AICTE: ఇంజినీరింగ్ విద్యార్థులకు 'ఆత్మస్థైర్య' పాఠాలు, మార్గదర్శకాలు జారీచేసిన ఏఐసీటీఈ
ఇంజినీరింగ్ విద్యార్థులకు మొదటి సంవత్సరంలోనే 'ఆత్మస్థైర్యం' కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది.
దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ అధ్యయనాలపై ఏఐసీటీఈ దృష్టి పెట్టింది. ఇంజినీరింగ్ విద్యార్థులకు మొదటి సంవత్సరంలోనే 'ఆత్మస్థైర్యం' కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావం తొలగించి మానసికంగా దృఢంగా ఉండేలా చూడాలని విశ్వవిద్యాలయాలకు సూచించింది.
ఇంటర్ వరకు బట్టీ విధానంలో చదివే విద్యార్థులు, ఇంజినీరింగ్ విద్యకు వచ్చేసరికి.. అక్కడి విభిన్న విద్యావిధానం వల్ల సొంత అవగాహన పద్ధతులపై దృష్టి పెట్టలేకపోతున్నారని ఏఐసీటీఈ భావిస్తోంది. ఈ సమస్యను అధిగమించడానికి వీలుగా ఇంజినీరింగ్ విద్యకు ముందుగా విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాలని జాతీయ విద్యావిధానం–2020లో సూచనలు చేసింది. ఇప్పటికే ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభమైనందున.. వచ్చే ఏడాది నుంచి యూనివర్సిటీలు దీనిపై దృష్టి సారించాలని వీలుందని ఏఐసీటీఈ స్పష్టం చేసింది.
ఏఐసీటీఈ సూచనలివే..
➥ అకడమిక్ నాలెడ్జ్‌తోపాటు అనుభవపూర్వకంగా విద్యను నేర్చుకోవడం వల్ల విద్యార్థి మానసిక వికాసం పెరుగుతుందని ఏఐసీటీఈ అభిప్రాయపడింది. దీన్ని కాలేజీలు విధిగా అనుసరించాలి.
➥ కేవలం పుస్తకాలకే కాకుండా సామాజికంగా ఎదురయ్యే సవాళ్లపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. తరగతి పాఠాలకే పరిమితం చేయకుండా సామాజిక అంశాలపై చర్చా వేదికలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. ప్రతి యూనివర్సిటీలోనూ దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి.
➥ విద్యార్థులు ఇంజినీరింగ్‌లో చేరాక ఇంటర్ వరకూ ఉన్న వాతావరణం నుంచి ఇంజినీరింగ్ అనే కొత్త ప్రపంచం అర్థమయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విద్యార్థి ఏ ప్రాంతం నుంచి వచ్చాడు? అతని సామర్థ్యం ఏమిటి? అందరిలో కలుస్తున్నాడా? వంటి అంశాలను అధ్యాపకులు గమనించాలి. తరగతి గదిలో అందరి మధ్య సఖ్యత పెరిగి స్నేహపూర్వక వాతావరణం నెలకొన్న తర్వాతే బోధన చేపట్టాలి.
➥ ఇంజినీరింగ్‌లోని వివిధ బ్రాంచీలకు చెందిన విద్యార్థుల మధ్య సమన్వయం నెలకొనేందుకు కాలేజీలు ప్రయత్నించాలి. దీనికోసం సృజనాత్మకత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపకల్పనకు వర్సిటీలు కృషి చేయాలి.
ALSO READ:
తెలంగాణలో ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫీమేల్)/ ఏఎన్‌ఎం ట్రైనింగ్ కోర్సులో ప్రవేశాలు
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం, 2023-24 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని 27 ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫీమేల్)/ ఏఎన్‌ఎం ట్రైనింగ్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబరు 20లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..
డిగ్రీ విద్యార్థులకు 'ఇంటర్న్‌షిప్' తప్పనిసరి, మార్గదర్శకాలు విడుదల చేసిన యూజీసీ
దేశంలో 'ఇండియా స్కిల్ రిపోర్ట్ (ఐసెఆర్)-2022' నివేదిక ప్రకారం దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు 2020లో 45.97 శాతం ఉండగా.. 2021 నాటికి 46.2 శాతానికి చేరింది. అది మొత్తం 2023 నాటికి 60.62 శాతానికి వచ్చి చేరింది. విద్యార్థి దశనుంచే ఉపాధి మార్గంవైపు మళ్లించడం ద్వారా ఇది సాధ్యమైంది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో డిగ్రీ(యూజీ) విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను యూజీసీ తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను అక్టోబరు 10న విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం యూజీ ఇంటర్న్‌షిప్ రెండు రకాలుగా ఉంటుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..