News
News
X

APEAPCET: 17 నుంచి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్; ఈసెట్, ఐసెట్ ఇలా

అక్టోబరు 17 నుంచి 25 వరకు రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. నవంబర్ రెండో వారం నుంచి అన్ని విభాగాలలో క్లాసులు ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి తెలిపారు.

FOLLOW US: 
 

ఏపీలో అక్టోబరు 17 నుంచి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి సోమవారం (అక్టోబరు 10) వెల్లడించారు. ఉన్నత విద్య ప్రవేశాలన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబరు 17 నుంచి 25 వరకు రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. నవంబర్ రెండో వారం నుంచి అన్ని విభాగాలలో క్లాసులు ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి తెలిపారు. అలాగే అక్టోబరు 15 నుంచి డిగ్రీ విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. డిగ్రీ విద్యార్థులకు ఈ ఏడాదినుంచి రెండు నెలల ఇంటర్న్ షిప్ ఉండనుంది.

ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ తేదీలతోపాటు పలు సెట్ల కౌన్సెలింగ్ తేదీలను కూడా ఆయన వెల్లడించారు. అవి:

* అక్టోబరు 10 నుంచి 13 వరకు  ఏపీఈసెట్ రెండో విడత కౌన్సిలింగ్‌. 

News Reels* అక్టోబరు 25 నుంచి 31 వరకు ఐసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌.

* అక్టోబరు 27 నుంచి నవంబర్ 3 వరకు పీజీసెట్ కౌన్సెలింగ్.

* అక్టోబరు 17 నుంచి 21 వరకు జీప్యాట్ రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 

ఈ ఏడాది ఈఏపీసెట్‌కు 2,82,496 మంది  హాజరుకాగా.., 2,56,983  మంది  ఉత్తీర్ణులయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో  89.12 శాతం అర్హత సాధించారు. అదేవిధంగా ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగంలో 87,744 మంది పరీక్షకు హాజరుకాగా.. 83,411 మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో మొత్తం 95.06 శాతం అర్హత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,06,579 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,94,752 మంది పరీక్ష రాశారు. వీరిలో 1,73,572 మంది క్వాలిఫై అయ్యారు. ఎంపీసీ స్ట్రీమ్‌ అభ్యర్థులకు మొదట కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా మొత్తం 1.48 లక్షల సీట్లను భర్తీచేస్తారు. 


తెలంగాణలో 11 నుంచే రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్...
తెలంగాణలో అక్టోబరు 11 నుంచి ప్రారంభం ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు అక్టోబర్ 11,12 తేదీల్లో రెండో విడత కౌన్సెలింగ్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అలాగే అక్టోబర్ 12న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులకు అక్టోబరు 12,13 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్లు, ఆ తర్వాత అక్టోబరు 16న ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు జరుగుతాయి. 

షెడ్యూలు ఇలా..

* అక్టోబర్ 11,12న రెండో విడత స్లాట్ బుకింగ్

* అక్టోబర్ 12న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన

* అక్టోబరు 12,13 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్లు

* అక్టోబరు 16న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు

 

:: ఇవీ చదవండి ::

AILET 2023: నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌యూ)-అకడమిక్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌), ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆలిండియా లా ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏఐఎల్‌ఈటీ) 2023 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. బీఏ ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్‌), ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లలో ఒక్కోదానిలో అయిదు సీట్లను విదేశీ అభ్యర్థులకు మరో అయిదు సీట్లను ఓసీఐ/ పీఐఓ అభ్యర్థులకు; పీహెచ్‌డీలో రెండు సీట్లను విదేశీయులకు ప్రత్యేకించారు. వీరికి అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. వీరు ఎంట్రెన్స్‌ టెస్ట్‌ రాయనవసరం లేదు.
ప్రవేశ ప్రకటన, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..

 

AP RCET - 2022: ఏపీ ఆర్‌సెట్ షెడ్యూలు వచ్చేసింది, ఏరోజు ఏ పరీక్ష అంటే?
ఏపీలోని 16 యూనివర్సిటీలలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్(ఫుల్ టైమ్/పార్ట్ టైమ్) ప్రవేశాల కోసం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (APRCET-2022) షెడ్యూలును ఆంధ్ర యూనివర్సిటీ విడుదల చేసింది. షెడ్యులును అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్‌లో పరీక్ష తేదీలను తెలుసుకోవచ్చు.
పరీక్ష షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

 

Pharmacy Seats: తగ్గనున్న ఫార్మసీ సీట్లు, 2వేల సీట్లకు కోతపడే అవకాశం!
తెలంగాణలో ఈ విద్యా సంవత్సరం (2022-23) ఫార్మసీ సీట్లు తగ్గనున్నాయి. గతేడాది మొత్తం బీఫార్మసీ, ఫార్మ్‌-డీ సీట్లు 13,799 అంబాటులో ఉండగా.. ఈసారి ఈ సీట్లలో 2 వేలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఫార్మసీ కాలేజీలకు ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రభావం ఈ విద్యాసంవత్సరం సీట్లపై పడనుంది. ఫార్మసీ కళాశాలల్లో పీసీఐ బృందాలు జరిపిన తనిఖీల్లో ఆయా కాలేజీలు నిబంధనలమేర నడుచుకోవట్లేదని తేలడంతో బీఫార్మసీ, ఫార్మ్‌-డీ, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లోని సీట్లలో భారీగా కోత విధిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సీట్ల కోత అంశం ఈ విద్యా సంవత్సరం రాష్ట్రంలో అందుబాటులో ఉండే సీట్లపై తీవ్ర ప్రభావం చూపనుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 11 Oct 2022 08:32 AM (IST) Tags: Education News in Telugu Engineering counselling APEAPCET counselling APEAPCET Second Phase Counselling AP ICET Conselling AP ECET Cunselling

సంబంధిత కథనాలు

IIT Placements: 'ఐఐటీ'ల్లో కొలువుల కోలాహలం, రికార్డు స్థాయిలో నియామకాలు, రూ.కోట్లలో వేతన ప్యాకేజీలు!

IIT Placements: 'ఐఐటీ'ల్లో కొలువుల కోలాహలం, రికార్డు స్థాయిలో నియామకాలు, రూ.కోట్లలో వేతన ప్యాకేజీలు!

BTech Admissions: ఇంజినీరింగ్ ప్రవేశాలు ఈసారి భారీగానే, కారణమిదే!

BTech Admissions: ఇంజినీరింగ్ ప్రవేశాలు ఈసారి భారీగానే, కారణమిదే!

లిప్‌స్టిక్ లేని కాలంలో ఏం పూసుకునేవాళ్లో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!

లిప్‌స్టిక్ లేని కాలంలో ఏం పూసుకునేవాళ్లో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!

AP Inter Exam Fee: ఇంటర్‌ సెకండియర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు 19 వరకు అవకాశం! ఆలస్య రుసుముతో ఎప్పటివరకంటే?

AP Inter Exam Fee: ఇంటర్‌ సెకండియర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు 19 వరకు అవకాశం! ఆలస్య రుసుముతో ఎప్పటివరకంటే?

మిరపకాయలకు ఓ హిస్టరీ ఉందన్న విషయం మీకు తెలుసా.? అసలు మిర్చీ ఎందుకు కారంగా ఉంటుంది?

మిరపకాయలకు ఓ హిస్టరీ ఉందన్న విషయం మీకు తెలుసా.? అసలు మిర్చీ ఎందుకు కారంగా ఉంటుంది?

టాప్ స్టోరీస్

CM Jagan Review : ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర, ధాన్యం సేకరణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

CM Jagan Review : ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర, ధాన్యం సేకరణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Guntur Knife Attack : గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి

Guntur Knife Attack : గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!