NITT: నిట్ తిరుచిరాపల్లిలో ఎంటెక్, ఎంఆర్క్ కోర్సులు - ప్రవేశం ఇలా!
తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 2023-2024 విద్యా సంవత్సరానికి స్పాన్సర్డ్ కేటగిరీలో ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 2023-2024 విద్యా సంవత్సరానికి స్పాన్సర్డ్ కేటగిరీలో ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 60% మార్కులతో సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు జులై 31లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాత పరీక్ష/ ఆన్‌లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులకు ఆగస్టు 7న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
కోర్సుల వివరాలు..
1) మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్)
కోర్సు వ్యవధి: 4 సెమిస్టర్లు.
2) మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (ఎంఆర్క్)
కోర్సు వ్యవధి: 4 సెమిస్టర్లు.
విభాగాలు: ఎనర్జీ ఎఫీషియంట్ & సస్టెయినబుల్ ఆర్కిటెక్చర్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, ట్రాన్స్‌పొర్టేషన్ ఇంజినీరింగ్ & మేనేజ్‌మెంట్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్, జియోటెక్నికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్, ప్రాసెస్ కంట్రోల్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్ ఇంజినీరింగ్, మ్యానుఫాక్చరింగ్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ & మేనేజ్‌మెంట్, థర్మల్ పవర్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, మెటీరియల్ సైన్స్ & ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ మెటలర్జి, వెల్డింగ్ ఇంజినీరింగ్, నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్.
అర్హత: కనీసం 60% మార్కులతో సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఆన్‌లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.07.2023.
* ఇంటర్వ్యూ తేదీ: 07.08.2023.
ALSO READ:
MAT: ‘మ్యాట్'-2023 సెప్టెంబరు నోటిఫికేషన్ వెల్లడి, పరీక్ష షెడ్యూలు ఇలా!
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేట్ (ఏఐఎంఏ)-2023 సెప్టెంబర్ సెషన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (MAT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. తాజాగా మ్యాట్ 2023 సెప్టెంబరు నోటిఫికేషన్ విడుదలైంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
బీఆర్క్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలోని ఆర్కిటెక్చర్ కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నిర్వహించే ఆప్టిట్యూడ్ టెస్టు ఎన్‌ఏటీఏ (NATA)–2021లో (లేదా) జేఈఈ మెయిన్స్ పేపర్–2 (బీఆర్క్)–2021లో అర్హత సాధించినవారు, ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు, పదోతరగతితోపాటు డిప్లొమా పూర్తిచేసిన వారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాష్ట్రవ్యాప్తంగా 10 ఆర్కిటెక్చర్ కాలేజీల్లో 830 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 12 నుంచి 22 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది.
ప్రవేశాల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
జేఎన్‌టీయూ గుడ్ న్యూస్, ఇకపై ఆ కాలేజీల్లోనూ ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలకు ఛాన్స్!
ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలు చేయాలనుకునేవారికి జేఎన్‌టీయూ హైదరాబాద్ శుభవార్త వినిపించింది. ఇకపై జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల్లోనూ విద్యార్థులు పరిశోధనలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలో 170 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలకు అవకాశం కల్పిస్తున్నట్లు జేఎన్‌టీయూహెచ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జేఎన్‌టీయూ అనుబంధ ఇంజినీరింగ్ కాలేజీల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు, పరిశోధనలను నిర్వహించేందుకుగాను ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial