అన్వేషించండి

కొత్త డిగ్రీలు ఇక నాలుగేళ్లు! వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు!

తెలంగాణలో ఇక నుంచి కొత్తగా ప్రవేశపెట్టే డిగ్రీ కోర్సులను నాలుగేళ్ల కాలపరిమితితోనే నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా ఈ మేరకు మార్పులు చేయనున్నారు.

తెలంగాణలో ఇకపై డిగ్రీలో కొత్తగా వచ్చే కోర్సులన్నీ నాలుగేళ్ల కాలపరిమితితో (ఆనర్స్‌ డిగ్రీ కోర్సులు) ఉండబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే దీన్ని దశల వారీగా అమలు చేయబోతున్నట్లు ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం(2023-24) నుంచి మూడేళ్ల వ్యవధితో కంప్యూటర్‌ సైన్స్‌లో బీఎస్‌సీ ఆనర్స్‌ కోర్సును ప్రవేశపెట్టాలని ఇటీవల నిర్ణయించగా తాజాగా దాన్ని నాలుగేళ్లకు పెంచనున్నారు. ఈ కోర్సులో కంప్యూటర్‌ సైన్స్‌ను ఒక సబ్జెక్టుగా కాకుండా పూర్తిస్థాయిలో బోధించేలా సిలబస్‌కు రూపకల్పన చేస్తున్నారు. కృత్రిమమేధ, సైబర్‌సెక్యూరిటీ, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ తదితర అంశాలను ఇందులో బోధిస్తారు.  

జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా ఉన్నత విద్యలో ఈ మేరకు మార్పులు చేయనున్నారు. సాధారణ డిగ్రీ కోర్సుల స్థానంలో ఆనర్స్‌ కోర్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) అన్ని రాష్ట్రాలకు తెలిపింది. దీనిపై ఇటీవల యూజీసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ జగదీశ్‌ కుమార్‌ పలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి సాధ్యాసాధ్యాలపై నివేదికను కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

మూడేళ్లకూ చదువు ఆపివేయొచ్చు..!
యూజీసీ ఛైర్మన్‌ మామిడాల జగదీశ్‌కుమార్‌ ఇటీవల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తదితరులతో ఆన్‌లైన్‌ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సులపై చర్చ జరిగింది. నాలుగేళ్లపాటు కోర్సుల్లో విద్యార్థులు నిలవడం కష్టమని, అర్హులైన అధ్యాపకుల కొరత కూడా ఉందన్న అభిప్రాయాన్ని రాష్ట్ర అధికారులు వ్యక్తం చేశారు. అందుకే కొత్తగా ప్రవేశపెట్టనున్న బీఎస్‌సీ ఆనర్స్‌ ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ను మూడేళ్ల కోర్సుగా నిర్ణయించామని తెలిపారు. దాన్ని నాలుగేళ్లకు పెంచడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు. ఇకపై ప్రవేశపెట్టే కోర్సులను మాత్రం నాలుగేళ్ల వ్యవధితో తీసుకొచ్చే ఆలోచన చేస్తామని యూజీసీ ఛైర్మన్‌కు చెప్పారు. ఒకవేళ మూడేళ్లకే వెళ్లిపోతామని విద్యార్థులు అనుకుంటే జాతీయ నూతన విద్యావిధానం ప్రకారం ఎగ్జిట్‌ ఆప్షన్‌ ఉన్నందున వారికి సాధారణ డిగ్రీ, నాలుగేళ్లు చదివేవారికి ఆనర్స్‌ డిగ్రీ ఇవ్వొచ్చని సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చారు.

కంప్యూటర్‌ సైన్స్‌ ఆనర్స్‌ కోర్సును రాష్ట్రంలోని 10కిపైగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశపెడతారు. ప్రైవేట్‌ కళాశాలలకు కూడా అనుమతిస్తారు. ఈమేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. దీనిపై ఛైర్మన్‌ లింబాద్రి మాట్లాడుతూ డిగ్రీలో ఏటా 2.50 లక్షల మంది చేరుతున్నందున వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నాలుగేళ్ల కోర్సు వల్ల నేరుగా పీహెచ్‌డీలో చేరొచ్చని, విదేశీవిద్యకు వెళ్లేందుకు కూడా 16 సంవత్సరాల చదువు అవసరమైనందున ఆ ఇబ్బంది కూడా ఉండదన్నారు.

ఓయూలో డిగ్రీ కోర్సు..
ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో.. బీటెక్‌ తరహాలోనే సైన్స్‌లో కూడా నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. ఆ కోర్సును రెండేళ్లు ఇక్కడ.. మరో రెండేళ్లు ఆస్ట్రేలియాలో పూర్తిచేసేలా అవకాశం కల్పించాలని యోచిస్తున్నారు. అలాగే బ్రిటన్, అమెరికా విశ్వవిద్యాలయాలతో కూడా ఇలాంటి ట్విన్నింగ్‌ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.

Also Read:

సీయూఈటీ పీజీ పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటినుంచంటే?
దేశవ్యాప్తంగా 142 విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే  కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ- పీజీ) తేదీలు ఖరారయ్యాయి. జూన్‌ 5 నుంచి 12వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు యూజీసీ ఛైర్మన్‌ మామిడాల జగదీశ్కుమార్‌ వెల్లడించారు. తదుపరి అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని ఆయన సూచించారు. సీయూఈటీ పీజీ దరఖాస్తుల గడువు ఏప్రిల్‌ 19తో ముగియడంతో ఆ గడువును మే 5 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. పీజీల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు మే 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని ఎన్‌టీఏ ఓ ప్రకటనలో తెలిపింది. 
దరఖాస్తు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

విద్యార్థులకు యూజీసీ గుడ్ న్యూస్, విదేశాల్లో మాదిరి చదువుకుంటూనే పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌!
విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్థులు ఒక వైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. వారి తల్లిదండ్రులు ఎంత ధనికులైనా అక్కడి విద్యార్థులకు ఇలా పార్ట్ టైం జాబ్ చేయడం అనేది వారి కరిక్యులమ్​లో ఓ భాగంగా ఉంటుంది. దీనివల్ల వారికి సంపాదన విలువ తెలియడమే గాక.. ఇండిపెండెంట్​గా ఉండే స్వభావం అలవాటవుతుందని అక్కడి విద్యాసంస్థలు భావిస్తుంటాయి. ఇప్పుడు మనదేశంలోనూ ఇదే విధానాన్ని అమలు చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కార్యచరణ సిద్ధం చేస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget