(Source: ECI/ABP News/ABP Majha)
TSMS Hall Tickets: ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలోని 194 ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 16న ప్రవేశ పరీక్ష జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు.
తెలంగాణలోని 194 ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 16న ప్రవేశ పరీక్ష జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆరో తరగతిలో ప్రవేశానికి ఏప్రిల్ 16న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, 7-10 తరగతుల్లో ప్రవేశానికి అదేరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ పరీక్షల కోసం జనవరి 10 నుంచి మార్చి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 70,041 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులు తమ రిఫరెన్స్ ఐడీ/ పేరు/ మొబైల్ నంబర్‌తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, ఈ ఏడాది వచ్చే సెలవులివే!
తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ క్యాలెండర్‌ని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలు జూన్ 1న ప్రారంభమవుతాయిన బోర్డు అధికారులు ఏప్రిల్ 1న వెల్లడించారు. జూన్ 1 నుంచే తరగతులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్ బోర్డు వెలువరించింది. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, 2024, జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన విడుదల-పరీక్ష ఎప్పుడంటే?
ఎన్‌డీఏ, ఎస్‌ఎస్‌బీ తదితర సైనిక దళాల్లో అధికారుల నియామకాల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ సైనిక పాఠశాలను బాలుర కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది. పాఠశాలలో సైనిక శిక్షణే ప్రధానాంశంగా ఉంటుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)... 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో బాలుర సైనిక స్కూల్ ఆరో తరగతి (సీబీఎస్‌ఈ సిలబస్), ఇంటర్మీడియట్(ఎంపీసీ- సీబీఎస్ఈ సిలబస్)లో ప్రవేశాలకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్య తేదీలివే!
ఏపీలోని కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయం బాలికల ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 352 కేజీబీవీ పాఠశాలల్లో 2023 - 2024 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి, ఇంటర్మీడియట్‌తో పాటు 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన బ్యాక్‌లాగ్ సీట్లలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సరైన అర్హతలు గల బాలికలు ఏప్రిల్ 20లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలోని కేజీవీబి పాఠశాలల్లో దాదాపు 8600 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తారు. అడ్మిషన్లు పొందిన వారి వివరాలను అయా పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో ప్రదర్శిస్తారు.
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..