NCERT: ఎన్సీఈఆర్టీ కీలక నిర్ణయం, 11వ తరగతి పుస్తకంలో మౌలానా ఆజాద్ ప్రస్తావనల తొలగింపు!
పదకొండో తరగతి పొలిటికల్ సైన్స్‌లో భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా ఆజాద్ ప్రస్తావనలను తొలగించింది. గతేడాది పాఠ్యాంశాల హేతుబద్ధీకరణ చేపట్టిన ఆ సంస్థ కొత్తగా విడుదల చేసిన పుస్తకంలో ఈ మార్పులు చేసింది.
పాఠ్యపుస్తకాల్లో ఇటీవలే 'గాంధీ హత్య'కు సంబంధించిన అంశాలను తొలగించిన ఎన్‌సీఈఆర్‌టీ మరో ప్రముఖవ్యక్తికి సంబంధించిన విషయాలను తొలగించింది. పదకొండో తరగతి రాజనీతి శాస్త్రంలో భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రస్తావనలను తొలగించింది. గతేడాది పాఠ్యాంశాల హేతుబద్ధీకరణ చేపట్టిన ఆ సంస్థ కొత్తగా విడుదల చేసిన పుస్తకంలో ఈ మార్పులు చేసింది. పునరుక్తులు, సంబంధంలేని అంశాల పేరుతో ఈ తొలగింపులు చేపట్టింది. మొదటి, పదో చాప్టర్లలో ఉన్న మౌలానా ఆజాద్ ప్రస్తావనలను సంస్థ తొలగించింది.
ఇప్పటికే గుజరాత్ అల్లర్లు, మొఘల్ కోర్టులు, అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ), ప్రచ్ఛన్న యుద్ధం, నక్సలైట్ ఉద్యమం వంటి పాఠ్యాంశాలను ఎన్‌సీఈఆర్టీ తన పుస్తకాల నుంచి తొలగించింది. రాజనీతి శాస్త్రం పుస్తకంలో హేతుబద్ధీకరణపై ఇచ్చిన నోట్‌లోనూ ఈ ప్రస్తావన లేదు. ఈ ఏడాది ఎటువంటి మార్పులు చేయలేదని, గత ఏడాది హేతుబద్ధీకరణలో భాగంగానే ఈ మార్పులు చేశామని ఎన్‌సీఈఆర్టీ డైరెక్టరు దినేశ్ సక్లానీ తెలిపారు. మౌలానా ఆజాద్ పేరిట ఉన్న ఫెలోషిప్‌ను గత ఏడాదే కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ తొలగించింది.
Also Read:
ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలోని 194 ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 16న ప్రవేశ పరీక్ష జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆరో తరగతిలో ప్రవేశానికి ఏప్రిల్ 16న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, 7-10 తరగతుల్లో ప్రవేశానికి అదేరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.ఈ పరీక్షల కోసం జనవరి 10 నుంచి మార్చి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 70,041 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులు తమ రిఫరెన్స్ ఐడీ/ పేరు/ మొబైల్ నంబర్‌తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రవేశపరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
జాతీయ స్థాయిలో ఒకే తరహా క్రెడిట్స్ విధానం: యూజీసీ చైర్మన్ జగదీశ్‌కుమార్
జాతీయస్థాయిలో ఒకే విద్యా విధానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా నేషనల్ క్రెడిట్ ఫ్రేంవర్ రూపొందించామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ స్పష్టంచేశారు. జాతీయ విద్యావిధానం-2020కి అనుగుణంగా పాఠశాల విద్య నుంచే క్రెడిట్స్ ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఏకీకృత విధానాన్ని అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇదే కోవలో తాము నేషనల్ క్రెడిట్ ఫ్రేంవర్క్‌ను విడుదల చేశామని తెలిపారు. నేషనల్ స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేంవర్క్, నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేంవర్క్, నేషనల్ క్వాలిఫికేషన్ ఫ్రేంవర్క్‌లను ఏకీకృతం చేశామని వివరించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ అర్హతతో ఎంబీఏ ప్రవేశానికి 'జిప్‌మ్యాట్' మార్గం, నోటిఫికేషన్ విడుదల!
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) బోధ్‌గయ, ఐఐఎం జమ్మూ ఉమ్మడిగా అందిస్తున్న 'ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్(ఐపీఎం)లో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్‌మ్యాట్) - 2023 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఇంటర్ అర్హతతో ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఐదేళ్ల ఇంటిగ్రేడెట్ ఎంబీఏ కోర్సులో చేరవచ్చు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..