Pharmacy Seats: తగ్గనున్న ఫార్మసీ సీట్లు, 2వేల సీట్లకు కోతపడే అవకాశం!
ఫార్మసీ కళాశాలల్లో పీసీఐ బృందాలు జరిపిన తనిఖీల్లో ఆయా కాలేజీలు నిబంధనలమేర నడుచుకోవట్లేదని తేలడంతో బీఫార్మసీ, ఫార్మ్-డీ, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లోని సీట్లలో భారీగా కోత విధిస్తూ ఇటీవల నిర్ణయం..
తెలంగాణలో ఈ విద్యా సంవత్సరం (2022-23) ఫార్మసీ సీట్లు తగ్గనున్నాయి. గతేడాది మొత్తం బీఫార్మసీ, ఫార్మ్-డీ సీట్లు 13,799 అంబాటులో ఉండగా.. ఈసారి ఈ సీట్లలో 2 వేలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఫార్మసీ కాలేజీలకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రభావం ఈ విద్యాసంవత్సరం సీట్లపై పడనుంది. ఫార్మసీ కళాశాలల్లో పీసీఐ బృందాలు జరిపిన తనిఖీల్లో ఆయా కాలేజీలు నిబంధనలమేర నడుచుకోవట్లేదని తేలడంతో బీఫార్మసీ, ఫార్మ్-డీ, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లోని సీట్లలో భారీగా కోత విధిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సీట్ల కోత అంశం ఈ విద్యా సంవత్సరం రాష్ట్రంలో అందుబాటులో ఉండే సీట్లపై తీవ్ర ప్రభావం చూపనుంది.
Also Read: EFLU: ఇఫ్లూలో పార్ట్-టైమ్ లాంగ్వేజ్ కోర్సులు, దరఖాస్తు చేసుకోండి!
దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఫార్మసీ కాలేజీల్లో పీసీఐ అధికారులు చేపట్టిన తనిఖీల్లో అర్హులైన అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు లేరని, ఉద్యోగులకు నిబంధనల మేరకు జీతాలు ఇవ్వడంలేదని గుర్తించారు. ఈ క్రమంలో బీఫార్మసీ కాలేజీల్లోని బీఫార్మసీ సీట్లను 100 నుంచి 60కు తగ్గిస్తూ పీసీఐ సెప్టెంబర్ నెలలో పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఫార్మ్-డి సీట్లను 30 నుంచి 20కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకోగా, ఎంఫార్మసీలో 30 సీట్లుండగా కొన్ని కాలేజీల్లో 20కి, మరికొన్ని కాలేజీల్లో 10కి తగ్గిస్తూ పీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ విద్యా సంవత్సరం 2022-23 బీ-ఫార్మసీ, ఫార్మ్-డీ సీట్లు భారీగా తగ్గనున్నాయి. ఈ ప్రభావం దేశవ్యాప్తంగా కనిపించనుంది.
Also Read: జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
కోర్టుకెక్కిన కళాశాలలు..
కొన్ని కాలేజీల్లో 100 సీట్ల నుంచి 60కి, 30 నుంచి 20కి, 30 నుంచి 10కి సీట్లను తగ్గిస్తూ పీసీఐ తీసుకున్న నిర్ణయంపై కళాశాలలు కోర్టును ఆశ్రయించాయి. ఈ మేరకు అప్పీల్‌కు వెళ్లాయి. రాష్ట్రంలో ఫార్మసీ కాలేజీలు 122 ఉండగా, ఒక్కొక్క కాలేజీలో 60 వరకు బీ-ఫార్మసీ సీట్లు ఉంటే, 55 ఫార్మ్-డీ కాలేజీల్లో 30 చొప్పున సీట్లు ఉన్నాయి. ఇందులో మొత్తం సీట్లు దాదాపు 13,850 వరకు ఉండేవి. అయితే గత విద్యా సంవత్సరం కౌన్సెలింగ్‌ల అధికారులు చెప్పిన దానిప్రకారం మాత్రం బీ-ఫార్మసీ, ఫార్మ్-డీ 13,799 సీట్లల్లో 12,736 సీట్లు మాత్రం భర్తీ అయ్యాయి. అయితే కాలేజీ యాజమాన్యాలు అప్పీల్‌కు వెళ్లడంతో ఎన్ని సీట్లు ఉంటాయనేది తేలాల్సి ఉంది. ఈ సారి మొత్తం సీట్లలో 2000 వరకు సీట్లు కోత పడనున్నట్లు కాలేజీ యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఈ నెలాఖరు నాటికి సీట్ల అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
:: ఇవీ చదవండి ::
AILET 2023: నేషనల్ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌యూ)-అకడమిక్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్), ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆలిండియా లా ఎంట్రెన్స్ టెస్ట్ (ఏఐఎల్‌ఈటీ) 2023 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. బీఏ ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్), ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లలో ఒక్కోదానిలో అయిదు సీట్లను విదేశీ అభ్యర్థులకు మరో అయిదు సీట్లను ఓసీఐ/ పీఐఓ అభ్యర్థులకు; పీహెచ్‌డీలో రెండు సీట్లను విదేశీయులకు ప్రత్యేకించారు. వీరికి అకడమిక్ మెరిట్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు. వీరు ఎంట్రెన్స్ టెస్ట్ రాయనవసరం లేదు.
ప్రవేశ ప్రకటన, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..
AP RCET - 2022: ఏపీ ఆర్‌సెట్ షెడ్యూలు వచ్చేసింది, ఏరోజు ఏ పరీక్ష అంటే?
ఏపీలోని 16 యూనివర్సిటీలలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్(ఫుల్ టైమ్/పార్ట్ టైమ్) ప్రవేశాల కోసం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (APRCET-2022) షెడ్యూలును ఆంధ్ర యూనివర్సిటీ విడుదల చేసింది. షెడ్యులును అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్‌లో పరీక్ష తేదీలను తెలుసుకోవచ్చు.
పరీక్ష షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..