అన్వేషించండి

JEE Main Application: జేఈఈ మెయిన్ దరఖాస్తుకు రేపే ఆఖరు! పరీక్ష వాయిదాకు కోర్టు నిరాకరణ, షెడ్యూలు ప్రకారమే పరీక్షలు!

జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలను జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇక రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనుంది.

జేఈఈ మెయిన్-2023 మొదటి సెషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 12తో ముగియనుంది. ఇప్పటికవరకు దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు చివరి నిమిషంలో ఇబ్బందులకు గురికాకుండా  వెంటనే తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది. మొదటి విడత జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబరు 15న ప్రారంభమైన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలను జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇక రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనుంది. ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.

జేఈఈ వాయిదాకు కోర్టు నిరాకరణ..
ఇదిలా ఉండగా.. జేఈఈ (JEE) మెయిన్స్ 2023 పరీక్షను వాయిదా వేయడానికి బాంబే హైకోర్టు నిరాకరించింది. రీజాయిండర్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను కోరుతూ.. తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో జేఈఈ ఆధారిత ప్రవేశాలకు 75 శాతం మార్కుల నిబంధనను తొలగించాలని, అప్పటిదాకా జేఈఈ మెయిన్ పరీక్ష వాయిదా వేయాలని బాంబే హైకోర్టలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై జనవరి 10న విచారణ జరిపిన బాంబే హైకోర్టు పరీక్ష వాయిదా వేయడానికి నిరాకంరించింది.  

పరీక్ష విధానం:

➥ జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో యూజీ కోర్సు్లో (బీఈ/బీటెక్) ప్రవేశాల కోసం పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌‌డ్ కోసం కూడా దీన్నే అర్హత పరీక్షగా పరిగణిస్తారు. 

➥ ఇక బీఆర్క్, బీప్లానింగ్ కోర్సు్ల్లో ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-2023 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ భాషల్లో పరీక్ష ఉంటుంది.

➥ బీఈ, బీటెక్‌, బీఆర్క్‌, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్‌ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో మంచి స్కోర్‌ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.

ముఖ్యమైన తేదీలివే..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.12.2022.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.01.2023.  (9:00 P.M.)

 ఫీజు చెల్లించడానికి చివరితేది: 12.01.2023.  (11:50 P.M.)

➥ సిటీ ఎగ్జామినేషన్ వివరాల వెల్లడి: 2023, జనవరి రెండోవారంలో. 

 అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: 2023, జనవరి మూడోవారంలో. 

➥ పరీక్ష తేది: 2023, జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో.

 ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ల వెల్లడి: తర్వాత ప్రకటిస్తారు.

JEE (Main) – 2023 Schedule 
JEE (Main) - 2023 Notification
Eligibility Criteria

JEE (Main) – 2023 Online Application

Official Website 

Also Read

జేఈఈ మెయిన్ మాక్ టెస్టులు అందుబాటులో! ఎలా యాక్సెస్ చేయాలంటే?
జేఈఈ మెయిన్ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. నేషనల్ టెస్ట్ అభ్యాస్ మొబైల్ యాప్‌లో ఈ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యాస్ యాప్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానాన్ని పరిచయం చేయడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. జేఈఈ మెయిన్య 2023 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉచితంగానే ఈ మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయవచ్చు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్

వీడియోలు

India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
Kaantha OTT : ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
iPhone 16 Discount: ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. iPhone 16 పై బిగ్ డిస్కౌంట్, 27,000 కంటే ఎక్కువ తగ్గింపు
ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. iPhone 16 పై బిగ్ డిస్కౌంట్, 27,000 కంటే ఎక్కువ తగ్గింపు
Rammohan Naidu: ఇండిగో తరహా సంక్షోభాలు భవిష్యత్ లో రాకుండా కఠినచర్యలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
ఇండిగో తరహా సంక్షోభాలు భవిష్యత్ లో రాకుండా కఠినచర్యలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
Embed widget