IIT Kanpur Placements 2023: ఐఐటీల్లో ప్లేస్‌మెంట్ల జోరు, అంతర్జాతీయ సంస్థల్లో అందిపుచ్చుకుంటున్న అవకాశాలు
IIT Placements 2023: ఐఐటీ కాన్పూర్‌లో జరుగుతున్న క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మొదటిరోజే 485 మందికి జాబ్ ఆఫర్లు అందాయి. మరో 12 మంది విద్యార్థులు అంతర్జాతీయ ఉద్యోగ ఆఫర్లను దక్కించుకున్నారు.
IIT Placements 2023: ఎప్పటిలాగే ఈసారి కూడా ఐఐటీ కాన్పూర్‌లో ప్లేస్‌మెంట్ల జోరు కొనసాగుతోంది. డిసెంబరు 3న క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ప్రారంభంకాగా.. మొదటిరోజే 485 మందికి జాబ్ ఆఫర్లు అందాయి. మరో 12 మంది విద్యార్థులు అంతర్జాతీయ ఉద్యోగ ఆఫర్లను దక్కించుకున్నారు. ఐఐటీ కాన్పూర్‌లో 2023-24 సంవత్సరానికిగాను మైక్రోసాఫ్ట్ (Microsoft), నావి(NAVY), టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ (Texas Instrument), క్వాల్కమ్ (Qualcomm), డ్యుయిష్ బ్యాంక్ (Deutsche Bank) సంస్థలు టాప్ నియామక సంస్థలుగా నిలిచాయి. జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో మొత్తం 216 మంది విద్యార్థులు ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్లు అందుకున్నట్లు ఐఐటీ కాన్పూర్ ఒక ప్రకటనలో తెలిపింది.
గతేడాది కూడా ఈ విద్యాసంస్థలో విద్యార్థులకు భారీగానే ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఐఐటీ కాన్పూర్‌లో తొలి దశ ప్లేస్‌మెంట్స్ డ్రైవ్ డిసెంబర్ 1 నుంచి 15 వరకు నిర్వహించగా.. 1,128 మంది ఉద్యోగ అవకాశాలు దక్కాయి. వీటిలో 208 ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్లు ఉన్నాయి. గతేడాది అత్యధిక వార్షిక వేతనం దేశీయంగా రూ.1.9 కోట్లు కాగా.. 33 మంది విద్యార్థులు రూ.కోటికి పైగా వార్షిక వేతనంతో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలకు అంగీకారం కుదుర్చుకున్నారు. అయితే ఈసారి వార్షిక వేతన వివరాలను ఐఐటీ కాన్పూర్ వెల్లడించలేదు.
ఐఐటీ ఖరగ్‌పుర్‌లో ఆరుగురికి కోటి పైనే ప్యాకేజీ..
ఇక ఐఐటీ ఖరగ్‌పుర్‌లో డిసెంబరు 2న ప్రారంభమైన ప్లేస్‌మెంట్స్‌లో విద్యార్థులు తొలి రోజే 700లకు పైగా ఉద్యోగ ఆఫర్లు దక్కాయి. వీటిలో 19 అంతర్జాతీయ సంస్థలు విద్యార్థులకు ఉద్యోగ ఆఫర్లు ఇచ్చాయి. ఉద్యోగాలు పొందినవారిలో ఆరుగురు విద్యార్థులు రూ.కోటికి పైనే వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలకు ఎంపిక కావడం విశేషం. మొత్తం 61 కంపెనీలకు పైగా వివిధ విభాగాల్లో ఉద్యోగాలకు సంబంధించి తమ విద్యార్థులకు ఆఫర్లు ఇచ్చాయని, వీటిలో ప్రధానంగా సాఫ్ట్‌వేర్, అనలిటిక్స్ ఫైనాన్స్-బ్యాంకింగ్, కన్సల్టింగ్, కోర్ ఇంజినీరింగ్‌కు సంబంధించిన కొలువులు ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఇందులో దిగ్గజ సంస్థలైన యాపిల్(Apple)తో పాటు ఆర్థూూర్ డి లిటిల్(Arthur D. Little), డా విన్సి (Da Vinci), క్యాపిటల్ వన్ (Capital One), డె షా (deshaw), ఈఎక్స్‌ఎల్ సర్వీసెస్ (EXL Services), గ్లీన్ (Green), గూగుల్ (Google), గ్రావిటాన్ (Gravoton), మైక్రోసాఫ్ట్ (Microsoft), మెకెన్సీ(McKinsey), క్వాంట్ బాక్స్ (Quantbox), డేటా బ్రిక్స్ (Data Bricks), స్క్వేర్ పాయింట్(Square Point), టీఎస్‌ఎమ్ (TSM), పాలో అల్టో(Palo Alto)తో పాటు పలు ప్రఖ్యాత కంపెనీలు ప్రాంగణ నియామకాల్లో పాల్గొన్నాయి.
ALSO READ:
నిట్ వరంగల్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డిసెంబర్-2023 సెషన్‌కు సంబంధించి పీహెచ్‌డీ (PhD) ఫుల్‌టైమ్/పార్ట్‌టైమ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఇంజినీరింగ్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్, కెమికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్) విభాగాలతోపాటు బయోటెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించనున్నారు.
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..