TS EAMCET: ఇంజినీరింగ్ 'స్పెషల్' కౌన్సెలింగ్ షెడ్యూలులో మార్పులు, కొత్త తేదీలివే!
తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి ఆగస్టు 17 నుంచి 'స్పెషల్' కౌన్సెలింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి.
తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి ఆగస్టు 17 నుంచి 'స్పెషల్' కౌన్సెలింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. కౌన్సెలింగ్‌లో నాలుగు కొత్త ఇంజినీరింగ్ కాలేజీలు, కొత్త కోర్సులు చేరడంతో కౌన్సెలింగ్ షెడ్యూలులో అధికారులు మార్పులు చేశారు. మారిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 17 నుంచి 19 వరకు ఉన్న ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల గడువును ఆగస్టు 22 వరకు పొడిగించారు. ఇక ఆగస్టు 23న సీట్లను కేటాయించాల్సి ఉండగా.. ఆగస్టు 26న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 26 నుంచి 28 వరకు సంబంధింత కళాశాలకు ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. వీరు ఆగస్టు 27 నుంచి 29 వరకు సంబంధిత కళాశాలలో నేరుగా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక స్పాట్ అడ్మిషన్లకు ఆగస్టు 26న మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.
స్పెషల్ కౌన్సెలింగ్ కొత్త షెడ్యూలు ఇలా..
➥ ఆగస్టు 17: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించి తేదీ, సమయం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫస్ట్, సెకండ్ ఫేజ్‌లో ఈ వివరాలు నింపని విద్యార్థులు మాత్రమే).
➥ ఆగస్టు 18: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్.
➥ ఆగస్టు 22: ఆప్షన్ల ఫ్రీజింగ్.
➥ ఆగస్టు 17 - ఆగస్టు 22 వరకు: సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
➥ ఆగస్టు 26: సీట్ల కేటాయింపు.
➥ ఆగస్టు 26 - ఆగస్టు 28: సీట్లు పొందిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
➥ ఆగస్టు 27 – ఆగస్టు 29 వరకు: సంబంధిత కళాశాలలో నేరుగా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
➥ స్పాట్ ప్రవేశాలు: స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన వివరాలను ఆగస్టు 23 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కేంద్రాలివే..
ALSO READ:
వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 17న వాక్‌ఇన్ కౌన్సెలింగ్
తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సుల్లో సీట్ల భర్తీకీ ఇప్పటికే నాలుగు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. అన్ని విడతల కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్ల భర్తీకి ఆగస్టు 17న యూనివర్సిటీ ఆడిటోరియంలో వాక్‌ఇన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. పాలిసెట్-2023లో ర్యాంకు పొందిన వారికి ఈ కౌన్సెలింగ్‌లో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆ తర్వాత పదోతరగతి పాసైన వారికి (పాలిసెట్ ర్యాంకు లేకున్నా) రెండో ప్రాధాన్యత ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
TS ICET: టీఎస్ ఐసెట్-2023 కౌన్సెలింగ్ వాయిదా, కొత్త షెడ్యూలు ఇదే!
తెలంగాణలో ఆగస్టు 14 నుంచి ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదాపడింది. కొత్తగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 6, 7 తేదీల్లో రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. తదనంతరం సెప్టెంబరు 8 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. వెబ్ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు ఎంసీఏ, ఎంబీఏ తొలివిడత సీట్లను సెప్టెంబర్ 17న కేటాయించనున్నారు. సెప్టెంబరు 22 నుంచి తుది విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తాంచనున్నారు.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..