KNRUHS Final MBBS Results: ఎంబీబీఎస్ ఫైనలియర్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పార్ట్-2 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. కాళోజీ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం మార్చి 28న ఫలితాలను విడుదల చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పార్ట్-2 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. కాళోజీ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం మార్చి 28న ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన విద్యార్థులు వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. ఎంబీబీఎస్ తుది ఫలితాల్లో 92.25 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు కాళోజీ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఫలితాల జాబితాను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 43 మంది డిస్టింక్షన్ సాధించగా.. 1300 మంది ఫస్ట్ క్లాస్, 1703 మంది ఉత్తీర్ణులయ్యారు.
RESULTS OF FINAL MBBS PART II (REGULAR CANDIDATES ) EXAMINATION- FEB 2023
RESULTS OF FINAL MBBS PART II (BACKLOG CANDIDATES) EXAMINATION- FEB 2023
ALso Read:
1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
తెలంగాణలోని బోధనాసుపత్రుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారి మెరిట్ జాబితాను వైద్యారోగ్యసేవల రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. ఈ జాబితాకు సంబంధించిన అభ్యంతరాలుంటే మార్చి 29న ఉదయం 10.30 నుంచి ఏప్రిల్ 1న సాయంత్రం 5.30 గంటలలోపు తెలపాలని బోర్డు కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి మార్చి 28న ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు లాగిన్ ద్వారా మాత్రమే అభ్యంతరాలను తెలపాలని, ఇతర రూపాల్లో పంపితే పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మెడికల్ టీచర్లు అందుబాటులో లేకుంటే ఖాళీల్లో 15 శాతం పోస్టులను నాన్ మెడికల్ టీచర్లతో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 34 విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించనున్నారు. అత్యధికంగా గైనకాలజీ 187 పోస్టులు, అనస్థీషియాలో 177 పోస్టులు భర్తీ కానుండగా తర్వాత స్థానాల్లో జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ విభాగాలు ఉన్నాయి.
మెరిట్ జాబితా కోసం క్లిక్ చేయండి..
జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష - దరఖాస్తు ప్రారంభం ఎప్పుడంటే?
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 పరీక్ష షెడ్యూలు ఇటీవల వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఐఐటీ గువాహటి నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనుంది. జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఏప్రిల్ 30 నుంచి మే 7 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జేఈఈ మెయిన్-1 పూర్తికాగా, ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్-2 నిర్వహించనున్నారు. ఈ రెండు సెషన్ల ఫలితాలను ఏప్రిల్ చివరివారంలో వెల్లడించే అవకాశం ఉంది. పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 2.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధిస్తారు. దీని ఫలితాల ఆధారంగా ఐఐటీల్లో నాలుగేళ్ల బీటెక్, బీఎస్, బీఆర్క్, ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
జేఈఈ అడ్వాన్స్ నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
జేఈఈ మెయిన్ సెషన్ 2 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి, ఎప్పుడంటే?
దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2023 సెషన్-2కు సంబంధించి అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలోనే విడుదల చేయనుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 12 వరకు సెషన్-2 పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షల అడ్మిట్ కార్డులను వారం రోజుల్లో అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నట్టు ఎన్టీఏ తెలిపింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..