TSMJBC Admissions: తెలంగాణ బీసీ గురుకులాల్లో 6,7,8 తరగతి ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి!
తెలంగాణ మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకులాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను 6, 7, 8 తరగతుల్లో మిగిలిన (బ్యాక్‌లాగ్) సీట్ల భర్తీకి సంబంధించి బ్యాక్‌లాగ్ సెట్-2023 నోటిఫికేషన్ వెలువడింది.
తెలంగాణ రాష్ట్ర మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే 294 (148 బాలురు, 146 బాలికలు) మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకులాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను 6, 7, 8 తరగతుల్లో మిగిలిన (బ్యాక్‌లాగ్) సీట్ల భర్తీకి సంబంధించి బ్యాక్‌లాగ్ సెట్-2023 నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన బీసీ, ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు ఏప్రిల్ 20లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే 10న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
వివరాలు..
➥ మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల ప్రవేశ ప్రకటన - 2023
అర్హత: ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతిల చదువుతూ ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలకు మించకూడదు.
వయోపరిమితి: 31.08.2023 నాటికి ఆరో తరగతికి 12 సంవత్సరాలు, ఏడో తరగతికి 13 సంవత్సరాలు, ఎనిమిదో తరగతికి 14 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించి మార్కులు, రిజర్వేషన్లు, ప్రత్యేక కేటగిరీ(అనాథ) ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
పరీక్ష విధానం: ప్రవేశ పరీక్ష తెలుగు, మ్యాథమెటిక్స్, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టుల్లో 5, 6, 7వ తరగతి స్థాయిలో ఓఎంఆర్ షీట్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు/ ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. ఇందులో తెలుగు-15 ప్రశ్నలు-15 మార్కులు, ఇంగ్లిష్-25 ప్రశ్నలు-25 మార్కులు, గణితం-30 ప్రశ్నలు-35 మార్కులు, పరిసరాల విజ్ఞానం-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.
పరీక్షా కేంద్రం: విద్యార్థుల సంబంధిత జిల్లాలో పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు...
➥ నోటిఫికేషన్ వెల్లడి: 04.03.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.03.2023
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.04.2023.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 02.05.2023
➥ ప్రవేశ పరీక్ష తేదీ: 10.05.2023.
Also Read:
ప్రైవేటు విద్యాసంస్థల్లో ‘విద్యా హక్కు’ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం ప్రవేశాలకు మార్చి 4న నోటిఫికేషన్ వెలువడింది. ప్రైవేటు పాఠశాలలు మార్చి 6 నుంచి 16 వరకు ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థులు 18 నుంచి ఏప్రిల్ 7లోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశాలకు అర్హత పొందిన విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ఏప్రిల్ 9 నుంచి 12 వరకు జరుగనుంది. మొదటి జాబితాను ఏప్రిల్ 13న విడుదల చేయనున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
APSWREIS: డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(APSWREIS) పరిధిలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2023-2024 విద్యా సంవత్సరానికిగాను 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన బాలబాలికలు ఆన్‌లైన్ ద్వారా మార్చి 24 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు క్రీడలు/ వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారు. రాష్ట్రంలోని 189 గురుకులాల్లో మొత్తం 14,940 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..