Jagananna Videshi Vidya Deevena: నేడే లబ్ధిదారుల ఖాతాల్లో 'విదేశీ విద్యా దీవెన' సాయం జమ, 357 మంది విద్యార్థులకు ప్రయోజనం
ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన విద్యార్థులకు విదేశీ విద్య కోసం నిర్దేశించిన 'జగనన్న విదేశీ విద్యా దీవెన' పథకం కింద జులై 27న 45.53 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన విద్యార్థులకు విదేశీ విద్య కోసం నిర్దేశించిన 'జగనన్న విదేశీ విద్యా దీవెన' పథకం కింద నేడు (జులై 27) ఆర్థిక సహాయం అందించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా బటన్ నొక్కి 45.53 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు. ఈ పథకం కింద ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు రూ. 1.25 కోట్ల వరకు ఫీజు రీయింబెర్స్‌మెంట్ చేయనుండగా.. ఇతర విద్యార్థులకు కోటి రూపాయల వరకు 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయనుంది. ఈ దఫా 357 మంది విద్యార్థులను ఈ పథకం కింద అర్హులుగా గుర్తించింది.
కాగా, రాష్ట్ర విద్యార్థులను అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది చదువుల్లో నాణ్యత పెంపొందించి ప్రపంచంతో పోటీ పడేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు వైసీపీ సర్కార్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించింది. పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ కోర్సులకు సంబంధించి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంతో మేలు చేకూరుస్తోంది.
ఈ పథకం కింద ప్రపంచంలో టాప్ 200 యూనివర్సిటీలలో సీటు పొంది , పీజీ , పీహెచ్‌డీ లేదా ఎంబీబీఎస్ చేసే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తోంది ప్రభుత్వం.. వార్షిక ఆదాయ పరిమితి రూ.8 లక్షలు. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేస్తున్నారు.
సీఎం జగన్. గడిచిన 6 నెలల్లో 'జగనన్న విదేశీ విద్యా దీవెన' కింద రూ.65.48 కోట్లు ఆర్థిక సాయం అందించామని అధికారులు తెలిపారు. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ , టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇంజినీరింగ్, మెడిసిన్, లా, జర్నలిజం మొదలైన 21 ఫ్యాకల్టీలకు సంబంధించి టాప్-50 ర్యాంక్లు సాధించిన కళాశాలల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతర విద్యార్థులకు రూ.1 కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్.. విమాన ప్రయాణం, వీసా ఖర్చులతో సహా ఏపీ ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రపంచంలోని 320కి పైగా ఉత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పిస్తుంది.
ALSO READ:
నల్సార్ యూనివర్సిటీలో ఎంఏ&అడ్వాన్స్‌డ్ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దూరవిద్య విధానంలో 2023-2024 విద్యా సంవత్సరానికి ఎంఏ, అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
సీపెట్ చెన్నైలో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులో ప్రవేశాలు
చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్), స్కూల్ ఫర్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ ఇన్ పెట్రో కెమికల్స్ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా (మెకానికల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, పాలిమర్, ప్లాస్టిక్స్) లేదా ఐటీఐ (ఫిట్టర్/ టర్నర్/ మెషినిస్ట్) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 03 వరకు అవకాశం ఉంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో సీటు కేటాయిస్తారు.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..