News
News
వీడియోలు ఆటలు
X

Biometric Attendance: ఇక ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో 'వేలిముద్ర' పడాల్సిందే! అక్రమార్కుల ఆగడాలకు చెక్!

తెలంగాణలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు ముకుతాడు పడనుంది. విద్యార్థుల నుంచి ఫీజులను ముక్కుపిండి వసూలు చేసే ప్రైవేట్‌ కాలేజీలు అరకొర వసతులు, స్టాఫ్‌తో సరిపెట్టుకుంటూ గుర్తింపు లేకుండానే నడిపిస్తున్నాయి.

FOLLOW US: 
Share:

తెలంగాణలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు ముకుతాడు పడనుంది. విద్యార్థుల నుంచి ఫీజులను ముక్కు పిండి వసూలు చేసే ప్రైవేట్‌ కాలేజీలు అరకొర వసతులు, స్టాఫ్‌తో సరిపెట్టుకుంటూ ఇంటర్‌ బోర్డు గుర్తింపు లేకుండానే నడిపిస్తున్నాయి. ఇక లక్షల్లో ఫీజులు వసూలు చేసే మరికొన్ని కాలేజీలు అయితే ఏమాత్రం అనుభవం లేని అధ్యాపకులతో విద్యార్థులకు బోధన కొనసాగిస్తున్నాయి. ప్రవేశాల సమయంలో  సీనియర్‌ ఫ్యాకల్టీ ఉన్నారని చెప్పి.. జూనియర్‌ ఫ్యాకల్టీలతో పాఠ్యాంశాలు బోధిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

అంతేకాకుండా అధ్యాపకులను ఒక బ్రాంచ్‌లో రిక్రూట్‌ చేసుకొని వేరోక బ్రాంచ్‌కు పంపించి అక్కడ పాఠ్యాంశాలనూ బోధిస్తున్నారని పలు విద్యార్థి సంఘాలు ఆరోణలు చేస్తున్నాయి. దీంతోపాటు ఒక మెయిన్‌ బ్రాంచ్‌లో అడ్మిషన్‌ పొందిన విద్యార్థికి ఇతర క్యాంపస్‌లో కూర్చోబెడుతున్నారు. ఇలా ఒకట్రెండు రోజులైతే ఫర్వాలేదు కానీ, ఏడాది పొడవునా ఇదే తంతు కొనసాగిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థికి ఆ బ్రాంచ్‌లో అసలు అడ్మిషనే లేదని ఇంటర్‌ బోర్డు అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదికలో తేలిన విషయం తెలిసిందే. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇంటర్‌ బోర్డు ప్రత్యేక దృష్టి సారించబోతోంది.

ఎవరు ఎక్కడ అడ్మిషన్‌ తీసుకున్నారో? ఏ కాలేజీలో స్టాఫ్‌ ఎంత మంది ఉన్నారో పక్కా వివరాలు ఉండడంలేదని ఇంటర్‌ బోర్డు దృష్టికి వచ్చింది. ఈక్రమంలోనే ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో బయోమెట్రిక్‌ అమలు చేయాలని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి దీన్ని అందుబాటులోకి తేవాలని ఉన్నతాధికారులు అనుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో అమలులో ఉన్న బయోమెట్రిక్‌ విధానాన్ని ఇక నుంచి ప్రైవేట్‌, కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీల్లోనూ పక్కాగా అమలు చేసేందుకు ఇంటర్‌ బోర్డు కసరత్తులు చేస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించే పనిలో నిమగ్నమైంది.

ఇంటర్‌ పరీక్షలు ఇటీవలే ముగియడంతో జవాబు పత్రాల మూల్యాంకనంపై ఇంటర్‌బోర్డు అధికారులు ప్రస్తుతం దృష్టి సారించారు. మరోవైపు కొత్త ఏడాదికి గానూ కాలేజీల అఫిలియేషన్‌ కోసం ఇంటర్‌ బోర్డు దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఫైన్‌ లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఫిబ్రవరి 21తోనే ముగియగా, రూ.20 వేల ఫైన్‌తో ఈనెల 31 వరకు ఉంది.

ఇప్పటికే చాలా కాలేజీలు దరఖాస్తులు చేసుకున్నాయి. ఏప్రిల్‌ 30 లోపు అఫిలియేషన్‌ కాలేజీల లిస్టును ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో పెట్టనున్నారు. అయితే కాలేజీలకు అఫిలియేషన్‌ ఇచ్చిన తర్వాత, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు అన్ని కాలేజీలు తప్పకుండా బయోమెట్రిక్‌ విధానం అమలు చేయాలని ఇంటర్‌ బోర్డు ఆదేశాలను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అధ్యాపకుల వివరాలు, విద్యార్థుల వివరాలు, ఇతర సిబ్బంది వివరాలు, గుర్తింపు వివరాలు పక్కాగా చూపించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ప్రైవేట్‌ కాలేజీల వివరాలను ఎప్పటికప్పుడు ఇంటర్‌ బోర్డు పరిశీలించి అక్రమాలకు అడ్డుకట్ట వేయనుంది. 2022-23 విద్యాసంవత్సరానికి మొత్తం రాష్ట్రంలో 1856 కాలేజీలు ఇంటర్‌ బోర్డు నుంచి గుర్తింపును పొందాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ఈ అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్‌ విధానం పక్కాగా అమలు చేసే విధంగా ఇంటర్‌ బోర్డు త్వరలోనే ఆదేశాలను జారీ చేయనుంది. ఇదిలా ఉంటే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో నాలుగేళ్ల క్రితమే బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుకు చేసిన విషయం తెలిసిందే.

Also Read:

ఏకలవ్య గురుకుల ప్రవేశ ప్రకటన విడుదల, పరీక్ష వివరాలు ఇలా!
తెలంగాణ రాష్ట్రంలోని  23 ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాలకు, 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.  బోధనా మాధ్యమం ఇంగ్లీషులో సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తారు. అర్హులైన గిరిజన, ఆదివాసి గిరిజన, సంచార గిరిజన, పాక్షిక సంచార గిరిజన, డీనోటిఫైడ్ ట్రైబ్ తదితర కేటగిరీలకు చెందిన విద్యార్థులు ఏప్రిల్ 20లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మే 7న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, విద్య, శిక్షణ అందిస్తారు.
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..

కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్య తేదీలివే!
ఏపీలోని కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయం బాలికల ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 352 కేజీబీవీ పాఠశాలల్లో 2023 - 2024 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి, ఇంటర్మీడియట్‌తో పాటు 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన బ్యాక్‌లాగ్ సీట్లలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సరైన అర్హతలు గల బాలికలు ఏప్రిల్ 20లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలోని కేజీవీబి పాఠశాలల్లో దాదాపు 8600 మంది విద్యార్థినులు చదువుతున్నారు.
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 31 Mar 2023 12:22 PM (IST) Tags: Biometric Attendance Education News in Telugu Biometric in private junior colleges private junior colleges

సంబంధిత కథనాలు

Dr.BRAOU BEd Exam: అంబేడ్కర్‌ సార్వత్రిక బీఈడీ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Dr.BRAOU BEd Exam: అంబేడ్కర్‌ సార్వత్రిక బీఈడీ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!

VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!

CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్‌ షీట్స్‌ విడుదల! ఏ పరీక్ష ఎప్పుడంటే?

CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్‌ షీట్స్‌ విడుదల! ఏ పరీక్ష ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?