అన్వేషించండి

CUET PG Exams: సీయూఈటీ పీజీ పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటినుంచంటే?

సీయూఈటీ పీజీ దరఖాస్తుల గడువు ఏప్రిల్‌ 19తో ముగియడంతో ఆ గడువును మే 5 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. పీజీల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు మే 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా 142 విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే  కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ- పీజీ) తేదీలు ఖరారయ్యాయి. జూన్‌ 5 నుంచి 12వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు యూజీసీ ఛైర్మన్‌ మామిడాల జగదీశ్కుమార్‌ వెల్లడించారు. తదుపరి అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని ఆయన సూచించారు.

సీయూఈటీ పీజీ దరఖాస్తుల గడువు ఏప్రిల్‌ 19తో ముగియడంతో ఆ గడువును మే 5 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. పీజీల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు మే 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని ఎన్‌టీఏ ఓ ప్రకటనలో తెలిపింది. సమర్పించిన దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకొనేందుకు మే 6, 7, 8 తేదీల్లో అవకాశం కల్పించారు. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌కు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్టు ఎన్‌టీఏ తెలిపింది.

దరఖాస్తు గడువు పొడిగింపు..
దేశవ్యాప్తంగా మొత్తం 142 విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పించే కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ) దరఖాస్తు గడువును నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పొడిగించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి ఏప్రిల్‌ 19తో ముగియాల్సిన గడువును మే 5 వరకు పొడిగించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా వెంటనే తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇక దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మే 6, 7, 8 తేదీల్లో అవకాశం కల్పించింది. పరీక్ష తేదీలు, అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌, ఫలితాల ప్రకటన వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేసుకునేందుకు వీలు లేదని స్పష్టం చేసింది.

దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ-పీజీ-2023)‌ నోటిఫికేషన్ మార్చి 20న  వెలువడిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 20న ప్రారంభమైంది. అభ్యర్థులు డెబిట్/క్రెడిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా దరఖాస్తు ఫీజును చెల్లించవచ్చు. పరీక్ష షెడ్యూలును త్వరలోనే వెల్లడించనున్నారు. సీయూటీ పీజీ ప్రవేశ పరీక్షను  జూన్ 1 నుండి జూన్ 10 వరకు నిర్వహించనున్నట్లు గతంలో UGC ఛైర్మన్ ప్రకటించిన సంగతి తెలిసందే. దీని ఫలితాలు జూలైలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే పరీక్ష తేదీపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

దరఖాస్తు, సీయూఈటీ పీజీ పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..

Also Read:

విద్యార్థులకు యూజీసీ గుడ్ న్యూస్, విదేశాల్లో మాదిరి చదువుకుంటూనే పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌!
విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్థులు ఒక వైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. వారి తల్లిదండ్రులు ఎంత ధనికులైనా అక్కడి విద్యార్థులకు ఇలా పార్ట్ టైం జాబ్ చేయడం అనేది వారి కరిక్యులమ్​లో ఓ భాగంగా ఉంటుంది. దీనివల్ల వారికి సంపాదన విలువ తెలియడమే గాక.. ఇండిపెండెంట్​గా ఉండే స్వభావం అలవాటవుతుందని అక్కడి విద్యాసంస్థలు భావిస్తుంటాయి. ఇప్పుడు మనదేశంలోనూ ఇదే విధానాన్ని అమలు చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కార్యచరణ సిద్ధం చేస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీ రద్దు! జీవో జారీ చేసిన ప్రభుత్వం!
తెలంగాణ ఎంసెట్‌లో ఈసారి నుంచి ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ విద్యాశాఖ బుధవారం (ఏప్రిల్‌ 19) ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంకు కేటాయించనున్నారు. ఇప్పటివరకు ఎంసెట్‌ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్‌లోని భాషేతర సబ్జెక్టులకు... అంటే 600 మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయించేవారు. ఇక నుంచి ఇంటర్‌ మార్కులతో సంబంధం లేకుండానే ఎంసెట్‌లో స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. జేఈఈ మెయిన్, నీట్‌లలోనూ ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఎత్తివేశారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget