IIITH Admissions: హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్, వివరాలు ఇలా!
ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ 2023 విద్యా సంవత్సరానికి బీటెక్, మాస్టర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రాంలో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వెలువడింది.
ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ 2023 విద్యా సంవత్సరానికి బీటెక్, మాస్టర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రాంలో ప్రవేశానికి సంబంధించి లేటరల్ ఎంట్రీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ వెలువడింది. ఈసీఈ విభాగానికి బీఈ, బీటెక్ (ఈసీఈ/ ఈటీఈ/ ఈఐఈ/ ఈఈఈ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్); సీఎస్ఈ విభాగానికి బీఈ, బీటెక్ (సీఎస్ఈ/ ఐటీ/ ఏఐ అండ్ ఎంల్, డేటా సైన్స్) మూడో సెమిస్టర్ 80 శాతం మార్కులతో పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 31 వరకు దరఖాస్తుచేసుకోవచ్చు.
వివరాలు..
➥ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్)
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్.
➥ మాస్టర్ ఆఫ్ సైన్స్ బై రిసెర్చ్
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్.
అర్హత: జులై 2023 నాటికి ఈసీఈ విభాగానికి బీఈ, బీటెక్(ఈసీఈ/ ఈటీఈ/ ఈఐఈ/ ఈఈఈ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్); సీఎస్ఈ విభాగానికి బీఈ, బీటెక్ (సీఎస్ఈ/ ఐటీ/ ఏఐ అండ్ ఎంల్, డేటా సైన్స్) మూడో సెమిస్టర్ 80 శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.2500.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: లేటరల్ ఎంట్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్-2023 కంప్యూటర్ ఆధారిత పరీక్ష. పరీక్షలో రెండు భాగాలు (పార్ట్-ఎ, పార్ట్-బి) ఉంటాయి. పార్ట్-ఎలో ఆప్టిట్యూడ్ టెస్ట్, పార్ట్-బిలో సబ్జెక్ట్ టెస్ట్ ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 31.03.2023.
➥ పరీక్ష తేదీ: 06.05.2023.
➥ ఇంటర్వ్యూ తేదీ: 27.05.2023.
Also Read:
JNTUH Courses: జేఎన్టీయూలో కొత్త కోర్సులు వస్తున్నాయ్! ఈ ఏడాది నుంచే ప్రవేశాలు!
రానున్న విద్యాసంవత్సరంలో సరికొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు జేఎన్‌టీయూహెచ్ కసరత్తు చేస్తుంది. యూనివర్సిటీ పరిధిలో కొత్తగా అగ్రికల్చర్ టెక్నాలజీ, రేడియేషన్ ఫిజిక్స్ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. వ్యవసాయ యాంత్రీకరణకు పరిశ్రమలను ప్రోత్సహించడమేగాక ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అగ్రికల్చర్ టెక్నాలజీ కోర్సుకు రూపకల్పన చేసింది. దీంతోపాటు రేడియేషన్ ఫిజిక్స్ కోర్సును ప్రవేశపెట్టాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఒకటో తరగతి ప్రవేశాలపై కీలక నిర్ణయం! రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం లేఖలు!
కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాన్ని అనుసరించి ఒకటో తరగతిలో ఆరేళ్లు నిండిన (6+) పిల్లలకే ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను కోరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు లేఖ రాసింది. చిన్నారుల పునాది దశ విద్యాభ్యాసాన్ని బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ విద్యావిధానం-2020 సిఫార్సు చేసింది. నూతన విద్యావిధానం ప్రకారం విద్యార్థులకు పునాది దశలో అయిదేళ్లపాటు అభ్యాస అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. అందులో మొదటి మూడేళ్ల పాటు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, రెండేళ్లపాటు ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో తొలిదశ అయిన 1, 2వ తరగతులు ఉంటాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..