TS EAMCET 2023: ఎంసెట్ పరీక్షలు ఆత్మవిశ్వాసంతో రాయండి - అభ్యర్థులకు మంత్రి సబిత 'ఆల్ ది బెస్ట్'!!
తెలంగాణ ఎంసెట్ పరీక్షలు మే 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎంసెట్ విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పరీక్షలను పూర్తి ఆత్మవిశ్వాసంతో రాయాలని సూచించారు.
ఎంసెట్ విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పరీక్షలను పూర్తి ఆత్మవిశ్వాసంతో రాయాలని సూచించారు. ఇంటర్‌లో వచ్చిన ఫలితాల గురించి ఆలోచించకుండా ఎంసెట్‌పైనే శ్రద్ధ పెట్టాలని చెప్పారు. ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ లేదు కనుక తక్కువ మార్కులొచ్చాయని బాధపడితే పరీక్షలపై ప్రతికూల ప్రభావం పడుతుందని మంత్రి తెలిపారు.
తెలంగాణ ఎంసెట్ బుధవారం (మే 10) నుంచి ప్రారంభం కానుంది. తొలిరోజు అగ్రికల్చర్ విభాగం రెండు విడతల పరీక్షలకు తెలంగాణ, ఏపీల నుంచి మొత్తం 57,577 మంది హాజరుకానున్నారు. ఉదయం విడతలో తెలంగాణ నుంచి 23,486 మంది, ఏపీ నుంచి 5,199 మంది రాయనున్నారు. మధ్యాహ్నం విడతలో తెలంగాణ నుంచి 23,691 మంది, ఏపీ నుంచి 5,201 మందికి స్లాట్లు కేటాయించామని ఎంసెట్ కో కన్వీనర్ ప్రొఫెసర్ కె.విజయకుమార్ రెడ్డి తెలిపారు. అగ్రికల్చర్‌కు తెలంగాణలో 95, ఏపీలో 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ బి. డీన్ కుమార్ విద్యార్థులకు కీలక ఆదేశాలు జారీచేశారు.
మే 10 నుంచి 14 వరకు, ఆయాతేదీల్లో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం వేళ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు తెలంగాణ వ్యాప్తంగా 104 సెంటర్లు, ఏపీలో 33 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కన్వీనర్ తెలిపారు. ఎంసెట్ ఎగ్జామ్స్ సజావుగా జరిగేందుకు ఎస్‌పీలు, సీపీలు, విద్యుత్ అధికారులు, ఆర్టీసీ అధికారులు సహకారం అందించాలని కన్వీనర్ కోరారు.
Also Read:
TS పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు, చివరితేది ఎప్పడంటే?
తెలంగాణలో పాలిసెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. రూ.200 ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకునేందుకు మే 14 వరకు గడువు పెంచినట్లు పాలిసెట్ కన్వీనర్ డాక్టర్ శ్రీనాథ్ ఏప్రిల్ 25న ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 ఆలస్య రుసుంతో దరఖాస్తు గడువు ఏప్రిల్ 25తో ముగియగా.. రూ.200 ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 17న పాలిసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.
పాలిసెట్ నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్ 1 వరకు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూలును ఇంటర్‌బోర్డు ఏప్రిల్ 27న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో తప్పిన వారితోపాటు ఇంప్రూమెంట్ కోసం రాసే వారు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ విద్యార్ధులకు, అదేరోజు మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు సెకండియర్ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..