JNTUH Courses: జేఎన్టీయూలో కొత్త కోర్సులు వస్తున్నాయ్! ఈ ఏడాది నుంచే ప్రవేశాలు!
రానున్న విద్యాసంవత్సరంలో సరికొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు జేఎన్‌టీయూహెచ్ కసరత్తు చేస్తుంది. కొత్తగా అగ్రికల్చర్ టెక్నాలజీ, రేడియేషన్ ఫిజిక్స్ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
రానున్న విద్యాసంవత్సరంలో సరికొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు జేఎన్‌టీయూహెచ్ కసరత్తు చేస్తుంది. యూనివర్సిటీ పరిధిలో కొత్తగా అగ్రికల్చర్ టెక్నాలజీ, రేడియేషన్ ఫిజిక్స్ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. వ్యవసాయ యాంత్రీకరణకు పరిశ్రమలను ప్రోత్సహించడమేగాక ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అగ్రికల్చర్ టెక్నాలజీ కోర్సుకు రూపకల్పన చేసింది. దీంతోపాటు రేడియేషన్ ఫిజిక్స్ కోర్సును ప్రవేశపెట్టాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు.
మంథని క్యాంపస్‌లో అగ్రికల్చర్ టెక్నాలజీ కోర్సు..
వ్యవసాయ రంగంలో యంత్ర సామగ్రి పెద్దఎత్తున అవసరం పడుతుంది. వ్యవసాయ ఉపకరణాలను, యంత్ర సామగ్రిని తయారు చేసే నిపుణుల శిక్షణకు అగ్రికల్చర్ టెక్నాలజీ అనే కొత్త కోర్సును జేఎన్టీయూ మంథని క్యాంపస్‌లో అధికారులు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఈ తరహా కోర్సును ఏపీ భీమవరంలోని ఓ కాలేజీలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
కూకట్‌పల్లి క్యాంపస్‌లో ఇంటర్ డిసిప్లినరీ కోర్సు..
జేఎన్టీయూ కూకట్‌పల్లి క్యాంపస్‌లో కొత్తగా గోల్డెన్ జూబ్లీ భవనాన్ని నిర్మించనుండగా, ఇందులో ఇంటర్ డిసిప్లినరీ కోర్సులను ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ కోర్సుల్లో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ విద్యార్థులు చేరేలా చర్యలు చేపడుతున్నారు.
రేడియేషన్ ఫిజిక్స్ కోర్సు..
రాష్ట్రంలో రేడియేషన్ ఫిజిక్స్ కోర్సును ప్రస్తుతానికి ఓయూలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కోర్సులో గరిష్ఠ సీట్ల సంఖ్య 9 మాత్రమే. కార్పొరేట్ దవాఖానల్లో సీటీ స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసే నిపుణులు ఈ కోర్సును పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ కోర్సును జేఎన్టీయూ కూకట్‌పల్లి క్యాంపస్‌లో ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు.
ఎంసెట్‌తో ఆరు కోర్సులు..
వచ్చే విద్యాసంవత్సరంలో ఖమ్మం, మహబూబాబాద్‌లలో రెండు జేఎన్టీయూ క్యాంపస్‌లు ప్రారంభించనున్నారు. వీటిల్లో సీఎస్‌ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్, ఈఈఈ, మైనింగ్ వంటి 6 కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ కోర్సుల్లో సీట్లను ఎంసెట్ ద్వారా భర్తీ చేస్తారు.
Also Read:
డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో మార్పులు, వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు!
తెలంగాణలో డిగ్రీ విద్య స్వరూపం పూర్తిగా మారనుంది. నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలకు అనుగుణంగా డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొపెసర్ లింబాద్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ బేగంపేట్ లోని సెస్‌లో “అత్యుత్తమ పాఠ్యప్రణాళిక అభివృద్ధి” కోసం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసిన రెండురోజుల సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తొలి రోజు ప్రారంభోపన్యాసం చేశారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల పరిధిలో వాణిజ్యశాస్త్రం, ఆర్థికశాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం విభాగాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన పాఠ్య ప్రణాళిక అమల్లోకి రానుందని ఆయన ప్రకటించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఒకటో తరగతి ప్రవేశాలపై కీలక నిర్ణయం! రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం లేఖలు!
కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాన్ని అనుసరించి ఒకటో తరగతిలో ఆరేళ్లు నిండిన (6+) పిల్లలకే ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను కోరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు లేఖ రాసింది. చిన్నారుల పునాది దశ విద్యాభ్యాసాన్ని బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ విద్యావిధానం-2020 సిఫార్సు చేసింది. నూతన విద్యావిధానం ప్రకారం విద్యార్థులకు పునాది దశలో అయిదేళ్లపాటు అభ్యాస అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. అందులో మొదటి మూడేళ్ల పాటు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, రెండేళ్లపాటు ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో తొలిదశ అయిన 1, 2వ తరగతులు ఉంటాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..