(Source: ECI/ABP News/ABP Majha)
JEE Main Result: జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఎప్పుడంటే..?
జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షా ఫలితాలు ఆగస్టు 6న విడుదల కానున్నాయి. తుది ఫలితాలు, ఆల్ ఇండియా ర్యాంకులు కూడా వెలువడనున్నాయి.
జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షా ఫలితాలు ఆగస్టు 6న విడుదల కానున్నాయి. ఆగస్టు 6న ఈ ఫలితాలను ప్రకటించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. ఈ పరీక్షల ప్రొవిజినల్ ఆన్సర్ కీ ఆగస్టు 3న వెలువడే అవకాశాలున్నాయి. ఈ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు ఆగస్టు 5లోగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
ఇందుకోసం అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.200 చొప్పున ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు నాన్ రిఫండబుల్. ప్రొవిజనల్ ఆన్సర్ కీపై అభ్యంతరాలను ఆగస్టు 5లోగా తెలపచ్చు. ఆ తర్వాత తుది ఆన్సర్ కీ, వ్యక్తిగత స్కోరు కార్డు, మెరిట్ లిస్ట్ ను విడుదల చేస్తాం అని ఎన్టీఏ అధికారులు తెలిపారు. జేఈఈ మెయిన్ 2022 ఫలితాలు, ఆన్సర్ కీని వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.
Also Read: ఆగస్టు 3 నుంచి క్యాట్-2022 దరఖాస్తులు - అర్హతలు, ముఖ్యతేదీలివే!
జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు జులై 25 నుంచి 30 వరకు జరిగాయి. మొత్తం 6.29లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. అంతకుముందు జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు నిర్వహించగా.. ఫలితాలను జులై 11న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణకు చెందిన యశ్వంత్, ఏపీకి చెందిన ఆదినారాయణ పి, కే సహాస్, పి రవిశంకర్ 100 పర్సంటైల్ సాధించడం విశేషం.
ఇక, జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జేఈఈ మెయిన్‌లో టాప్‌లో నిలిచిన 2.5 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో హాజరుకావచ్చు. జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలను మాత్రమే ఎన్‌టీఏ ప్రకటించింది. సెషన్-2 పరీక్ష తర్వాత అభ్యర్థుల ర్యాంక్‌లు ప్రకటించబడతాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. JEE మెయిన్స్ సెషన్-2 పరీక్షను జులై 21 నుంచి నిర్వహించింది. ఆ తర్వాత తుది ఫలితాలు, ఆల్ ఇండియా ర్యాంకులు ప్రకటించబడతాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 పరీక్షను ఆగస్టు 28న నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఐఐటీ బాంబే ఈ పరీక్షను నిర్వహించనుంది.
Also Read: MAT 2022 Notification: మేనేజ్‌మెంట్ కోర్సులకు సరైన మార్గం ‘మ్యాట్’
ఫలితాలు ఇలా చూసుకోండి..
Step 1: అభ్యర్థులు మొదటగా jeemain.nta.nic.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
Step 2: హో పేజీలో JEE Main 2022 Paper 2 Result అనే లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి SUBMIT బటన్‌పై క్లిక్ చేయాలి.
Step 4: అనంతరం మీ రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.