CUET UG 2025 ఫలితాలు విడుదల: మీ ర్యాంక్ ఎలా తెలుసుకోవాలి? కీలక మార్పులతో పరీక్ష!
NTA CUET UG Result 2025: ఎన్టీఏ నిర్వహించి CUET UG 2025 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్స్‌లో పెట్టారు. మీ అడ్మిట్ కార్డు, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ను ఉపయోగించి లాగిన్ అయ్యి ఫలితాలు తెలుసుకోవాలి.

NTA CUET UG Result 2025: జాతీయ స్థాయిలో సెంట్రల్ యూనివర్శిటీల్లో డిగ్రీ చదివేందుకు ఎన్టీఏ నిర్వహించిన CUET UG 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్స్ cuet.nta.nic.in అండ్ examinationservices.nic.inలో ఉంచారు. అభ్యర్థులు ఈ ఫలితాలు చూసేందుకు తమకు ఇచ్చిన అప్లికేషన్ నెంబర్, అడ్మిట్‌కార్డు నెంబర్, పుట్టినతేదీ, అక్కడ ఉచ్చిన క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 13 లక్షల మంది ఈ పరీక్ష రాశారు.
CUET UG 2025కు అప్లై చేసినప్పుడే అభ్యర్థులకు ప్రత్యేకంగా అప్లికేషన్ నెంబర్ ఇచ్చి ఉంటారు. పరీక్ష సమయంలో ఇచ్చిన అడ్మిట్ నెంబర్, పుట్టిన తేదీతో మీరు ముందుగా లాగిన్ అవ్వాలి. ఎన్టీఏ విడుదల చేసిన ఫలితాలు లిక్ ఉంటుంది. మీరు ఏ యూనివర్శిటీ పరిధిలోకి వస్తారో అక్కడ చూసి ఆ లింక్‌పై క్లిక్ చేయాలి. అందులో మీ పొజిషన్ ఏంటో చూసుకోవాలి. అనంతరం తర్వాత ప్రక్రియ కోసం సిద్ధం కావాలి.
మే 13 నుంచి జూన్ 4వరకు ఈ CUET UG పరీక్షలు నిర్వహించారు. ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు చేపట్టారు. ఇప్పటికే ఆ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీ విడుదలైంది. ఈ దఫా పరీక్షల్లో చాలా మార్పులు చేశారు. పరీక్ష సమయాన్ని మార్చారు. కొత్త సబ్జెక్ట్‌లను ప్రవేశ పెట్టారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షను మూడు విభాగాలుగా విభజించారు. అన్నీ కూడా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మొదటి పార్ట్‌లో 13 భాషలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అభ్యర్థుల ఎంచుకున్న భాష నుంచి ప్రశ్నలు ఇస్తారు. రెండో సెక్షన్‌లో మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. మూడో సెక్షన్‌లో జనరల్ ఆప్టిట్యూట్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఐదు మార్కులు ఇస్తారు. ప్రతి తప్పుడు సమధానానికి ఒక మార్క్ తీసేస్తారు.
గత ఏడాది పరీక్ష నిర్వహణలో గందరగోళం ఏర్పడింది. ఆఫ్‌లైన్‌లో హైబ్రీడ్ విధానంలో నిర్వహించడంపై చాలా విమర్శలు వచ్చాయి. అప్పుడు కూడా 13 లక్షల మందికిపై రాశారు. ఇందులో వెయ్యి మంది వరకు విద్యార్థులు పరీక్ష నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. పరీక్ష పేపర్లు ఇచ్చిన విధానంలో, అందులో ఉన్న భాష, తప్పులు ప్రస్తావిస్తూ అభ్యంతరాలు తెలిపారు. అందుకే వాటన్నింటిని సరి చేసిన ఎన్టీఏ ఈసారి ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించింది. గతంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్త పడింది.





















