అన్వేషించండి

AP Inter Practicals: ఫిబ్రవరిలోనే ఇంటర్ ప్రాక్టికల్స్! కొత్త షెడ్యూలు ఇదే!

తాజా షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనుండగా.. వొకేషనల్ కోర్సులకు ఫిబ్రవరి 20 నుంచి  మార్చి 7 వరకు నిర్వహించనున్నారు.

ఏపీలో ఇంటర్ విద్యార్థుల ప్రాక్టికల్‌ పరీక్షల షెడ్యూల్‌ మారింది. థియరీ పరీక్షలకన్నా ముందే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనుండగా.. వొకేషనల్ కోర్సులకు ఫిబ్రవరి 20 నుంచి  మార్చి 7 వరకు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలను 10 రోజుల పాటు రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది.

ప్రాక్టికల్ పరీక్షలతో పాటు ఇతర పరీక్షల తేదీలను కూడా ఇంటర్ బోర్డు మార్చింది. వీటిలో ఫిబ్రవరి 22న నిర్వహించాల్సిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను ఫిబ్రవరి 15న నిర్వహించనున్నట్లు తెలిపింది. అలాగే ఫిబ్రవరి 24న నిర్వహించాల్సిన ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఫిబ్రవరి 17న నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. థియరీ పరీక్షలు యథావిధిగా షెడ్యూలు ప్రకారమే కొనసాగుతాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.

ముందు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్‌15 నుంచి మే10 వరకు రెండు విడతలుగా ఇంటర్ ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. అయితే మే వరకు ప్రాక్టికల్స్‌ ఉండటంతో ఎంసెట్‌ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం సరిపోదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రాక్టికల్స్ పరీక్షల షెడ్యూల్‌ మార్చాలని కళశాలల యాజమాన్యాల నుంచి ఇంటర్‌ బోర్డుకు విజ్ఞప్తులు అందాయి. దీంతో థియరీ ఎగ్జామ్స్‌కు ముందే ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించేందుకు తాజా షెడ్యూలును ప్రకటించింది. 

మార్చి 15 నుంచి వార్షిక పరీక్షలు..
కాగా ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూలును ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు డిసెంబరు 26న ప్రకటించిన సంగతి తెలిసందే. షెడ్యూలు ప్రకారం మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 3 వరకు నిర్వహించనున్నారు. అదేవిధంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి.

ఇంట‌ర్‌ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు:

➥ మార్చి 15 - బుధవారం - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1

➥ మార్చి 17 - శుక్రవారం - ఇంగ్లిష్ పేపర్-1

➥ మార్చి 20 - సోమవారం - మ్యాథ్స్‌ పేపర్‌-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్-1.

➥ మార్చి 23 - గురువారం - మ్యాథ్స్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1

➥ మార్చి 25 - శనివారం - ఫిజిక్స్ పేపర్-1, ఎకనావిుక్స్‌ పేపర్-1

➥ మార్చి 28 - మంగళవారం - కెవిుస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-1

➥ మార్చి 31 - శుక్రవారం - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు).

➥ ఏప్రిల్ 3 - సోమవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1

ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు:

➥ మార్చి 16 - గురువారం - సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్-2

➥ మార్చి 18 - శనివారం - ఇంగ్లిష్‌ పేపర్-2

➥ మార్చి 21 - మంగళవారం - మ్యాథ్స్‌ పేపర్‌-2ఎ, బోటనీ, సివిక్స్-2.

➥ మార్చి 24 - శుక్రవారం - మ్యాథ్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్‌-2, హిస్టరీ పేపర్‌-2.

➥ మార్చి 27 - సోమవారం - ఫిజిక్స్ పేపర్‌-2, ఎకనామిక్స్‌ పేపర్‌-2.

➥ మార్చి 29 - బుధవారం - కెవిుస్ట్రీ పేపర్‌-2, కామర్స్ పేపర్‌-2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-2

➥ ఏప్రిల్ 1 - శనివారం - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు).

➥ ఏప్రిల్ 4 - మంగళవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్‌-2, జియోగ్రఫీ పేపర్‌-2

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan:  వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
Telangana Group 1: తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు బ్రేక్-కీలక ఆదేశాలు జారీ చేసిన  హైకోర్టు
తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు బ్రేక్-కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
AP DSC 2025: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఏజ్‌ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు 
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఏజ్‌ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు 
Preeti Reddy : తెలంగాణలో కాంగ్రెస్‌ను దేవుడు కూడా కాపాడలేడు; రేవంత్ ప్రభుత్వంపై మల్లారెడ్డి కోడలు ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్‌ను దేవుడు కూడా కాపాడలేడు; రేవంత్ ప్రభుత్వంపై మల్లారెడ్డి కోడలు ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mitchell Starc vs Yashasvi Jaiswal in IPL 2025 | స్టార్క్ వర్సెస్ జైశ్వాల్  | ABP DesamAxar Patel Kuldeep Yadav vs RR | IPL 2025 లో ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న అక్షర్, కుల్దీప్DC vs RR Super Over Failure | IPL 2025 లో తొలి సూపర్ ఓవర్..చేతులారా నాశనం చేసుకున్న RRMitchell Starc vs Yashasvi Jaiswal | IPL 2025 లో కొనసాగుతున్న స్టార్క్ వర్సెస్ జైశ్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan:  వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
Telangana Group 1: తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు బ్రేక్-కీలక ఆదేశాలు జారీ చేసిన  హైకోర్టు
తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు బ్రేక్-కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
AP DSC 2025: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఏజ్‌ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు 
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఏజ్‌ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు 
Preeti Reddy : తెలంగాణలో కాంగ్రెస్‌ను దేవుడు కూడా కాపాడలేడు; రేవంత్ ప్రభుత్వంపై మల్లారెడ్డి కోడలు ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్‌ను దేవుడు కూడా కాపాడలేడు; రేవంత్ ప్రభుత్వంపై మల్లారెడ్డి కోడలు ఆసక్తికర వ్యాఖ్యలు
AP Liquor Scam News:  లిక్కర్ స్కాంలో పోలీసులతో గేమ్ ఆడుతున్న నిందితులు - ఎన్ని నోటీసులిచ్చినా ఒక్కరూ రారే - సీఐడీ ఎం చేయబోతోంది ?
లిక్కర్ స్కాంలో పోలీసులతో గేమ్ ఆడుతున్న నిందితులు - ఎన్ని నోటీసులిచ్చినా ఒక్కరూ రారే - సీఐడీ ఎం చేయబోతోంది ?
Waqf Bill:  వక్ఫ్  చట్టంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - స్టేటస్ కో విధింపు
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - స్టేటస్ కో విధింపు
Tirumala Arjitha Seva Tickets for July 2025: శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదల.. లక్కీ డిప్ రిజిస్ట్రేష‌న్‌ టైమింగ్స్ ఇవే!
శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదల.. లక్కీ డిప్ రిజిస్ట్రేష‌న్‌ టైమింగ్స్ ఇవే!
AP DSC 2025: ఏపీలో టెట్‌తో కలిపి డీఎస్సీ ఉంటుందా? ఈసారి అప్లికేషన్‌లో చేస్తున్న మార్పులేంటో తెలుసా?
ఏపీలో టెట్‌తో కలిపి డీఎస్సీ ఉంటుందా? ఈసారి అప్లికేషన్‌లో చేస్తున్న మార్పులేంటో తెలుసా?
Embed widget