అన్వేషించండి

JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Anantapuram News: రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలేనని.. త్రీ వీలర్స్ నిషేధించాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలను పరామర్శించారు.

JC Prabhakar Reddy Comments On Three Wheelers: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలేనని.. వాటిని నిషేధించాలని అన్నారు. మైనర్లు, డ్రైవర్లు మద్యం మత్తులోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని.. అయితే వాటిపై అధికారులు కన్నెతి చూడడం లేదని పేర్కొన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ రెండు రోజులు హడావుడి చేసి వదిలేస్తారని మండిపడ్డారు. అనంతపురం (Anantapuram) జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతదేహాలను ఆయన పరిశీలించారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా సరిపోదని.. బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని అన్నారు.

ఘోర ప్రమాదంలో 8 మంది మృతి

కాగా, అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన 13 మంది వ్యవసాయ కూలీలు శనివారం ఉదయం గార్లదిన్నె మండలం తిమ్మంపేటలోని ఓ అరటి తోటలో పనికి వెళ్లారు. మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో పనులు ముగించుకుని ఆటోలో తిరుగు పయనమవుతుండగా.. ఆటో తలగాసిపల్లి సమీపంలో హైదరాబాద్ - బెంగుళూరు జాతీయ రహదారిని దాటుతుండగా ప్రమాదానికి గురైంది. ధర్మవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను బలంగా ఢీకొనగా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఆటోలో పరిమితికి మించి కూలీలను తరలిస్తుండగా ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. అటు, ఘటన జరిగిన ప్రాంతంలో వేగ నిరోధకాలు ఉన్నా బస్సు డ్రైవర్ బ్రేక్ వేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

శోకసంద్రమైన గ్రామం

మరోవైపు, ఈ ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన 8 మంది మృతి చెందడంతో తీవ్ర విషాదం అలుముకుంది. పోస్టుమార్టం  అనంతరం మృతదేహాలను ఆదివారం గ్రామానికి తరలించారు. అధికారులు, పోలీసులు స్వగ్రామానికి వెళ్లారు. మృతదేహాలను ఒక్కసారిగా గ్రామంలోకి తీసుకురావడంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అటు, రోడ్డు ప్రమాద ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ ఆదేశాలతో ఉరవకొండ పీఎస్ క్రీడా మైదానంలో ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధిక లోడుతో వెళ్తున్న ఆటోలకు జరిమానా విధించారు.

రోడ్డు ప్రమాద ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన ఆదివారం పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించిందన్నారు. మృతి చెందిన కుటుంబంలోని పిల్లల చదువులకు బాధ్యత తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read: Divvela Madhuri: 'జనసేన నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు' - టెక్కలి పోలీసులను ఆశ్రయించిన దివ్వెల మాధురి

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
AP JAC Demand: ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget