NEET PG 2023 registration: నీట్ పీజీ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, అప్లికేషన్ లింక్ ఇదే! చివరితేది ఎప్పుడంటే?
జనవరి 27 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 5న నీట్ పీజీ-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
నీట్ పీజీ 2023 దరఖాస్తు ప్రక్రియను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ జనవరి 7న ప్రారంభించింది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జనవరి 27 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 5న నీట్ పీజీ-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. అదేవిధంగా ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు దరఖాస్తుల సవరణకు చివరి అవకాశం (ఫొటో, సంతకం, వేలిముద్ర మార్పు) ఇవ్వనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఫిబ్రవరి 27న విడుదల చేయనున్నారు. మార్చి 5న పరీక్ష నిర్వహించి, 31న ఫలితాలు వెల్లడించనున్నారు. నీట్ పీజీ 2023 ప్రవేశపరీక్ష ద్వారా ఎండీ/ఎంఎస్/పీజీ డిప్లొమా కోర్సు్లో ప్రవేశాలు కల్పి్స్తారు. పోస్ట్ ఎంబీబీఎస్ డీఎన్‌బీ కోర్సులు, ఆరేళ్ల డీఆర్‌ఎన్‌బీ కోర్సులు, పోస్ట్ ఎంబీబీఎస్ ఎన్‌బీఈఎంఎస్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు..
* నీట్ పీజీ - 2023 ప్రవేశ పరీక్ష
అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ లేదా ప్రొవిజినల్ ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956 ప్రకారం శాశ్వత లేదా తాత్కాలిక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా.
పరీక్ష విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే పీజీ ప్రవేశ పరీక్షను మొత్తం 800 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం మూడు విభాగాల నుంచి 200 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి పరీక్షకు 4 మార్కులు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం మూడున్నర గంటలు. ఇంగ్లిష్‌లో మాత్రమే ప్రశ్నలు ఉంటాయి.
పరీక్షలో మార్కుల వెయిటేజీ ఇలా...
➥ 'పార్ట్-ఎ'లో 50 ప్రశ్నలు ఉంటాయి. వాటిలో అనాటమీ-17, ఫిజియోలజీ-17, బయోకెమిస్ట్రీ-16 ప్రశ్నలు అడుగుతారు.
➥ 'పార్ట్-బి'లో 100 ప్రశ్నలు ఉంటాయి. వాటిలో పాథాలజీ-25, ఫార్మకాలజీ-20, మైక్రోబయాలజీ-20, ఫోరెన్సిక్ మెడిసిన్-10, సోషల్ & ప్రివెంటివ్ మెడిసిన్-25 ప్రశ్నలు అడుగుతారు.
➥ 'పార్ట్-బి'లో 150 ప్రశ్నలు ఉంటాయి. వాటిలో జనరల్ మెడిసిన్- డెర్మటాజీ & వెనెరియోలజీ & సైకియాట్రీ - 45 ప్రశ్నలు, జనరల్ సర్జరీ - ఆర్థోపెడిక్స్, అనస్థీషియా, రేడియోడయాగ్నసిస్-45 ప్రశ్నలు, అబ్‌స్టేట్రిక్స్ & గైనకాలజీ-30 ప్రశ్నలు, పీడియాట్రిక్స్610 ప్రశ్నలు, ఈఎన్‌టీ-10 ప్రశ్నలు, ఆప్తాల్మాలజీ-10 ప్రశ్నలు అడుగుతారు.
అర్హత మార్కులు: పరీక్షలో అర్హత మార్కులను జనరల్/ఈడబ్యూఎస్ అభ్యర్థులకు 50 పర్సంటైల్, జనరల్(PwD) అభ్యర్థులకు 50 పర్సంటైల్, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ (PwD కలిపి) అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా నిర్ణయించారు.
పరీక్ష ఫీజు: రూ.4250. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.3250 చెల్లిస్తే సరిపోతుంది.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 07.01.2023.
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 27.01.2023 (11:55PM)
➥ దరఖాస్తుల సవరణ: 30.01.2023 - 03.02.2023.
➥ దరఖాస్తుల సవరణకు చివరి అవకాశం (ఫొటో, సంతకం, వేలిముద్ర): 14.02.2023 - 17.02.2023.
➥ అడ్మిట్ కార్డుల విడుదల: 27.02.2023.
➥ పరీక్ష తేది: 05.03.2023.
➥ ఫలితాల వెల్లడి: 31.03.2023.
NEET-PG 2023 Information Bulletin
Also Read:
AP Inter Practicals: ఫిబ్రవరిలోనే ఇంటర్ ప్రాక్టికల్స్? త్వరలోనే కొత్త షెడ్యూలు!
ఏపీలో ఇంటర్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ మారనుంది. థియరీ పరీక్షలకన్నా ముందే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్15 నుంచి మే10 వరకు రెండు విడతలుగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. అయితే మే వరకు ప్రాక్టికల్స్ ఉండటంతో ఎంసెట్ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం సరిపోదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రాక్టికల్స్ పరీక్షల షెడ్యూల్ మార్చాలని కళశాలల యాజమాన్యాల నుంచి ఇంటర్ బోర్డుకు విజ్ఞప్తులు అందాయి. దీంతో థియరీ ఎగ్జామ్స్‌కు ముందే ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
జేఈఈ మెయిన్ మాక్ టెస్టులు అందుబాటులో! ఎలా యాక్సెస్ చేయాలంటే?
జేఈఈ మెయిన్ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. నేషనల్ టెస్ట్ అభ్యాస్ మొబైల్ యాప్‌లో ఈ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యాస్ యాప్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానాన్ని పరిచయం చేయడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. జేఈఈ మెయిన్య 2023 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉచితంగానే ఈ మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయవచ్చు.
మాక్ టెస్ట్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..