KNRUHS MBBS Counselling: ఎంబీబీఎస్ ప్రవేశాలకు 13, 14 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్! వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోండి!
రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఏంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లకు ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తి అయింది. యాజమాన్యకోటలో మిగిలిపోయిన ఖాళీలను ఈ మాప్ అప్ రౌండ్ ద్వారా భర్తీ చేయనున్నారు.
తెలంగాణలో మిగిలిపోయిన ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి డిసెంబరు 13, 14 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం డిసెంబరు 12న మాప్ అప్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఏంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లకు ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తి అయింది. యాజమాన్యకోటలో మిగిలిపోయిన ఖాళీలను ఈ మాప్ అప్ రౌండ్ ద్వారా భర్తీ చేయనున్నారు. డిసెంబరు 13న మధ్యాహ్నం 2 గంటల నుంచి డిసెంబరు 14న మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్ ఆఫ్షన్లును నమోదు చేసుకోవాలి.
వెబ్ఆప్లన్లు నమోదుకు క్లిక్ చేయండి..
వెబ్‌సైట్‌లో 'క్లాట్' అడ్మిట్ కార్డులు, 17 వరకు అప్లికేషన్ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోడానికి అవకాశం!
దేశవ్యాప్తంగా ఉన్న 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశానికి 'కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2023' ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 18న క్లాట్-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు డిసెంబరు 17న రాత్రి 11.59 గంటలలోపు ప్రవేశ ప్రాధాన్యాలను (అడ్మిషన్ ప్రిఫరెన్సెస్) నమోదుచేయాల్సి ఉంటుంది.
అడ్మిట్ కార్డు, అడ్మిషన్ ప్రిఫరెన్స్ కోసం క్లిక్ చేయండి..
నాలుగేళ్లు చదివితేనే ఆనర్స్ డిగ్రీ, యూజీసీ నిబంధనలివే!
నూతన విద్యావిధానంలో భాగంగా ప్రవేశపెట్టిన ఆనర్స్ డిగ్రీని నాలుగేళ్ల కోర్సుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. నాలుగో ఏడాది స్పెషలైజేషన్ కు కేటాయిస్తున్నట్లు తెలిపింది. అయితే, మూడేళ్ల ఆనర్స్ డిగ్రీ కూడా ఉంటుందని వివరించింది. నాలుగేళ్లు లేదా మూడేళ్లు.. ఆనర్స్ లో ఏ డిగ్రీ కోర్సును ఎంచుకోవాలనే చాయిస్ విద్యార్థులదేనని పేర్కొంది. కాగా, నాలుగేళ్ల డిగ్రీ కోర్సును పూర్తిచేసిన విద్యార్థులకు మాత్రమే ఆనర్స్ డిగ్రీని ప్రదానం చేయనున్నట్లు యూజీసీ స్పష్టం చేసింది.
దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విడుదల చేసింది. వీటి ప్రకారం నాలుగేళ్ల కోర్సు తీసుకునే విద్యార్థులకు మాత్రమే ఆనర్స్ డిగ్రీని ప్రదానం చేస్తారు. విద్యార్థులు అవసరమైతే రీసెర్చ్ స్పెషలైజేషన్‌ను కూడా ఎంచుకునే అవకాశం ఉంది. ఈ విద్యార్థులకు కోర్సు నాలుగో ఏడాదిలో స్పెషలైజేషన్‌కు సంబంధించిన సిలబస్ ఉంటుంది. వీరికి రీసెర్చ్ స్పెషలైజేషన్‌తో ఆనర్స్ డిగ్రీని ప్రదానం చేస్తారు. అదేవిధంగా ఆనర్స్ డిగ్రీని ఎంచుకున్నవారు మొత్తం 160 క్రెడిట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. మూడేళ్ల డిగ్రీని ఎంచుకునే విద్యార్థులు 120 క్రెడిట్లు పూర్తి చేస్తేనే ఆనర్స్ డిగ్రీని పొందగలుగుతారు. అలాగే ఈ కోర్సుల్లో చేరినవారు ఏదైనా కారణంతో మూడేళ్లలోపు మానేస్తే, మళ్లీ కోర్సులో చేరే అవకాశం ఉంటుంది.
నాలుగేళ్ల కోర్సులో చేరి మూడేళ్ల లోపు మానేస్తే.. మూడేళ్లలోపు అదే కోర్సులో చేరే అవకాశం కల్పించినట్లు యూజీసీ తెలిపింది. మొత్తంగా ఏడేళ్లలోపు ఈ కొత్త కోర్సును పూర్తిచేయాలి. ఇందులో మేజర్, మైనర్ స్ట్రీమ్ కోర్సులుంటాయి. అలాగే లాంగ్వేజ్ కోర్సులు, స్కిల్ కోర్సులు, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్, అండర్‌స్టాండింగ్ ఇండియా, డిజిటల్ అండ్ టెక్నలాజికల్ సొల్యూషన్స్, హెల్త్ అండ్ వెల్‌నెస్, యోగా ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్ కోర్సులు ఎంచుకోవచ్చని యూజీసీ తెలిపింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.