Coaching Centers: శిక్షణ సంస్థలపై కేంద్రం నజర్, మోసాల నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు
ఉద్యోగాలకు, పోటీపరీక్షకు సన్నద్దమయ్యే అభ్యర్థులను మోసపూరిత ప్రకటనలతో ప్రభావితం చేసే శిక్షణ సంస్థలకు ముకుతాడు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది
Guidelines for Coachibg Centers: దేశంలోని శిక్షణ సంస్థల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలకు, పోటీపరీక్షకు సన్నద్దమయ్యే అభ్యర్థులను మోసపూరిత ప్రకటనలతో ప్రభావితం చేసే శిక్షణ సంస్థలకు ముకుతాడు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు తప్పుడు సమాచారాన్ని నిరోధించేందుకు త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనుంది. వాటిని సిద్ధం చేయడానికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో నియమించిన కమిటీ మొదటి సమావేశం తాజాగా జరిగింది.
వినియోగదారుల రక్షణ చట్టం-2019లోని నిబంధనలకు విరుద్ధంగా వస్తువులు, సేవలకు సంబంధించి తప్పుదారి పట్టించే ప్రకటనలను ఎవరూ జారీ చేయకూడదని కమిటీ స్పష్టం చేసింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోచింగ్ సంస్థలన్నింటికీ మార్గదర్శకాలు, వినియోగదారుల చట్టం వర్తిస్తుందని పేర్కొంది. అభ్యర్థులను తప్పుదోవ పట్టించేలా ఉన్న ప్రకటనలపై 31 శిక్షణ సంస్థలకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నోటీసులు జారీ చేసింది. అందులో తొమ్మిది సంస్థలకు జరిమానా విధించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ, తెలంగాణల్లోని కొన్ని సంస్థలు సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలకు సంబంధించి నమూనా ఇంటర్వ్యూకు హాజరైనా తమ వద్దే శిక్షణ తీసుకున్నారంటూ ప్రకటనలు ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తే ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది.
కమిటీ సూచనల ప్రకారం..
శిక్షణ సంస్థలు ఇచ్చే ప్రకటనల్లో విజేత ఫొటోతో ర్యాంకు, కోర్సు, వ్యవధి, ఫీజు వసూలు చేశారా? ఉచితంగా శిక్షణ ఇచ్చారా?.. అన్న సమాచారాన్ని తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది. 100 శాతం ఎంపిక లేదా 100 శాతం ఉద్యోగ హామీ అని ప్రకటించకూడదు. అదేవిధంగా కొన్ని శిక్షణ సంస్థలు తమ ప్రకటనల్లో చిన్న ఫాంట్‌లో స్పష్టంగా కనిపించనివిధంగా కొంత సమాచారం ఇస్తుంటారు. ఇకముందు దాన్ని కూడా పెద్ద ఫాంట్‌లోనే ఇవ్వాల్సి ఉంటుంది.
ALSO READ:
ప్రధాని మోదీతో ‘పరీక్షా పే చర్చ’కు తేదీ ఖరారు, ఎప్పుడంటే?
విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమానికి తేదీ ఖరారైంది. జనవరి 29న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రధాని ముఖాముఖి చర్చిస్తారని కేంద్ర విద్యాశాఖ జనవరి 13న ఒక ప్రకటనలో వెల్లడించింది. పరీక్షల సమయం దగ్గరపడుతున్న ప్రస్తుత సమయంలో.. విద్యార్థులు ప్రిపరేషన్‌పై పూర్తిగా దృష్టిసారించలేక ఒత్తిడి, భయానికి లోనవుతారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే 'పరీక్షా పే చర్చ'(Pariksha Pe Charcha) కార్యక్రమాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ ఏఢాది దాదాపు 2 కోట్ల మందికి పైగా విద్యార్థులు ఇందులో పాల్గొననున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో పోటీల ద్వారా ఎంపికైన సుమారు 2,050 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు పీపీసీ కిట్‌లను బహుమతిగా అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు. పరీక్షా పే చర్చ కార్యక్రమానికి గతేడాదితో పోలిస్తే 14.93 లక్షల మంది ఉపాధ్యాయులు, 5.69 లక్షల మంది తల్లిదండ్రులు అధికంగా హాజరుకానున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..