Horizon Experiential World School: హైదరాబాద్ విద్యా రంగంలో విప్లవం: కొల్లూరులో దక్షిణ భారతదేశపు తొలి ఫిన్నిష్ క్యాంపస్ ప్రారంభం
Horizon Experiential World School: హైదరాబాద్‌లోని కొల్లూరులో అంతర్జాతీయ స్కూల్ ఫిన్నిష్ క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ఆత్యాధునిక హంగులతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.

Horizon Experiential World School: భాగ్యనగరం విద్యా ముఖచిత్రం ఒక చారిత్రాత్మక మార్పునకు సాక్ష్యంగా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ విద్యా ప్రమాణాలకు మారుపేరుగా నిలిచే ఫిన్లాండ్ విద్యా విధానం ఇప్పుడు మన హైదరాబాద్ గడ్డపై అడుగు పెట్టింది. హోరిజన్ ఎక్స్‌పీరియన్షియల్ వరల్డ్ స్కూల్ ఫిన్లాండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్‌తో చారిత్రాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుని, దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ఫిన్నిష్ క్యాంపస్‌ను హైదరాబాద్‌లోని కొల్లూరులో అధికారికంగా ప్రారంభించింది.
ఇన్నోవేషన్ ఇన్‌క్యూబేటర్‌గా పాఠశాల: శ్రీనివాసరావు
ఈ ఒప్పంద కార్యక్రమంలో టీ హబ్ మాజీ సీఈవో, ప్రముఖ ఎంటర్‌ప్రెన్యూర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నోవేషన్ అనేది కేవలం ఉన్నత విద్యలో లేదా కాలేజీ కోర్సుల్లో నేర్చుకునే అంశం కాదని, అది ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే పిల్లల రక్తంలో డీఎన్‌ఏలా ప్రవహించాలని ఆయన ఆకాంక్షించారు. HEWS కేవలం ఒక స్కూల్ మాత్రమే కాదు, ఇది తర్వాత తరం గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ల కోసం ఇక ఇన్‌క్యూబేటర్ అని ఆయన అభివర్ణించారు. పిల్లవాడు పిల్చే గాలిలోనే సృజనాత్మకత ఉండేలా ఆ పాఠశాల వాతావరణం ఉండతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఎలా నేర్చుకోవాలో నేర్పడమే ఫిన్నిష్ మార్గం: డా. జోహన్ స్టోర్‌గార్డ్
ఫిన్లాండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సీఈఓ డా జోహన్ స్టోర్‌గార్డ్ ఈ సందర్భంగా ఫిన్నిష్ విద్యా విధానంలోని ఆత్మను ఆవిష్కరించారు. ఫిన్లాండ్‌లో విద్యార్థులకు కేవలం సబ్జెక్ట్‌లు మాత్రమే నేర్పరని, అసలు ఒక విషయాన్ని ఎలా నేర్చుకోవాలో నేర్పిస్తారని ఆయన వెల్లడించారు. అత్యుత్తమ విశ్వాసం, అతి తక్కువ ఒత్తిడి ఉన్న వాతావరణంలో విద్యార్థులు తమ సహజమైన క్యూరియాసిటీతో అకడమిక్ ఎక్స్‌లెన్స్‌ను ఎలా సాధించవచ్చో HEWS నిరూపించబోతోంది ఆయన తెలిపారు. ఆనందకరమైన అభ్యాసమే ఫిన్నిష్ మోడల్ అసలు రహస్యమని ఆయన హైలైట్ చేశారు.
నేర్చుకునే ప్రక్రియలో మూడో టీచర్- దివాకర్ చింతల
పాఠశాల భవనం కేవలం సిమెంట్, ఇటుకల నిర్మాణం మాత్రమే కాదని, అది పిల్లల ఆలోచన సరళిని ప్రభావితం చేసే ఒక శక్తి అని దార్శనిక ఆర్కిటెక్ట్ దివాకర్ చింతల పేర్కొన్నారు. స్డూడియో చింతల సౌజన్యంతో రూపొందించిన ఈ క్యాంపస్ డిజైన్ గురించి ఆయన వివరిస్తూ, స్కూల్ ఆర్కిటెక్చర్ అనేది మూడో టీచర్ అని కామెంట్ చేశారు. ఈ క్యాంపస్‌లోని ప్రతి కారిడార్, ప్రతి క్లాస్ రూమ్ పిల్లల్లో కొత్త విషయాలను కనుగొనాలనే ఉత్సాహాన్ని, సమస్యలను పరిష్కరించే తత్వాన్ని రేకెత్తించేలా అత్యంత సరళంగా, అర్థవంతంగా రూపొందించారని తెలిపారు.
విద్యార్థుల మానసిక ఆరోగ్యం- డా. లావణ్య
నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అకడమిక్ స్ట్రెస్‌పై ప్రముఖ పిడియాట్రిషియన్ లావణ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఫిన్నిష్ విద్యా విధానంలో మెంటల్ హెల్త్, శారీరక శ్రమకు ఇచ్చే ప్రాధాన్యతను అమె ప్రశంసించారు. మన ప్రస్తుత విద్యా వ్యవస్థకు ఫిన్నిష్ మోడల్ ఒక ప్రివెంట్ మెడిసిన్ లాంటిదని, ఇది పిల్లల సమగ్ర ఎదుగుదలకు తోడ్పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రపంచ స్థాయికి భారతీయ విద్య- రైతా మోచెర్ల
పాంగాయా ట్రేడ్ వైస్ ప్రెసిడెంట్ రైతా మోచెర్ల మాట్లాడుతూ, అంతర్జాతీయ మార్కెట్‌లో మన పిల్లలు పోటీ పడాలంటే సరిహద్దులు దాటిన జ్ఞానం అవసరమని నొక్కి చెప్పారు. HEWS, ఫిన్లాండ్ భాగస్వామ్యం భారతీయ పాఠశాల విద్యలో ఒక కొత్త అంతర్జాతీయ బెంచ్ మార్క్‌ను సెట్ చేయబోతోందని ఆమె పేర్కొన్నారు. భారతీయ సాంస్కృతిక విలువలను ఫిన్నిష్ ఎక్స్‌పీరియన్షియల్ టెక్నిక్స్‌తో మిళితం చేయడం ఈ పాఠశాల ప్రత్యేకత.
కొల్లూరు క్యాంపస్ విశేషాలు, అడ్మిషన్లు
హైదరాబాద్‌లోని కొల్లూరులో అత్యాధునిక హంగులో సిద్ధమవుతున్న ఈ క్యాంపస్ 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభంకానుంది. ఇక్కడ విద్యార్థుల కోసం...
- ప్రపంచ స్థాయి అడ్వాన్స్‌డ్ టెక్ ల్యాబ్
- ప్రత్యేకమైన స్పోర్టింగ్ జోన్స్
- సృజనాత్మకతను వెలికి తీసే ఎక్స్‌పీరియన్సియల్ లెర్నింగ్ జోన్స్ ఏర్పాటు చేస్తున్నారు.
తమ పిల్లల భవిష్యత్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలనుకునే తల్లిదండ్రులు ఈ సరికొత్త విద్యా విధానాన్ని నేరుగా వచ్చి చూడాలని పాఠశాల యాజమాన్యం ఆహ్వానిస్తోంది. అడ్మిషన్లు, క్యాంపస్ టూర్ల కోసం ఆసక్తి ఉన్న వారు www.hews.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
హోరిజన్ ఎక్స్‌పీరియన్షియల్ వరల్డ్ స్కూల్ రాకతో హైదరాబాద్ ఇప్పుడు విద్యా విప్లవానికి కేంద్ర బిందువుగా మారింది. కేవలం మార్కులు, ర్యాంకుల వేటలో పడకుండా, పిల్లల సహజత్వాన్ని కాపాడుతూ వారిని గ్లోబల్ సిటిజన్స్‌గా మార్చడమే లక్ష్యంగా ఈ సంస్థ అడుగులు వేస్తోందని యాజమాన్యం చెబుతోంది.





















