ISC Result 2022 Declared : ISC 12వ తరగతి ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
ISC Result 2022 Declared: సీఐఎస్సీఈ ఐఎస్సీ 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు cisce.org వెబ్ సైట్ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ISC Result 2022 Declared: కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్(CISCE) ISC 12వ తరగతి ఫలితాలు విడుదల చేసింది. CISCE అధికారిక వెబ్‌సైట్ cisce.orgలో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ISC 12వ తరగతి ఫలితాలు ప్రకటన తేదీ, సమయానికి సంబంధించి బోర్డు ముందుగానే అధికారిక ప్రకటన చేసింది. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 పరీక్షలకు హాజరుకాని అభ్యర్థుల ఫలితాలు గైర్హాజరుగా గుర్తిస్తామని సీఐఎస్సీఈ ఇప్పటికే ప్రకటించింది.
CISCE class 12 results announced: Board secretary Gerry Arathoon
— Press Trust of India (@PTI_News) July 24, 2022
18 మందికి టాప్
CISCE ISC 12వ తరగతి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ cisce.org ద్వారా యాక్సెస్ చేయవచ్చు. 99.52 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 18 మంది అభ్యర్థులు 99.75 శాతం మార్కులతో టాప్ ర్యాంక్ సాధించారని సీఐఎస్సీఈ తెలిపింది.
రీచెకింగ్ కోసం
అభ్యర్థులు వెబ్‌సైట్‌లోనే కాకుండా SMS సర్వీస్ ద్వారా కూడా తమ ఫలితాలను చూసుకోవచ్చు. మెసేజ్ బాక్స్‌లో వారి ID-ISC 1234567(నెంబర్) టైప్ చేసి 09248082883 నంబర్‌కు మెసేజ్ పంపించాలి. ఎస్ఎంఎస్ పంపిన తర్వాత పరీక్ష ఫలితాలు మెసేజ్ వస్తాయి. CISCE వెబ్‌సైట్ cisce.org ద్వారా ఫలితాన్ని తెలుసుకోవచ్చు.
ఈ ఫలితాలను రీచెకింగ్ చేసుకునేందుకు అభ్యర్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. CAREER పోర్టల్ ద్వారా రీచెకింగ్ లింక్ అందుబాటులో ఉంచారు.
CISCE class 12 results: 18 candidates share top rank with 99.75 per cent marks
— Press Trust of India (@PTI_News) July 24, 2022
ఐఎస్సీ 12వ తరగతి ఫలితాలు డౌన్‌లోడ్ చేయడం ఎలా
- ముందుగా CISCE వెబ్‌సైట్ cisce.orgని సందర్శించండి
- తర్వాత CAREER పోర్టల్‌కి వెళ్లండి
- ISC ఎంపికపై క్లిక్ చేసి, ఆపై రిపోర్టుపై క్లిక్ చేయండి
- రిజెల్ట్ చూసేందుకు ఫలితాల పట్టికపై క్లిక్ చేయండి
- ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసి కాపీని భద్రపరుచుకోండి
ఎస్ఎంఎస్ ద్వారా
కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) వెబ్‌సైట్ www.cisce.org కూడా అధిక ట్రాఫిక్ కారణంగా ఫలితం విడుదలైన తర్వాత నిలిచిపోవచ్చు. అటువంటి పరిస్థితిలో వారి ఫలితాలను తనిఖీ చేయాలనుకునే అభ్యర్థులు ఇతర మార్గాల ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. ఫలితాలను చెక్ చేయడానికి వెబ్‌సైట్‌లు, ఎస్ఎంఎస్ విధానాలను అనుసరించండి.
- ఉదాహరణకు మీ ఐడీ 1234567 అయితే ఇలా టైప్ చేయాలి - ISC 1234567.
- ఇప్పుడు ఈ సందేశాన్ని 09248082883 నంబర్‌కు పంపండి.