CBSE FA Exams: సీబీఎస్‌ఈ ఎఫ్‌ఏ పరీక్ష తేదీల్లో మార్పు, కొత్త తేదీలివే
ఏపీలో సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8, 9 తరగతుల విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్‌మెంట్(FA)-2 పరీక్షలను అక్టోబరు 6 నుంచి 9 మధ్య నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
ఏపీలో సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8, 9 తరగతుల విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్‌మెంట్(FA)-2 పరీక్షలను అక్టోబరు 6 నుంచి 9 మధ్య నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 3 నుంచి 5 మధ్య నిర్వహించాల్సిన పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు పేర్కొంది. పరీక్ష నమూనాలో చేసిన మార్పులపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడం కోసమే తేదీల మార్పులు చేశామని అధికారులు తెలిపారు.
ఏపీలో 11 రోజుల దసరా సెలవులు..
ఈ ఏడాది ఏపీలోని పాఠశాలలకు 11 రోజులపాటు దసరా సెలవులు ఉండనున్నాయి. అకడమిక్ క్యాలెండర్‌లో ప్రకటించిన మాదిరిగా అక్టోబరు14 నుంచి 24 వరకు సెలవులు ఇవ్వనున్నారు. అక్టోబరు 5 నుంచి 11 వరకు ఎస్ఏ-1 పరీక్షలు నిర్వహించి తదనంతరం సెలువులు ఇవ్వనున్నారు. 8వ తరగతి విద్యార్థులకు మినహా.. మిగిలిన అన్ని తరగతుల విద్యార్థులకు ఉదయం పూటే పరీక్షలు నిర్వహించనున్నారు. అక్టోబరు 25 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్నాయి.
ఏపీలో పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ వివరాలు ఇలా..
తెలంగాణలో 13 రోజులు దసరా, బతుకమ్మ సెలవులు..
ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు కలిపి మొత్తం 13 రోజులు పాటు సెలవులు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ 2022-23లో దసరా సెలవులకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ ముందుగానే ప్రకటించింది. తెలంగాణలో దసరా సెలవులు 2022లో 14 రోజులు ఉండగా..2023లో మాత్రం 13 రోజులే ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 25 వరకు బతుకమ్మ, దసరా సెలవులు ఉండనున్నాయి. తిరిగి అక్టోబర్ 26న పాఠశాలల తెరుచుకోనున్నాయి. తెలంగాణలో స్కూళ్లకు సంబంధించిన 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌లో ఈ సెలవుల పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ పొందిపరిచింది.
తెలంగాణలో పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ వివరాలు ఇలా..
ALSO READ:
ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుకు అక్టోబరు 13 వరకు అవకాశం
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థుల కోసం నిర్దేశించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) దరఖాస్తుకు అక్టోబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. డిసెంబరు 10న జరిగే పరీక్షకు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అర్హులని, రెసిడెన్షియల్ విధానంలో చదువుతున్న వారికి అర్హత లేదని తెలిపారు. ఈసారి తొలిసారిగా ఎస్టీ రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచుతున్నామని వెల్లడించారు. దానివల్ల స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యే ఎస్టీ అభ్యర్థుల సంఖ్య పెరుగుతుందన్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి...
అక్టోబర్ 3న పాలిసెట్ 'స్పాట్ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం
ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఆక్టోబరు 3న స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, ప్రవేశాల కన్వీనర్ చదలవాడ నాగరాణి సెప్టెబరు 26న ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను సెప్టెంబరు 30న చూసుకోవచ్చని తెలిపారు. ఖాళీల వివరాలను సంబంధిత కళాశాల నోటీస్ బోర్డులో విభాగాలవారీగా అందుబాటులో ఉంచనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి...