CBSE: సీబీఎస్‌ఈ విద్యార్థులకు అలర్ట్ - వచ్చేవారంలో 10, 12 తరగతుల పరీక్షల ఫలితాలు!
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తోన్న సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు మరోవారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాల వెల్లడికి సీబీఎస్‌ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది..
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తోన్న సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు మరోవారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. పరీక్షల ఫలితాలను విడుదల చేయడానికి సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఫలితాల విడుదలకు సంబంధించి సీబీఎస్‌ఈ బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ http://cbse.gov.in, results.cbse.nic.in ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. అడ్మిట్‌కార్డు, రిజిస్ట్రేషన్ వివరాలను విద్యార్థులు తమకు అందుబాటులో ఉంచుకోవాలి.
ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21 వరకు, సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5న వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా దాదాపు 38 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీటిలో పదోతరగతి పరీక్షలకు 21 లక్షల మందికి పైగా విద్యార్థులకు పైగా హాజరు కాగా, 12వ తరగతి బోర్డు పరీక్షలను 16 లక్షల మంది విద్యార్థులకు పైగా హాజరయ్యారు.
Also Read:
పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు, చివరితేది ఎప్పడంటే?
తెలంగాణలో పాలిసెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. రూ.200 ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకునేందుకు మే 14 వరకు గడువు పెంచినట్లు పాలిసెట్ కన్వీనర్ డాక్టర్ శ్రీనాథ్ ఏప్రిల్ 25న ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 ఆలస్య రుసుంతో దరఖాస్తు గడువు ఏప్రిల్ 25తో ముగియగా.. రూ.200 ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 17న పాలిసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.
పాలిసెట్ నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు 'ఏడీసెట్-2023' నోటిఫికేషన్ వెల్లడి, వివరాలు ఇలా!
కడపలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ & ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వివిధ ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 'ఆర్ట్ & డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏడీసెట్)-2023' నోటిఫికేషన్‌ను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(బీఎఫ్‌ఏ), బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీడిజైన్ ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏప్రిల్ 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాాగా.. మే 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
డీఈఈసెట్-2023 నోటిఫికేషన్ విడుదల, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ!
తెలంగాణలో ప్రాథమిక ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'డీఈఈసెట్-2023' (డీఎడ్) నోటిఫికేషన్ ఏప్రిల్ 21న విడుదలైంది. రెండేళ్ల కాలపరిమతితో ఉండే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 22న ప్రారంభమైంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించి ఏప్రిల్ 22 నుంచి మే 22 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
ప్రవేశ ప్రకటన, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..