అన్వేషించండి

KNRUHS: పీజీ డెంటల్‌ సీట్ల భర్తీకి రెండో విడత నోటిఫికేషన్‌ విడుదల

పీజీ డెంటల్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నవంబర్‌10న రెండో విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో సీట్లను భర్తీ చేస్తారు.

పీజీ డెంటల్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌ ఆధారంగా నవంబర్‌10న రెండో విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ఎండీఎస్‌ యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేయనున్నారు.
అర్హతలు కలిగిన అభ్యర్థులు నవంబరు 10న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రాధాన్యతాక్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్‌లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఖాళీ సీట్ల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చామని, మరింత సమాచారం కోసం వెబ్‌సైట్‌ని పరిశీలించవచ్చని అధికారులు తెలిపారు.

Notification
వెబ్‌ఆప్షన్స్ కోసం క్లిక్ చేయండి. 

ఫీజు వివరాలు ఇలా...
సీట్లు పొందిన విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు కింద ఆన్‌లైన్ గేట్ వే (డెబిట్/క్రెడిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్) ద్వారా రూ.49,600 చెల్లించి సీటు అలాట్‌మెంట్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నారై అభ్యర్థులు రూ.69,600 చెల్లించాల్సి ఉంటుంది.  ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్యూషన్ ఫీజు చెల్లించాలి.

Also Read:

బీడీఎస్‌ ప్రవేశాలకు కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల, షెడ్యూలు ఇదే!

రాష్ట్రంలో బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి నవంబరు 9,10 తేదీల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ మేరకు నవంబరు 8న మొదటి విడత ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచింది.

యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ దంత కళాశాలల్లోని కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. కళాశాలలవారీగా సీట్ల వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. నవంబరు 9న ఉదయం 6 గంటల నుంచి నవంబరు 10న సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో కళాశాలలవారీగా వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 

BDS SEAT MATRIX 

NOTIFICATION FOR EXERCISING WEB-OPTIONS FOR FIRST PHASE COUNSELING

Website for Weboptions

బీడీఎస్ కన్వీనర్‌ కోటా నోటిఫికేషన్‌తోపాటు పీజీ మెడికల్ (ఎండీ/ఎంఎస్/డిప్లొమా) మేనేజ్‌మెంట్ కోటా రెండో రౌండ్ సీట్ల కేటాయింపు జాబితాను యూనివర్సిటీ విడుదల చేసింది. 
ALLOTMENT LIST AFTER SECOND PHASE OF COUNSELLING


ఫీజు వివరాలు ఇలా...
సీట్లు పొందిన విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు కింద ఆన్‌లైన్ గేట్ వే (డెబిట్/క్రెడిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్) ద్వారా రూ.12,000 చెల్లించి సీటు అలాట్‌మెంట్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్యూషన్ ఫీజును ప్రభుత్వ డెంటల్ కాలేజీలో ఏడాదికి రూ.10,000; ప్రైవేట్ డెంటల్ కాలేజీలో ఏడాదికి రూ.45,000; ఆర్మీ డెంటల్ కాలేజీలో రూ.4,25,000గా నిర్ణయించారు.   

Website

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kadiyam Kavya: బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiyam Kavya: బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
Sivaji Raja: పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Embed widget