(Source: ECI/ABP News/ABP Majha)
Chandrayaan: చంద్రయాన్-3 'పోర్టల్' ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ, విద్యార్థుల కోసం ప్రత్యేక కోర్సులు
ఇటీవల చంద్రయాన్-3 ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే. విద్యార్థులలో అంతరిక్ష అవకాశాలపై అవగాహన కల్పించేందుకు చంద్రయాన్ 3పై పోర్టల్‌ను తీసుకొచ్చింది.
ఇటీవల చంద్రయాన్-3 ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం విద్యార్థులలో అంతరిక్ష అవకాశాలపై అవగాహన కల్పించేందుకు విద్యా మంత్రిత్వ శాఖను ప్రేరేపించింది. ఇందులో భాగంగా చంద్రయాన్ 3 ప్రాజెక్టుపై కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్ 3పై పోర్టల్‌ను అక్టోబరు 17న ప్రారంభించింది.
'అప్నా చంద్రయాన్' పేరుతో కొత్త వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. న్యూ ఢిల్లీలోని న్యూ కౌశల్ భవన్ వేదికగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇస్రో చైర్‌పర్సన్, సైన్స్ విభాగం కార్యదర్శి శ్రీధర పనికర్ సోమనాథ్ తదితరులు హాజరయ్యారు.
విద్యార్థుల కోసం కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. చంద్రయాన్‌పై ప్రత్యేక కోర్సు మాడ్యూళ్లను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పోర్టల్‌ను ప్రోత్సహించాలని ఉన్నత విద్యా సంస్థలను కోరారు. విద్యార్థులు, ఉపాధ్యాయులలో అవగాహన కల్పించి ప్రచారం చేయాలని తెలిపారు. విద్యార్థులందరినీ ఈ ప్రత్యేక కోర్సుల్లో చేరేలా ప్రోత్సహించాలని కోరారు
పోర్టల్ ఏంటి?
'అప్నా చంద్రయాన్' అనేది ఆన్‌లైన్ పోర్టల్, ఇది NCERT చే అభివృద్ధి చేయబడిన భారతదేశ చంద్రయాన్ మిషన్‌పై కలరింగ్ పుస్తకాలు, ఆన్‌లైన్ క్విజ్‌లు మరియు జిగ్సా పజిల్‌లతో సహా కార్యాచరణ-ఆధారిత అభ్యాసాన్ని కలిగి ఉంటుంది. వెబ్‌సైట్ చంద్రయాన్ మిషన్‌ను విద్యార్థుల కోసం సరళమైన రీతిలో వివరిస్తుంది. శాస్త్ర, సాంకేతిక మరియు సామాజిక అంశాల వంటి అంశాలను కవర్ చేస్తుంది. మాడ్యూల్‌లో సమగ్ర అవగాహన కోసం చంద్రయాన్ 3పై 10 ప్రత్యేక అంశాలు ఉన్నాయి.
విద్యార్థులకు మహా క్విజ్..
చంద్రయాన్-3 'మహా క్విజ్'కు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించాలని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ విద్యాసంస్థలను కోరింది. చంద్రయాన్-3 మిషన్, అంతరిక్ష శాస్త్రం గురించి విద్యార్థుల జ్ఞానాన్ని పరీక్షించేందుకు వీలుగా క్విజ్ నిర్వహించనున్నారు. అంతరిక్ష కార్యక్రమాలపై తెలుసుకోవడానికి విద్యార్థులను ప్రోత్సహించడం ఈ క్విజ్ ప్రధాన లక్ష్యం. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అక్టోబర్ 31 వరకు నమోదు చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. క్విజ్‌లో మొత్తం 10 ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు 300 సెకన్లలోపు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
ALSO READ:
AICTE: ఇంజినీరింగ్ విద్యార్థులకు 'ఆత్మస్థైర్య' పాఠాలు, మార్గదర్శకాలు జారీచేసిన ఏఐసీటీఈ
దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ అధ్యయనాలపై ఏఐసీటీఈ దృష్టి పెట్టింది. ఇంజినీరింగ్ విద్యార్థులకు మొదటి సంవత్సరంలోనే 'ఆత్మస్థైర్యం' కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావం తొలగించి మానసికంగా దృఢంగా ఉండేలా చూడాలని విశ్వవిద్యాలయాలకు సూచించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
డిగ్రీ విద్యార్థులకు 'ఇంటర్న్‌షిప్' తప్పనిసరి, మార్గదర్శకాలు విడుదల చేసిన యూజీసీ
దేశంలో 'ఇండియా స్కిల్ రిపోర్ట్ (ఐసెఆర్)-2022' నివేదిక ప్రకారం దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు 2020లో 45.97 శాతం ఉండగా.. 2021 నాటికి 46.2 శాతానికి చేరింది. అది మొత్తం 2023 నాటికి 60.62 శాతానికి వచ్చి చేరింది. విద్యార్థి దశనుంచే ఉపాధి మార్గంవైపు మళ్లించడం ద్వారా ఇది సాధ్యమైంది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో డిగ్రీ(యూజీ) విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను యూజీసీ తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను అక్టోబరు 10న విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం యూజీ ఇంటర్న్‌షిప్ రెండు రకాలుగా ఉంటుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..