CLAT Answer Key: క్లాట్-2023 ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే అభ్యంతరాలు తెలపవచ్చు. ఆన్సర్ కీపై అభ్యంతరాలను డిసెంబరు 20న ఉదయం 9 గంటల్లోగా అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక్కో ప్రశ్నకు రూ.1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
![CLAT Answer Key: క్లాట్-2023 ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం! CLAT Answer Key 2023 released on consortiumofnlus.ac.in, raise objections here CLAT Answer Key: క్లాట్-2023 ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/19/4dd8f463c4c63a633e05725414f144c21671441896013522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ లా యూనివర్సిటీల్లో బీఏ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం డిసెంబరు 18న నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ 'క్లాట్-2023' ఆన్సర్ కీని కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు పరీక్ష మాస్టర్ క్వశ్చన్ పేపర్‌ను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. క్లాట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ సమాధానాలు సరిచూసుకోవచ్చు.
ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే అభ్యంతరాలు తెలపవచ్చు. ఆన్సర్ కీపై అభ్యంతరాలను డిసెంబరు 20న ఉదయం 9 గంటల్లోగా అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక్కో ప్రశ్నకు రూ.1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్ఠితుల్లోనూ అభ్యంతరాల నమోదుకు అవకాశం ఉండదు. మొత్తం నాలుగు సీరిస్‌లలో క్లాట్ ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు ఇచ్చారు. ఆన్సర్ కీ నిమిత్తం అన్ని సిరీస్‌లకు కలిపి మాస్టర్ క్వశ్చన్ పేపర్‌ను రూపొందించారు. దీనికి సంబంధించిన ఆన్సర్ కీని అందుబాటులో ఉంచారు.
మాస్టర్ క్వశ్చన్ పేపర్, ప్రిలిమినరీ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..
క్లాట్-2023 ప్రవేశ పరీక్షను డిసెంబరు 18న దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో, 2 కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 127 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. మధ్యామ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న మొత్తం అభ్యర్థుల్లో 93.6 శాతం యూజీ పరీక్షకు, 91.7 శాతం అభ్యర్థులు పీజీ పరీక్షకు హాజరయ్యారు. ఈ ప్రవేశపరీక్షలో మొత్తం 22 లా యూనివర్సిటీలు, వాటి పరిధిలో ఉన్న 104 కాలేజీలు పాల్గొంటున్నాయి. వీటిలో ఆయా కోర్సుల్లో 2801 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో యూజీ కోర్సుల్లో 2 వేలకుపైగా సీట్లు ఉన్నాయి.
అభ్యంతరాల నమోదు ఇలా..
Step 1: క్లాట్ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి. - https://consortiumofnlus.ac.in/clat-2023/
Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే ‘Submit Objections’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
Step 3: తర్వాత అభ్యంతరాల నమోదుకు సంబంధించి ‘Type of Objection’ - ‘About the Answer Key’ లేదా ‘About the Question’ ఆప్షన్లపై ఏదో ఒకదానిపై క్లిక్ చేయాలి.
Step 4: అభ్యతరాలను నమోదుచేసి ‘Submit Objection’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
Step 5: అభ్యంతరాల నమోదు చేసిన తర్వాత 'Make Payment’ బటన్ మీద క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.
క్లాట్ పరీక్ష విధానం..
క్లాట్ యూజీ:
✪ క్లాట్ యూజీ పరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతుంది. మొత్తం 150 మార్కులకుగాను 150 ప్రశ్నలకు క్లాట్ పరీక్ష జరుగుతుంది. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు తగ్గిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది.
✪ క్లాట్ యూజీలో మొత్తం ఐదు విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ విభాగం నుంచి 10శాతం(13–17) , ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 శాతం(28–32), లీగల్ రీజనింగ్ 20 శాతం(35–39), కరెంట్ అఫైర్స్(జనరల్ నాలెడ్జ్‌తో కలిపి) నుంచి 25శాతం(35–39), లాజికల్ రీజనింగ్ నుంచి 25శాతం(28–32) ప్రశ్నలు వస్తాయి.
పీజీ(ఎల్‌ఎల్‌ఎం) క్లాట్:
✪ పీజీ(ఎల్‌ఎల్‌ఎం) క్లాట్ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. కాన్‌స్టిట్యూషనల్ లా 60 ప్రశ్నలు–60 మార్కులు, ఇతర లా సబ్జెక్టులు(కాంట్రాక్ట్, టార్ట్స్, క్రిమినల్, ఇంటర్నేషనల్ లా, ఎన్విరాన్‌మెంట్, లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లా, ఐపీఆర్ తదితర) నుంచి 60 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష ఉంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)