అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

JNTUH: బీటెక్ విద్యార్థుల 'గ్రేస్‌' మార్కులు, జేఎన్‌టీయూ కీలక నిర్ణయం!!

బీటెక్ విద్యార్థులకు గ్రేస్ మార్కులను 0.25 శాతానికి(అంటే 15 మార్కులు) పెంచి కలపాలని నిర్ణయించినట్లు ఉపకులపతి నర్సింహారెడ్డి వివరించారు. ఈ నిర్ణయం ప్రస్తుత విద్యాసంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందన్నారు.

బీటెక్ విద్యార్థులకు సబ్జెక్టు మినహాయింపు విషయంలో జేఎన్‌టీయూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌18(2018) బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు ఈ ఏడాదితో ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్నారు. బ్యాక్‌లాగ్స్‌ ఉన్న వారందరూ సబ్జెక్టు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. వర్సిటీ ఎదుట ఆందోళన సైతం చేపట్టారు. సామాజిక మాధ్యమాల వేదికగానూ పెద్దసంఖ్యలో ఎప్పటికప్పుడు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇదే విషయంపై ఇటీవల గవర్నర్ తమిళిసైని కలిసి వినతిపత్రం అందించారు. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం 152-160 మధ్య క్రెడిట్స్ ఉంటే సరిపోతుందని, జేఎన్‌టీయూ మాత్రం 160 ఉండాల్సిందే అంటోందని వివరించారు.

ఈ నేపథ్యంలో గవర్నర్ రెండుసార్లు జేఎన్‌టీయూ ఉపకులపతి ప్రొ.కట్టా నర్సింహారెడ్డిని పిలిపించి చర్చించారు. విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేలా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. సబ్జెక్టు మినహాయింపుపై తాజాగా వర్సిటీలో అకడమిక్ సెనేట్ భేటీ, ఆపై పాలకమండలి సమావేశంలోనూ అధికారులు చర్చించారు. ఇప్పటికే క్రెడిట్స్‌ను 160కు కుదించినందున సబ్జెక్టు మినహాయింపు సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా గ్రేస్‌ మార్కులు పెంచాలని నిర్ణయించారు. ఇంజినీరింగ్‌లో రెండు బ్యాక్‌లాగ్స్ ఉన్న విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా మొత్తంపై 0.15శాతం అంటే 9 మార్కులు గ్రేస్‌గా ఇస్తుంటారు.

తాజా పరిస్థితుల దృష్ట్యా గ్రేస్ మార్కులను 0.25 శాతానికి(అంటే 15 మార్కులు) పెంచి కలపాలని నిర్ణయించినట్లు ఉపకులపతి నర్సింహారెడ్డి వివరించారు. ఈ నిర్ణయం ప్రస్తుత విద్యాసంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందన్నారు. అలాగే బ్యాక్‌లాగ్ ఉన్న విద్యార్థుల కోసం డిసెంబరులోగా ప్రత్యేక పరీక్ష నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.

 

:: Also Read ::

క్రాఫ్ట్స్ & డిజైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలు, ఐఐసీడీ నోటిఫికేషన్ జారీ!!
ఇండియన్  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ (ఐఐసీడీ) 2023 విద్యాసంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా బీ.డిజైన్, ఎం.డిజైన్, ఎం.వొకేషన్ కోర్సుల్లో సీట్ల భర్తీ చేయనున్నారు. కోర్సుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ కోర్సులకు ఇంటర్ అర్హత ఉండాలి. పీజీ కోర్సులకు సంబంధి విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్ధులు జనవరి 21లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

'ఫ్యాషన్' కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం- చివరితేది ఎప్పుడంటే?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రవేశాలకు నిర్దేశించిన 'NIFT-2023' రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది. 
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ లాసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం, రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల‌కు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ నవంబరు 2న ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నవంబరు 1న వెబ్‌కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు న‌వంబ‌ర్ 2 నుంచి 12 వ‌ర‌కు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ధ్రవపత్రాల పరిశీలన, ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ అప్‌లోడింగ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.
కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget