TS Inter: 'ఇంటర్' ఆన్‌లైన్ మూల్యాంకన విషయంలో ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం, అందుకోసం మళ్లీ టెండర్లు!
వాల్యూయేషన్ చేసేందుకు ఒకే ఒక్క కంపెనీ ముందుకొచ్చింది. ఒకే బిడ్ వస్తే దాన్ని ఆమోదించడం కుదరదు. దీంతో వేరే బిడ్లు రాకపోవడంతో పిలిచిన టెండర్ రద్దు చేస్తూ ఇంటర్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ఇంటర్మీడియేట్ ఆన్‌లైన్ వాల్యుయేషన్‌కి పిలిచిన టెండర్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ జవాబు పత్రాల డిజిటల్ మూల్యాంకనం (ఆన్‌లైన్) కోసం రెండోసారి టెండర్లు పిలవాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. తొలివిడతగా ఫిబ్రవరి 24న టెండర్ నోటిఫికేషన్ ఇవ్వగా.. బిడ్ల దాఖలుకు ఫిబ్రవరి 13తో గడువు ముగిసింది. వాల్యూయేషన్ చేసేందుకు ఒకే ఒక్క కంపెనీ ముందుకొచ్చింది. ఒకే బిడ్ వస్తే దాన్ని ఆమోదించడం కుదరదు. దీంతో వేరే బిడ్లు రాకపోవడంతో పిలిచిన టెండర్ రద్దు చేస్తూ ఇంటర్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. అందువల్ల ఇంటర్ మార్చి పరీక్షలతోపాటు సప్లిమెంటరీ, పునఃపరిశీలనకు కలిపి మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. గ్లోబరీనా కానీ.. పేరు మార్చుకున్న కో ఆమ్ట్ ఎడ్యుటెక్ సంస్థ గానీ టెండర్లు దాఖలు చేయలేదని, దాన్నిబట్టి ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.మధుసూదన్ రెడ్డి ఆరోపణల్లో వాస్తవం లేదని తేలిందని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే గ్లోబరేనా సంస్థ చేసిన తప్పిదాలు వల్లే ఎంతో మంది విద్యార్థులకు మార్కులు తప్పులతడకగా పడినట్టు గతంలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇంటర్ విద్యా మండలి ఆన్‌లైన్ వాల్యూయేషన్ కోసం జారీ చేసిన టెండర్స్‌ను రద్దు చేయడంపై తాజాగా డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ టెండర్లకి సంబంధించి మౌలికమైన మార్పులు చేసి అనుభవం ఉన్న సంస్థలతో ఆన్‌లైన్ వాల్యుయేషన్‌ని దశలవారీగా అమలు చేయాలని ఇంటర్ విద్య జేఏసి చైర్మన్ అన్నారు. అలాగే ఆన్‌లైన్ వాల్యుయేషన్ పట్ల అధ్యాపకులకు శిక్షణ ఇచ్చి, ప్రయోగాత్మక పద్ధతిని మే నెలలో జరగబోయే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పేపర్స్ వ్యాల్యుయేషన్ నుంచి అమలు చేయాలని ఇంటర్ బోర్డుకు సూచించారు.
గ్లోబరీనా సంస్థే పేరు కో ఆమ్ట్ ఎడ్యుటెక్‌గా పేరు మార్చుకొని టెండర్లలో పాల్గొనబోతోందని, ఫిబ్రవరి 1న జరిగిన ప్రీ బిడ్ సమావేశానికి కూడా ఆ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారని మధుసూదన్ రెడ్డి ఫిబ్రవరి 7న ఆరోపించిన సంగతి తెలిసిందే. అదేరోజు రాత్రి స్పందించిన ఇంటర్ బోర్డు ఓ ప్రకటన జారీ చేస్తూ ఆ సంస్థ ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారని, గ్లోబరీనా లేదా కోఆమ్ట్ సంస్థకు టెండర్లలో పాల్గొనే అర్హత లేదని స్పష్టం చేసింది. ఎందుకు అర్హత లేదన్నది ప్రకటించలేదు. ఒకవేళ బ్లాక్ లిస్ట్‌లో పెడితే ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారో వెల్లడించలేదు. బ్లాక్ లిస్టులో పెడితే.. ఆ సంస్థ చేసిన పనిని ర్యాటిఫై చేయాలని నవంబరు 11న జరిగిన ఇంటర్ బోర్డు సమావేశంలో ఎజెండాగా ఎందుకు పెట్టారన్నది ప్రశ్న. జనవరి 30న నవీన్ మిత్తల్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కూడా గ్లోబరీనాను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు ప్రకటించకపోవడం గమనార్హం.
Also Read:
UGC NET: యూజీసీ నెట్-2022 సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్! పరీక్షల షెడ్యూలు ఇలా!
యూజీసీ నెట్-2022 సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను అందుబాటులో ఉంచింది. యూజీసీ నెట్-2022 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారు పరీక్ష సెంటర్ వివరాలకు సంబంధించిన స్లిప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్వరలోనే పరీక్ష అడ్మిట్ కార్డులను కూడా ఎన్టీఏ త్వరలోనే విడుదల చేయనుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
Inter Marks: 'ఇంటర్' విద్యార్థులకు అలర్ట్, 'ఎంసెట్' రాయాలంటే ఇన్ని మార్కులు ఉండాల్సిందే!
తెలంగాణలో ఎంసెట్ పరీక్షకు హాజరయ్యేందుకు ఇంటర్‌లో 45 శాతం మార్కులు తప్పక ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది పునరుద్ధరించనున్నారు. నిర్దిష్ట మార్కులు సాధించిన వారే ఎంసెట్ రాసే అవకాశం కల్పించాలని అధికారులు ఈ మేరకు నిర్ణయించారు. అయితే జనరల్ కేటగిరీ విద్యార్థులకు ఇంటర్ గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో 45 శాతం మార్కులు, అలాగే.. రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులు 40 శాతం మార్కులు ఉంటేనే ఎంసెట్‌కు అర్హులు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..