నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు, స్పెషల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
తెలంగాణలో ఫిబ్రవరి 15 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మార్చి 2 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3.55 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
తెలంగాణలో ఫిబ్రవరి 15 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మార్చి 2 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్‌కు రాష్ట్రవ్యాప్తంగా 3.55 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికోసం 2201 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను tsbie.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆయా హాల్‌టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని తెలిపారు.
ఇంటర్ బోర్డులో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు, కళాశాల యాజమాన్యాలకు ఎలాంటి సందేహాలు ఉన్నా నేరుగా 040-24600110 నెంబర్‌కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కంట్రోల్ రూమ్ ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఈ ఏడాది జరిగే ప్రాక్టిలకల్స్ పరీక్షలు ఫస్టియర్‌లో 70 శాతం, సెకండియర్‌లో 100 శాతం సిలబస్ ఆధారంగా జరుగుతాయని తెలంగాణ ఇంటర్‌బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. రోజుకు రెండు షిఫ్టుల ప్రకారం ప్రాక్టికల్స్ జరనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్ షిఫ్ట్ పరీక్షలు జరుగుతాయి. వార్షిక పరీక్షలు మాత్రం ఫస్టియర్, సెకండియర్‌లకు వంద శాతం సిలబస్‌తో ఉంటాయని స్పష్టం చేసింది.
ఇంటర్ వార్షిక పరీక్షలు ఏప్రిల్ 20,22,25,27,29 మే 2 తేదీల్లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులకు, ఏప్రిల్ 21, 23, 26, 28, 30, మే 5 తేదీల్లో ఇంటర్ సెకండియర్ విద్యార్ధులకు జరగనున్నాయి. మార్చి 4న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, మార్చి 6న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
Also Read:
AP Inter Practicals: ఫిబ్రవరిలోనే ఇంటర్ ప్రాక్టికల్స్! కొత్త షెడ్యూలు ఇదే!
ఏపీలో ఇంటర్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ మారింది. థియరీ పరీక్షలకన్నా ముందే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనుండగా.. వొకేషనల్ కోర్సులకు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలను 10 రోజుల పాటు రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
'ఇంటర్' ఆన్‌లైన్ మూల్యాంకన విషయంలో ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం, అందుకోసం మళ్లీ టెండర్లు!?
తెలంగాణ ఇంటర్మీడియేట్ ఆన్‌లైన్ వాల్యుయేషన్‌కి పిలిచిన టెండర్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ జవాబు పత్రాల డిజిటల్ మూల్యాంకనం (ఆన్‌లైన్) కోసం రెండోసారి టెండర్లు పిలవాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. తొలివిడతగా ఫిబ్రవరి 24న టెండర్ నోటిఫికేషన్ ఇవ్వగా.. బిడ్ల దాఖలుకు ఫిబ్రవరి 13తో గడువు ముగిసింది. వాల్యూయేషన్ చేసేందుకు ఒకే ఒక్క కంపెనీ ముందుకొచ్చింది. ఒకే బిడ్ వస్తే దాన్ని ఆమోదించడం కుదరదు. దీంతో వేరే బిడ్లు రాకపోవడంతో పిలిచిన టెండర్ రద్దు చేస్తూ ఇంటర్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..