AP Inter: ‘ఇంటర్’ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు, ఆఖరు తేదీ ఇదే!
విద్యార్థులు పరీక్ష ఫీజు దరఖాస్తుకు రూ.10, పరీక్ష ఫీజు కింద రూ.700 చెల్లించాల్సి ఉంటుంది. రెగ్యులర్ విద్యార్థులు, గతంలో ఫెయిల్ అయినవారు, హాజరు మినహాయింపు కోరే ఫీజు చెల్లించవచ్చు.
![AP Inter: ‘ఇంటర్’ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు, ఆఖరు తేదీ ఇదే! APBIE Exam Fees: Last date for payment of Inter exam fee with fine extended AP Inter: ‘ఇంటర్’ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు, ఆఖరు తేదీ ఇదే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/02/7e7e42d9fed0f1d2a27a00c3250993891670001310701522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఇంటర్మీడియట్‌కు సంబంధించి ఆన్‌లైన్ చెల్లింపుల సర్వీసులు సాంకేతిక సమస్య కారణంగా జనవరి 2 వరకు పని చేయవని కార్యదర్శి శేషగిరిబాబు డిసెంబరు 29న తెలిపారు. డేటాను క్లౌడ్ టెక్నాలజీలోకి మార్పు చేస్తున్నందున నాలుగు రోజులపాటు ఆన్‌లైన్ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా కళాశాలల అనుబంధ గుర్తింపు ఫీజు, అపరాధ రుసుము రూ.500తో ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లింపు గడువును జనవరి 4 వరకు పొడిగించినట్లు వెల్లడించారు.
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఆలస్య రుసుము లేకుండా డిసెంబరు 19 వరకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే రూ.120 ఆలస్య రుసుముతో డిసెంబరు 26 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో జనవరి 4 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో జనవరి 9 వరకు, రూ.2,000 ఆలస్య రుసుముతో జనవరి 17 వరకు, రూ.3,000 ఆలస్య రుసుముతో జనవరి 23 వరకు, రూ.5,000 ఆలస్య రుసుముతో జనవరి 30 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంది. విద్యార్థులు పరీక్ష ఫీజు దరఖాస్తుకు రూ.10, పరీక్ష ఫీజు కింద రూ.700 చెల్లించాల్సి ఉంటుంది. రెగ్యులర్ విద్యార్థులు, గతంలో ఫెయిల్ అయినవారు, హాజరు మినహాయింపు కోరే ప్రైవేటు విద్యార్థులు, గ్రూపు మార్చుకున్నవారు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, తేదీల వివరాలివే!
ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూలును ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు డిసెంబరు 26న ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించనున్నారు. అదేవిధంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఇంటర్ ప్రాక్టికల్స్ షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఏప్రిల్ 15 నుంచి 25 వరకు, ఏప్రిల్ 30 నుంచి మే 10 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను ఫిబ్రవరి 22న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఫిబ్రవరి 24న నిర్వహించనున్నారు.
ఇంటర్ పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
Also Read:
తెలంగాణ పదోతరగతి పరీక్షల పూర్తి షెడ్యూలు ఇదే! క్వశ్చన్ పేపర్ ఇలా!
తెలంగాణలో పదోతరగతి పరీక్షల షెడ్యూలును ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 3న ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 11తో ప్రధాన పరీక్షలు, 13న ఒకేషనల్ పరీక్షలు ముగియనున్నాయి. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.
తెలంగాణ పదోతరగతి పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల, తేదీలివే!
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తోన్న సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పదోతరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మొదలై మార్చి 21వరకు కొనసాగనుండగా.. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలై ఏప్రిల్ 5వరకు జరుగుతాయని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఆయా తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10.30 గంటలకు మొదలవుతాయని వెల్లడించింది. రెండు సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్ ఇవ్వడంతో పాటు జేఈఈ మెయిన్ వంటి పోటీ పరీక్షలను పరిగణనలోకి తీసుకొని డేట్ షీట్‌లను తయారు చేసినట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలిపింది.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)