంది బాలికలు ఉంటే 10.35 లక్షల మంది అబ్బాయిలు ఉన్నారు.

NEET UG 2025లో టాపర్‌ల జాబితా ఫలితాల విడుదల తర్వాత బయటకు వచ్చింది. ఇందులో గందరగోళం లేకుండా ఉండేందుకు టాపర్స్ జాబితాను ఎన్టీఏ వెబ్‌సైట్‌లో పెట్టింది. గతేడాది టాప్ 3లో రాహుల్ గ్రేస్ (720/720), అర్జున్ త్యాగి (715), శివం కుమార్ (714) ఉన్నారు. ఈసారి కూడా టాపర్లకు 700లకుపైగా మార్కులు వస్తాయనే అంచనాలు ఉన్నాయి. టాపర్‌ల జాబితాను దేశవ్యాప్తంగా ఒకటి ఉంటే, రాష్ట్రాల వారీగా కూడా వేరుగా ఉంటుంది. వీటితోపాటు ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయనే విషయాన్ని కూడా వెబ్‌సైట్‌లో ఉంచుతారు.  
 
NEET UG 2025 ఫలితాల కోసం ముందుగా nta.ac.in, neet.nta.nic.in, ntaresults.nic.in వెబ్‌సైట్‌కు "NEET UG 2025 Result" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. వెంటనే రిజల్ట్స్ పేజ్‌ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ రోల్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అందులో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, జాతీయ స్థాయిలో మీ ర్యాంకు ఎంత, రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకు ఎంతో తెలుస్తుంది. ఆ ఫలితాల షీట్‌ను డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. దీంతోపాటు ఓ స్కోర్ కార్డు కూడా వస్తుంది. ఇది కూడా కౌన్సెలింగ్ టైంలో చూపించాల్సి ఉంటుంది. ఈ రెండింటిని ప్రింట్‌ అవుట్ తీసి పెట్టుకోవాలి.  

ఫలితాల టైంలో ఏదైనా సమస్య వచ్చినా, ఇతర ఇబ్బందులు ఎదురైనా పరిష్కరించేందుకు NTA ఓ హెల్పలైన్ నెంబర్ తీసుకొచ్చింది. "NEET Helpline"పేరిట ఈ డెస్క్ పని చేస్తుంది. ఫోన్ నంబర్: 011-40759000 ఫోన్ చేయాల్సి ఉంటుంది.  

టాప్ హెడ్ లైన్స్

KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Embed widget