News
News
X

GATE - 2023 ఫలితాలు విడుదల! రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే!

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 పరీక్ష ఫలితాలు మార్చి 16న విడుదలయ్యాయి. సాయంత్రం 4 గంటలకు ఐఐటీ కాన్పూర్ ఫలితాలను విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 పరీక్ష ఫలితాలు మార్చి 16న విడుదలయ్యాయి. సాయంత్రం 4.30 గంటలకు ఐఐటీ కాన్పూర్ ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. అయితే గేట్-2023 స్కోరు కార్డులు మాత్రం మార్చి 21 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఐఐటీ కాన్పూర్ ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21న ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 25 వరకు అభ్యంతరాలు స్వీకరించింది.  

గేట్ - 2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి..

గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీల(బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తో పాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి. గేట్ ద్వారా ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు డాక్టోరల్ పోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు గేట్‌ పరీక్షలో సాధించిన స్కోరు ఫలితాల వెల్లడి నుంచి 3 సంవత్సరాల పాటు వర్తిస్తుంది.

బ్రాంచ్‌లవారీగా కటాఫ్ మార్కులు ఇలా..

➥ కంప్యూటర్ సైన్స్ (సీఎస్): జనరల్ ➜ 25-30 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 22-27 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 16-20 మార్కులు. 

➥ సివిల్ ఇంజినీరింగ్ (సీఈ): జనరల్ ➜ 25-32 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 22-28 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 16-22 మార్కులు.

➥ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంఈ): జనరల్ ➜ 30-36 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 28-32 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 20-25 మార్కులు.

➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (ఈఈ): జనరల్ ➜ 25-32 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 22-30 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 16-22 మార్కులు.

➥ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీ): జనరల్ ➜ 25-30 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 22-26 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 16-22 మార్కులు.

➥ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీ): జనరల్ ➜ 25-30 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 22-26 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 16-22 మార్కులు. 

Also Read:

'బయోటెక్నాలజీ'లో పీజీ, జేఆర్‌ఎఫ్ ప్రవేశాలకు నోటిఫికేషన్, పరీక్షలు ఎప్పుడంటే?
బయోటెక్నాలజీ, దాని అనుబంధ విభాగాల్లో పీజీ కోర్సుల్లో 2023 -24 ప్రవేశాలకు సంబంధించి 'గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ - బయోటెక్నాలజీ (GAT-B) 2023' నోటిఫికేషన్ వెలువడింది. అదేవిధంగా జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ల కోసం నిర్వహించే 'బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (BET)-2023' నోటిఫికేషన్‌ను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ పరీక్షలో సాధించిన మెరిట్‌ ద్వారా వివిధ విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
ప్రవేశపరీక్షల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో లెక్చరర్‌షిప్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (జేఆర్‌ఎఫ్) అర్హత కోసం  'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్' పరీక్ష నిర్వహిస్తున్న సంగతి విదితమే. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సంయుక్తంగా ఏడాదికి రెండుసార్లు (జూన్, డిసెంబరు) ఈ అర్హత పరీక్షను నిర్వహిస్తాయి. ఈ ఏడాదికి గాను 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్- డిసెంబరు 202/ జూన్ 2023' నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చు.
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 16 Mar 2023 05:55 PM (IST) Tags: Education News in Telugu GATE Result 2023 GATE Result GATE 2023 Result Branch wise Cutoff for NIT Branch wise Cutoff for IIIT

సంబంధిత కథనాలు

AP Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!

AP Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!

APPECET - 2023: ఏపీ పీఈసెట్ – 2023 దరఖాస్తు ప్రక్రియ, ఫిజికల్ ఈవెంట్లు ఎప్పడంటే?

APPECET - 2023: ఏపీ పీఈసెట్ – 2023 దరఖాస్తు ప్రక్రియ, ఫిజికల్ ఈవెంట్లు ఎప్పడంటే?

ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!

ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!

APEdCET-2023 Notification: ఏపీ ఎడ్‌సెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!

APEdCET-2023 Notification: ఏపీ ఎడ్‌సెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!

APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!