NEET-MDS: నీట్ ఎండీఎస్-2023, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! అప్లికేషన్ లింక్ ఇదే!
బీడీఎస్ ఉత్తీర్ణత, ఇంటర్న్‌షిప్ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
న్యూఢిల్లీలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) 2023 విద్యాసంవత్సరానికి ఎండీఎస్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీడీఎస్ ఉత్తీర్ణత, ఇంటర్న్‌షిప్ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు..
* నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) - ఎండీఎస్ 2023
అర్హత: డెంటల్ సర్జరీలో బ్యాచిలర్స్ డిగ్రీ (బీడీఎస్) ఉత్తీర్ణతతో పాటు 2023 మార్చి 31 నాటికి ఇంటర్న్‌షిప్/ ప్రాక్టికల్ ట్రెయినింగ్ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ పరీక్షని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్‌బీఈఎంఎస్) నిర్వహిస్తోంది.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.01.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 30.01.2023.
➥ పరీక్ష తేది: 01.03.2023.
➥ ఫలితాల వెల్లడి: 31.03.2023.
నీట్ పీజీ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! చివరితేది ఎప్పుడంటే?
నీట్ పీజీ 2023 దరఖాస్తు ప్రక్రియను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ జనవరి 7న ప్రారంభించింది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జనవరి 27 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 5న నీట్ పీజీ-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. అదేవిధంగా ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు దరఖాస్తుల సవరణకు చివరి అవకాశం (ఫొటో, సంతకం, వేలిముద్ర మార్పు) ఇవ్వనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఫిబ్రవరి 27న విడుదల చేయనున్నారు. మార్చి 5న పరీక్ష నిర్వహించి, 31న ఫలితాలు వెల్లడించనున్నారు. నీట్ పీజీ 2023 ప్రవేశపరీక్ష ద్వారా ఎండీ/ఎంఎస్/పీజీ డిప్లొమా కోర్సు్లో ప్రవేశాలు కల్పిస్తారు. పోస్ట్ ఎంబీబీఎస్ డీఎన్‌బీ కోర్సులు, ఆరేళ్ల డీఆర్‌ఎన్‌బీ కోర్సులు, పోస్ట్ ఎంబీబీఎస్ ఎన్‌బీఈఎంఎస్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
దరఖాస్తు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..
జేఈఈ మెయిన్ మాక్ టెస్టులు అందుబాటులో! ఎలా యాక్సెస్ చేయాలంటే?
జేఈఈ మెయిన్ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. నేషనల్ టెస్ట్ అభ్యాస్ మొబైల్ యాప్‌లో ఈ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యాస్ యాప్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానాన్ని పరిచయం చేయడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. జేఈఈ మెయిన్య 2023 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉచితంగానే ఈ మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయవచ్చు.
మాక్ టెస్ట్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..