News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

GATE: 'గేట్‌-2024' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

దేశంలోని ఐఐటీలతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే GATE-2024 దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 31న ప్రారంభమైంది.

FOLLOW US: 
Share:

దేశంలోని ఐఐటీలతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE-2024) దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 31న ప్రారంభమైంది. సెప్టెంబరు 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎక్స్‌టెండెడ్ పీరియడ్‌తో అక్టోబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.

ఈ ఏడాది కొత్తగా డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పేపర్‌ను ప్రవేశపెట్టారు. పరీక్షలను 2024 ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశంలోని 200 నగరాల్లో నిర్వహించనున్నారు. గేట్‌ స్కోర్‌ ఆధారంగా జాతీయస్థాయిలోని విద్యాసంస్థలే కాకుండా పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి.

'గేట్‌'లో ఇప్పటివరకు మొత్తం 29 ప్రశ్నపత్రాల్లో పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో గేట్ పరీక్షలో మొత్తం పేపర్ల సంఖ్య 30కి చేరినట్లయింది.

గేట్-2024 పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐఐఎస్సీ-బెంగళూరు షెడ్యూలును విడుదల చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో గేట్-2024 పరీక్ష నిర్వహించనున్నారు. గేట్‌లో సాధించిన స్కోరును బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి. 

గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీలు (బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తోపాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి.

అర్హతలు..
✦ బ్యాచిలర్స్ డిగ్రీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ).
✦ బ్యాచిలర్స్ డిగ్రీ (ఆర్కిటెక్చర్).
✦ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ విభాగంలో నాలుగేళ్ల డిగ్రీ.
✦ మాస్టర్ డిగ్రీ (సైన్స్/మ్యాథ్స్/స్టాటిస్టిక్స్/కంప్యూటర్ అప్లికేషన్స్).
✦ నాలుగేళ్ల ఇంటిగ్రేడెట్ మాస్టర్ డిగ్రీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ).
✦ ఐదేళ్ల ఇంటిగ్రేడెట్ మాస్టర్ డిగ్రీ లేదా డ్యూయల్ డిగ్రీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ).
✦ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఎలా?
✦ గేట్ పరీక్షకు దరఖాస్తు చేయగోరువారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
✦ రిజిస్ట్రేషన్ తర్వాత అభ్యర్థికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వస్తాయి. వీటి ద్వారా గేట్‌కు సంబంధించిన భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది.
✦ దరఖాస్తు సమయంలో విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికేట్ స్కాన్ కాపీలు, ప్రొవిజనల్ సర్టిఫికేట్లు అందుబాటులో ఉంచుకోవాలి.
✦ ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా అవసరమవుతుంది. ఐడీ ప్రూఫ్‌గా పాస్‌పోర్ట్, పాన్ కార్డు, ఓటరు కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కాలేజీ ఐడీ, ఎంప్లాయ్ ఐడీకార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా ఉండాలి.

పరీక్ష ఎలా ఉంటుంది?
✦ మొత్తం 30 సబ్జెక్టుల్లో గేట్ పరీక్ష నిర్వహిస్తారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతోపాటు.. ఇతర దేశాలలోని నగరాల్లో కూడా గేట్ పరీక్ష నిర్వహిస్తారు.
✦ ప్రకటించిన తేదీల్లో మొత్తం రెండు సెషన్లలో (9:30 am - 12:30 pm,  2:30 pm - 5:30 pm.) గేట్ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.
✦ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే గేట్ పరీక్షలో 100 మార్కులకు 65 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలకుగాను 15 మార్కులు; టెక్నికల్, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల నుంచి 55 ప్రశ్నలకుగాను 85 మార్కులు ఉంటాయి.
✦ నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. 1 మార్కు ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 1/3 చొప్పున, 2 మార్కుల ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 2/3 చొప్పున కోత విధిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..

తెలంగాణలో: హైదరాబాద్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్

ఏపీలో: చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, ఏలూరు, కాకినాడ, సూరంపాలెం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, కర్నూలు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.08.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 29.09.2023.

➥ గేట్- 2024 పరీక్ష తేదీలు: 2024, ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో.

Notification

Online Application

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 31 Aug 2023 06:47 PM (IST) Tags: Graduate Aptitude Test in Engineering GATE 2024 Application GATE 2024 Notification GATE 2024 Exam Dates

ఇవి కూడా చూడండి

UGC NET 2023 Notification: యూజీసీనెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షలు ఎప్పుడంటే?

UGC NET 2023 Notification: యూజీసీనెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షలు ఎప్పుడంటే?

KNRUHS: బీఎస్సీ నర్సింగ్‌ సీట్ల భర్తీకి వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం, ఎంఎస్సీ నర్సింగ్ రిజిస్ట్రేషన్ షురూ

KNRUHS: బీఎస్సీ నర్సింగ్‌ సీట్ల భర్తీకి వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం, ఎంఎస్సీ నర్సింగ్ రిజిస్ట్రేషన్ షురూ

PM SHRI: తెలంగాణలో 279 హైస్కూళ్లలో సైన్స్ ల్యాబ్‌లు, ఒక్కో పాఠశాలకు రూ.16 లక్షలు మంజూరు

PM SHRI: తెలంగాణలో 279 హైస్కూళ్లలో సైన్స్ ల్యాబ్‌లు, ఒక్కో పాఠశాలకు రూ.16 లక్షలు మంజూరు

DASARA Holidays: తెలంగాణలో దసరా, బతుకమ్మ సెలవులు, మొత్తం ఎన్ని రోజులంటే? ఏపీలో సెలవులు ఇలా!

DASARA Holidays: తెలంగాణలో దసరా, బతుకమ్మ సెలవులు, మొత్తం ఎన్ని రోజులంటే? ఏపీలో సెలవులు ఇలా!

IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, ఈ అర్హతలు అవసరం

IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, ఈ అర్హతలు అవసరం

టాప్ స్టోరీస్

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్